OTT Release: ఓటీటీలోకి 2 రోజుల్లోనే 31 సినిమాలు- 19 చాలా స్పెషల్, తెలుగులో 9 ఇంట్రెస్టింగ్- హారర్ నుంచి బోల్డ్ వరకు!
OTT Release Movies New: ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 31 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 19 సినిమాలు ఉంటే తెలుగులో 9 ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి. హారర్ థ్రిల్లర్స్ నుంచి బోల్డ్ రొమాంటిక్ వంటి జోనర్లలో ఉన్న ఆ ఓటీటీ స్ట్రీమింగ్ సినిమాలేంటో తెలుసుకుందాం.
OTT Release Movies New: ఓటీటీలోకి 2 రోజుల్లో ఏకంగా 31 సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చాయి. జియో హాట్‌స్టార్ నుంచి ఆహా ఓటీటీ వరకు స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలపై లుక్కేద్దాం.

జియో హాట్‌స్టార్ ఓటీటీ
సర్వైవింగ్ ఎర్త్ (ఇంగ్లీష్ నేచర్ డాక్యుమెంటరీ సిరీస్)- జూన్ 11
దృఢమ్ (తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ పోలీస్ ప్రోసీజరల్ డ్రామా సినిమా)- జూన్ 12
బిలో డెక్ మెడిటెరియన్-సీజన్ 11 (ఇంగ్లీష్ రియాలిటీ లైఫ్‌స్టైల్, ట్రావెల్ డాక్యుమెంటరీ సిరీస్)- జూన్ 12
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
డే దత్తాస్ ది సిరీస్ సీజన్ 2 (డచ్ కామెడీ వెబ్ సిరీస్)- జూన్ 11
రాఖ్ (తెలుగు డబ్బింగ్ హిందీ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 12
కరుప్పు/వీరభద్రుడు (తెలుగు డబ్బింగ్ తమిళ యాక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ డ్రామా సినిమా)- జూన్ 12
విజిల్(తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సూపర్‌నాచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ)- జూన్ 12
డాగ్ 51 (ఫ్రెంచ్ సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 12
ఓవర్ యువర్ డెడ్ బాడీ (ఇంగ్లీష్ యాక్షన్ కామెడీ థ్రిల్లర్ మూవీ)- జూన్ 12
పవర్ బుక్ 3 రైజింగ్ కనన్ సీజన్ 5 (ఇంగ్లీష్ క్రైమ్ డ్రామా యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 12
క్లో ఎట్ ఎమ్మా (జపనీస్ మిస్టరీ కామెడీ డ్రామా చిత్రం)- జూన్ 12
దే విల్ కిల్ యూ (ఇంగ్లీష్ హారర్ యాక్షన్ కామెడీ థ్రిల్లర్ మూవీ)- జూన్ 12 (రెంటల్ విధానంలో)
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
స్వీట్ మ్యాగ్నోలియాస్ సీజన్ 5 (ఇంగ్లీష్ ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 11
ది ఈవిల్ లాయర్ (ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ కోర్ట్ రూమ్ డ్రామా వెబ్ సిరీస్ )- జూన్ 11
వైరల్ హిట్ (సౌత్ కొరియన్ లైవ్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 11
డబుల్ హ్యాపీనెస్ (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 11
భూత్ బంగ్లా (హిందీ హారర్ కామెడీ సినిమా)- జూన్ 12
ఐ యామ్ ఫ్రాంకెల్డా (మెక్సికన్ స్టాప్ మోషన్ యానిమేటెడ్ మ్యూజికల్ డార్క్ ఫాంటసీ మూవీ)- జూన్ 12
ది పాలిగమిస్ట్ (తెలుగు డబ్బింగ్ సౌత్ ఆఫ్రికన్ సూపర్‌నోవెల్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 12
అవుట్ లాస్ట్ ది జంగిల్- (హాలీవుడ్ కాంపిటీషన్ రియాలిటీ సర్వైవల్ వెబ్ సిరీస్)- జూన్ 12
మెటర్నల్ ఇన్‌స్టింక్ట్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ ఫిల్మ్)- జూన్ 12
జీ5 ఓటీటీ
ఫిఫా వరల్డ్ కప్ 2026 (ఫుట్‌బాల్ స్పోర్ట్స్ లైవ్)- జూన్ 11
మా హై నా (హిందీ రియాలిటీ షో)- జూన్ 12
తార్ఖతా (బెంగాలీ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 12
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ
షెల్టర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ)- జూన్ 12
విక్కీ క్రిస్టీ బార్సిలోనా (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- జూన్ 12
సెకండ్ మ్యారేజ్ (తెలుగు కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఈటీవీ విన్ ఓటీటీ- జూన్ 11
డీఎస్‌పీ దేవ్ 2 (పంజాబీ క్రైమ్ యాక్షన్ డ్రామా ఫిల్మ్)- చౌపల్ ఓటీటీ- జూన్ 11
ష్ సీజన్ 3 (తెలుగు బోల్డ్ రొమాంటిక్ డ్రామా అంథాలజీ వెబ్ సిరీస్)- ఆహా ఓటీటీ- జూన్ 12
రమణి కల్యాణం (తెలుగు మ్యూజికల్ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా సినిమా)- సన్ నెక్ట్స్ ఓటీటీ- జూన్ 12
దే విల్ కిల్ యూ (ఇంగ్లీష్ హారర్ యాక్షన్ కామెడీ థ్రిల్లర్ మూవీ)- హెబీవో మ్యాక్స్ ఓటీటీ- జూన్ 12
క్వీన్స్ (బెంగాలీ రివేంజ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- హోయ్‌చోయ్ ఓటీటీ- జూన్ 12
ఓటీటీలోకి 2 రోజుల్లో 31 సినిమాలు
ఇలా గురు (జూన్ 11), శుక్ర (జూన్ 12) రెండు రోజుల్లో ఏకంగా 31 సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. వాటిలో చాలా స్పెషల్‌గా రమణి కళ్యాణం, క్వీన్స్, దే విల్ కిల్ యూ, ష్ సీజన్ 3, సెకండ్ మ్యారేజ్, కరుప్పు, షెల్టర్, తార్ఖతా, మా హై నా, ది పాలిగమిస్ట్, ది ఈవిల్ లాయర్, వైరల్ హిట్ సినిమాలు ఉన్నాయి.
స్పెషల్‌గా 19, తెలుగులో 9
వీటితోపాటు ఓవర్ యువర్ డెడ్ బాడీ, భూత్ బంగ్లా, డాగ్ 51, విజిల్, మెటర్నల్ ఇన్‌స్టింక్ట్, రాఖ్, దృఢమ్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 19 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 9 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ రెండు ఓటీటీల్లో 9 సినిమాలు అందుబాటులో ఉన్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


