OTT Teaser: ఓటీటీలోకి సూపర్ హిట్ ఫ్రాంచైజ్ సీక్వెల్- ఫ్యూచర్ టెక్నాలజీతో బ్లేడ్ రన్నర్ 2099 టీజర్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?
OTT Series Blade Runner 2099 Teaser Released: సూపర్ హిట్ ఫ్రాంచైజ్ బ్లేడ్ రన్నర్ నుంచి కొత్త సీక్వెల్ సిరీస్ 'బ్లేడ్ రన్నర్ 2099' టీజర్ శాన్ డియాగో కామిక్-కాన్ వేదికగా విడుదలైంది. మిచెల్ యో, హంటర్ షాఫర్ నటించిన ఈ ఓటీటీ సిరీస్ బ్లేడ్ రన్నర్ 2099 టీజర్ ఫ్యూచర్ టెక్నాలజీ విజువల్స్‌తో ఆకట్టుకుంటోంది.
OTT Series Blade Runner 2099 Teaser Released: హాలీవుడ్ సినీ ప్రపంచంలో సైన్స్ ఫిక్షన్ చిత్రాలకు కొత్త అర్థం చెప్పిన ఐకానిక్ ఫ్రాంచైజ్ 'బ్లేడ్ రన్నర్'. దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది అభిమానులను సంపాదించుకున్న ఈ దిగ్గజ ఫ్రాంచైజ్ నుంచి ఇప్పుడు తొలిసారిగా ఒక లైవ్-యాక్షన్ వెబ్ సిరీస్ రాబోతోంది.

బ్లేడ్ రన్నర్ 2099 ఓటీటీ సిరీస్
'బ్లేడ్ రన్నర్ 2099' (Blade Runner 2099) పేరిట రూపొందుతున్న ఈ ఎనిమిది ఎపిసోడ్ల లిమిటెడ్ సిరీస్ అధికారిక టీజర్‌ను అమెజాన్ ఎంజీఎమ్ స్టూడియోస్ ప్రతిష్ఠాత్మక శాన్ డియాగో కామిక్-కాన్ (Comic-Con) ఈవెంట్‌లో శనివారం (జూలై 25) విడుదల చేసింది.
ఓటీటీ సిరీస్ కథ
'బ్లేడ్ రన్నర్ 2049' చిత్రం ముగిసిన 50 ఏళ్ల తర్వాత జరిగే పరిణామాల ఆధారంగా ఈ ఓటీటీ సిరీస్ కథ సాగుతుంది. మానవాళి రహితంగా సరికొత్తగా పునర్నిర్మితమైన భవిష్యత్ లాస్ ఏంజిల్స్ నగర నేపథ్యాన్ని ఇందులో ఆవిష్కరించారు.
ఇద్దరి ప్రయాణం
గత జ్ఞాపకాల నుంచి పారిపోవాలనుకునే 'కోరా' (హంటర్ షాఫర్) తన చివరి గుర్తింపుగా ఒక 'బ్లేడ్ రన్నర్' అవతారం ఎత్తుతుంది. తన ఆయుష్షు చివరలో ఉన్న 'ఒల్వెన్' (ఆస్కార్ విజేత మిచెల్ యో) అనే రెప్లికెంట్‌తో (హ్యూమనాయిడ్ ఆండ్రాయిడ్) కలిసి, నగర ఉనికికే ప్రమాదకరంగా మారిన ఒక రహస్యాన్ని బయటపెట్టే క్రమంలో వారు సాగించే ప్రయాణమే ఈ కథ.
హాలీవుడ్ ప్రముఖుల కలయిక..
గత ఐదేళ్లుగా నిర్మాణంలో ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును 'షైనింగ్ గర్ల్స్' ఫేమ్ సిల్కా లూయిసా షోరన్నర్‌గా వ్యవహరిస్తూ సృష్టించారు. హంటర్ షాఫర్, మిచెల్ యోతో పాటు డిమిట్రి అబోల్డ్, మాథ్యూ నీధమ్, డేనియల్ రిగ్బీ, లూయిస్ గ్రిబ్బెన్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.
నవంబర్‌లో ఓటీటీ స్ట్రీమింగ్
అమెజాన్ ప్రైమ్ వీడియోలో బ్లేడ్ రన్నర్ 2099 ఓటీటీ రిలీజ్ కానుంది. నవంబర్ 25 నుంచి ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ ప్రైమ్‌లో బ్లేడ్ రన్నర్ 2099 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఇందుకోసం ముహూర్తం ఖరారు చేసింది. మన దేశంలోనూ హాలీవుడ్ కంటెంట్‌కు ఆదరణ పెరిగిన నేపథ్యంలో, భారతీయ వీక్షకులకు అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా ఇది అందుబాటులోకి రానుంది.
నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన లెజెండరీ ఫ్రాంచైజ్
1982లో లెజెండరీ డైరెక్టర్ రిడ్లీ స్కాట్ దర్శకత్వంలో వచ్చిన 'బ్లేడ్ రన్నర్' హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ చరిత్రలోనే ఒక విప్లవాత్మక చిత్రంగా నిలిచింది. ఫిలిప్ కె. డిక్ రాసిన 'డూ ఆండ్రాయిడ్స్ డ్రీమ్ ఆఫ్ ఎలక్ట్రిక్ షీప్?' నవల ఆధారంగా హారిసన్ ఫోర్డ్ హీరోగా వచ్చిన ఆ సినిమా సినీ ప్రియులను కట్టిపడేసింది.
విమర్శకుల ప్రశంసలు
ఆ తర్వాత 2017లో డెనిస్ విల్లేనువ్ దర్శకత్వంలో, ర్యాన్ గోస్లింగ్, హారిసన్ ఫోర్డ్ కాంబినేషన్‌లో వచ్చిన 'బ్లేడ్ రన్నర్ 2049' కూడా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాక విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
టీజర్‌తోనే భారీ అంచనాలు
ఇప్పుడు రానున్న 'బ్లేడ్ రన్నర్ 2099' టీజర్‌లో కనిపించిన నియాన్ కాంతుల నగర దృశ్యాలు, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ, మైండ్-బెండింగ్ వాతావరణం సినీ ప్రేమికులకు విజువల్ ఫీస్ట్‌ను కలిగించేందుకు హామీ ఇచ్చేలా ఉన్నాయి. టీజర్‌తోనే భారీ అంచనాలను పెంచేసిన ఈ సిరీస్ బ్లేడ్ రన్నర్ 2099 అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఏ స్థాయి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


