OTT: లాక్ అప్ 2 ఓటీటీ షో నుంచి తొలి కంటెస్టెంట్‌గా శ్రేయాస్ అయ్యర్ చెల్లి శ్రేష్ఠ అయ్యర్ ఎలిమినేట్- నటుడిపై కంగనా ఫైర్

Shresta Iyer Eliminated From Lock Upp 2 OTT Show: ప్రముఖ ఓటీటీ రియాలిటీ షో 'లాక్ అప్ 2' మొదటి వారంలోనే టీమిండియా క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠ అయ్యర్ ఎలిమినేట్ అయ్యారు. మరోవైపు షోలోకి ఎంట్రీ ఇచ్చిన కంగనా రనౌత్.. కంటెస్టెంట్, నటుడు రామ్ కపూర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Published on: Jul 5, 2026, 10:26:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Shresta Iyer Eliminated From Lock Upp 2 OTT Show: బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన బోల్డ్ రియాలిటీ షో 'లాక్ అప్' సీజన్ 2 (Lock Upp 2: Sach Ya Sazaa) సరికొత్త ట్విస్టులతో దూసుకుపోతోంది. ఓటీటీ వేదికగా సాగుతున్న ఈ జైలు ఆటలో మొదటి వారంలోనే ఊహించని పరిణామం ఎదురైంది.

లాక్ అప్ 2 ఓటీటీ షో నుంచి తొలి కంటెస్టెంట్‌గా శ్రేయాస్ అయ్యర్ చెల్లి శ్రేష్ఠ అయ్యర్ ఎలిమినేట్- నటుడిపై కంగనా రనౌత్ ఫైర్!
లాక్ అప్ 2 ఓటీటీ షో నుంచి తొలి కంటెస్టెంట్‌గా శ్రేయాస్ అయ్యర్ చెల్లి శ్రేష్ఠ అయ్యర్ ఎలిమినేట్- నటుడిపై కంగనా రనౌత్ ఫైర్!

శ్రేయాస్ అయ్యర్ చెల్లి

స్టార్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠ అయ్యర్ ఈ ఓటీటీ షో నుంచి మొదటి కంటెస్టెంట్‌గా ఎలిమినేట్ అయ్యారు. అయితే, షో నుంచి బయటకు వచ్చినందుకు ఆమె ఏమాత్రం బాధపడకుండా, ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి డాన్స్ చేస్తూ సంబరాలు చేసుకోవడం విశేషం.

అన్న నీడ నుంచి బయటకు రావాలి: ఫరా ఖాన్

షో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్.. శ్రేష్ఠ ఎలిమినేషన్ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "షోలో నీ ప్రయాణం ముగిసినప్పటికీ.. నీ అన్నయ్య నీడ నుంచి బయటకు వచ్చే సరికొత్త ప్రయాణం ఇప్పుడే మొదలైందని ఆశిస్తున్నాను" అని ఫరా ఖాన్ పేర్కొన్నారు.

దీనికి శ్రేష్ఠ ఎంతో పరిణతితో సమాధానమిచ్చారు. "ఆ నీడ ఎప్పటికీ నాతోనే ఉంటుంది. నా అన్నయ్యను చూసి నేను ఎప్పుడూ గర్వపడతాను" అని శ్రేష్ఠ స్పష్టం చేశారు. దీంతో ఫరా ఖాన్ స్పందిస్తూ.. అది నిన్ను కమ్మేసే నీడలా కాకుండా, ఆశ్రయాన్ని ఇచ్చే చల్లని నీడలా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. శ్రేష్ఠ కూడా మరింత కష్టపడి పైకి వస్తానని సమాధానమిచ్చారు.

ఇంట్లో గ్రాండ్ వెల్కమ్.. నెటిజన్ల ప్రశంసలు

లాక్ అప్ 2 ఓటీటీ షో నుంచి ఎలిమినేట్ అయి సూట్‌కేస్‌తో ఇంటికి వచ్చిన శ్రేష్ఠకు కుటుంబ సభ్యులు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. టీవీలో లాక్ అప్ షో చూస్తున్న వాళ్లు.. శ్రేష్ఠ లోపలికి రాగానే ఎగిరిగంతేస్తూ డాన్స్ చేశారు. శ్రేష్ఠ కూడా వారితో కలిసి స్టెప్పులేసింది.

దీనికి సంబంధించిన వీడియోను శ్రేష్ఠ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. "నేను నిజంగా ఉండాల్సిన నా ఇంటికి తిరిగి రావడం చాలా ఆనందంగా ఉంది" అని రాసుకొచ్చారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు, క్రికెట్ అభిమానులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. "నువ్వు చాలా స్వచ్ఛమైన మనసుతో ఒంటరిగా పోరాడావు, నీ గురించి గర్వంగా ఉంది" అంటూ కామెంట్లు పెడుతున్నారు.

రామ్ కపూర్‌‌కు క్లాస్ పీకిన కంగనా రనౌత్

ఇదిలా ఉంటే, తాజా ఎపిసోడ్‌లో 'లాక్ అప్' మొదటి సీజన్ హోస్ట్, బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. ఎలిమినేషన్ రౌండ్‌లో కంటెస్టెంట్ల ఆటతీరును విశ్లేషిస్తూ ఆమె ఎవరినీ వదల్లేదు. నటుడు రామ్ కపూర్ నిర్లక్ష్యపు వైఖరిపై కంగనా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆటను అస్సలు సీరియస్‌గా తీసుకోకుండా వ్యవహరిస్తున్నావని మండిపడ్డారు.

"రామ్, నువ్వు ఈ ఆటను అస్సలు సీరియస్‌గా తీసుకోలేదు. ఈ జైలు కంటే నువ్వు చాలా పెద్దవాడివి అనుకుంటే అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ అమాయకత్వాన్ని, చేతగానితనాన్ని చూపించడానికా?" అని కంగనా ఘాటుగా ప్రశ్నించారు.

సంతృప్తి చెందని కంగనా

కంగనా విమర్శలపై రామ్ కపూర్ కూడా గట్టిగానే బదులిచ్చారు. సరైన సమయం వచ్చినప్పుడు తన నిజాయితీ ఏంటో అందరికంటే మెరుగ్గా నిరూపించుకుంటానని చెప్పారు. రామ్ ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని కంగనా.. హౌస్‌లో అతని వైఖరిని తప్పుబడుతూనే ఉన్నారు.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో

మొత్తంమ్మీద శ్రేష్ఠ ఎలిమినేషన్, కంగనా ఎంట్రీతో లాక్ అప్ 2 ఓటీటీ షో ఒక్కసారిగా హీటెక్కింది. ఇక నెట్‌ఫ్లిక్స్‌లో లాక్ అప్ సీజన్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న విషయం తెలిసిందే.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More