OTT Telugu Today: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు ఫ్యామిలీ డ్రామా- అందరికి కనెక్ట్ అయ్యే ఎమోషన్‌తో- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Telugu Family Drama Illu OTT Release Today: ఇవాళ తెలుగు ఫ్యామిలీ డ్రామా ఇల్లు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రతి ఒక్క మధ్యతరగతి మనిషి కనెక్ట్ అయ్యే ఎమోషనల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో హర్ష వర్ధన్ ప్రధాన పాత్ర పోషించారు. మరి ఇల్లు ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jun 14, 2026, 12:48:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telugu Family Drama Illu OTT Streaming Today: ఇటీవల ఎక్కువగా ఓటీటీల్లో లవ్ స్టోరీలు, క్రైమ్, హారర్, సైకలాజికల్ థ్రిల్లర్ల సినిమాలు ఎక్కువ అవుతున్నాయి. వీటి హడావుడి మధ్య.. మనసుకు హత్తుకునే సరికొత్త ఫీల్ గుడ్ డ్రామా తెలుగు ఫ్యామిలీ చిత్రం'ఇల్లు' (Illu Movie).

ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు ఫ్యామిలీ డ్రామా- అందరికి కనెక్ట్ అయ్యే ఎమోషన్‌తో- స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు ఫ్యామిలీ డ్రామా- అందరికి కనెక్ట్ అయ్యే ఎమోషన్‌తో- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి ఇల్లు సినిమా

తెలుగు సీనియర్ నటుడు, రైటర్ హర్ష వర్ధన్, బిందు చంద్రమౌళి భార్యాభర్తలుగా ప్రధాన పాత్రలు పోషించిన ఇల్లు ఓటీటీలోకి ఇవాళ (జూన్ 12) వచ్చేసింది. ఒక ఇల్లు అంటే కేవలం నాలుగు గోడల మధ్య ఉండే కాంక్రీట్ కట్టడమా? లేక మన జ్ఞాపకాలు, అనుబంధాలు ముడిపడి ఉండే ఒక భావోద్వేగమా? అనే కథాంశంతో ఈ చిత్రాన్ని హత్తుకునేలా, సెటైరికల్‌గా మలిచారు.

కథేంటంటే?

కృష్ణ ప్రసాద్ (హర్షవర్ధన్) ఒక మధ్యవయస్కుడైన రచయిత. పదేళ్లుగా ఒక అద్దె ఇంట్లోనే నివసిస్తూ, పుస్తకాలు, జ్ఞాపకాలు, విభిన్న రకాల మొక్కల పెంపకంతో తనదైన ప్రపంచాన్ని సృష్టించుకుంటాడు.

అయితే, అమెరికా నుంచి తిరిగి వస్తున్న తమ కొడుకు ఆ ఇంట్లో ఒక స్టార్టప్ ఆఫీస్ పెట్టాలనుకుంటున్నాడని, ఇల్లు ఖాళీ చేయాలని యజమానులు చెబుతారు. ప్రాణంగా చూసుకున్న ఇల్లును వదిలి వెళ్లడం ఇష్టం లేకపోయినా, తప్పనిసరి పరిస్థితుల్లో కృష్ణ ప్రసాద్ కొత్త ఇల్లు కోసం వెతుకులాట ప్రారంభిస్తాడు.

మంచి ట్విస్ట్

ఈ క్రమంలో భువన్ (పవన్ రమేష్) అనే హౌస్ బ్రోకర్ అతనికి పరిచయమవుతాడు. కృష్ణ ప్రసాద్ బడ్జెట్‌కు సరిపోయేలా, అతను పెంచుకునే మొక్కలకు వీలుగా ఉండే ఇల్లు కోసం వీరిద్దరూ నగరం నలుమూలలా తిరుగుతారు. ఎన్నో ఇబ్బందుల తర్వాత శంషాబాద్‌లోని ఒక పెంట్‌హౌస్ ఓకే అవుతుంది.

సామాన్లు సర్దుకుని పాత ఇల్లు వదిలి కృష్ణ ప్రసాద్ వెళ్లిపోయేముందు ఓ మంచి ట్విస్ట్ ఎదరువుతుంది. అదేంటీ, యజమానులతో జరిగే ఎమోషనల్ సన్నివేశాలు ఏంటీ, చివరికి ఇంటి ఓనర్ కొడుకు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెలియాంటే నేడు ఓటీటీ రిలీజ్ అయిన ఇల్లు సినిమా చూడాల్సిందే.

ఇల్లు నటీనటులు

హర్షవర్ధన్, బిందు చంద్రమౌళితోపాటు అనీష్ కురువిల్లా, పవన్ రమేష్, సునందిని కీలక పాత్రలు పోషించారు. రోహిత్ పెనుమత్స దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి క్యాంప్ శశి కథను అందించారు. మనోహరి ఆర్ట్స్ బ్యానర్‌పై కిషోర్ మారిశెట్టి ఈ సినిమాను నిర్మించారు.

సంగీత దర్శకుడు వివేక్ సాగర్ అందించిన స్వరాలు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. శశాంక్ రాఘవుల సినిమాటోగ్రఫీ అందించగా, అవంతి రుయా ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. సందేశాత్మక చిత్రాలు, మధ్యతరగతి కుటుంబాల భావోద్వేగాలను ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు ఈ వీకెండ్‌లో 'ఇల్లు' సినిమా ఒక మంచి అనుభూతిని ఇస్తుంది.

ఈటీవీ విన్ ఓటీటీలో

అందరు కనెక్ట్ అయ్యే ఇల్లు ఎమోషనల్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. జూన్ 14న ఈటీవీ విన్‌లో ఇల్లు ఓటీటీ రిలీజ్ అయింది. ఈటీవీ విన్ ఓటీటీ వీక్లీ సిరీస్ కథా సుధలో భాగంగా నేటి ఆదివారం ఇల్లు ఓటీటీ ప్రీమియర్‌కు వచ్చింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More