OTT Court: ఓటీటీలోకి నేరుగా సస్పెన్స్ కోర్ట్ రూమ్ డ్రామా- చట్టంతో ఆడే ఆట- 29 ఏళ్ల తర్వాత తలపడనున్న ఇద్దరు దిగ్గజ నటులు!

Ikka OTT Streaming Date Announced: ఓటీటీలోకి సస్పెన్స్ కోర్ట్ రూమ్ డ్రామా చిత్రం ఇక్కా స్ట్రీమింగ్ అవనుంది. దీనికి సంబంధించిన ఇక్కా ఓటీటీ రిలీజ్ డేట్‌ను సదరు సంస్థ ప్రకటించింది. 29 ఏళ్ల తర్వాత ఇద్దరు దిగ్గజ నటులు స్క్రీన్ షేర్ చేసుకున్న ఇక్కా ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jun 14, 2026, 11:07:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ikka OTT Release Date Announced: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సంచలన విజయం సాధించిన 'బోర్డర్' (1997) సినిమాను బాలీవుడ్ మూవీ ప్రియులు ఎప్పటికీ మరువలేరు. ఆ ఆల్‌టైమ్ క్లాసిక్ వార్ డ్రామాలో కలిసి నటించిన యాక్షన్ స్టార్ హీరో సన్నీ డియోల్, వెర్సటైల్ యాక్టర్ అక్షయ్ ఖన్నా మళ్లీ 29 ఏళ్ల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో కనిపించనున్నారు.

ఓటీటీలోకి నేరుగా సస్పెన్స్ కోర్ట్ రూమ్ డ్రామా- చట్టంతో ఆడే ఆట- 29 ఏళ్ల తర్వాత తలపడనున్న ఇద్దరు దిగ్గజ నటులు!
ఓటీటీలోకి నేరుగా సస్పెన్స్ కోర్ట్ రూమ్ డ్రామా- చట్టంతో ఆడే ఆట- 29 ఏళ్ల తర్వాత తలపడనున్న ఇద్దరు దిగ్గజ నటులు!

3 దశబ్ధాల తర్వాత

ఒకవైపు సన్నీ డియోల్ నటించిన 'బంత్వారా 1947' చిత్రం ఆగస్టు 14న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ఆయన నటించిన సరికొత్త మైండ్ బ్లోయింగ్ మూవీ ఇక్కా ఓటీటీ విడుదలకు లైన్ క్లియర్ చేసుకుంది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు దిగ్గజ నటులు స్క్రీన్ షేర్ చేసుకుంటుండటంతో ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక్క సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనే విడుదల చేస్తున్నారు. ఇదొక సస్పెన్స్ అండ్ ఎమోషనల్ లీగల్ కోర్టు రూమ్ డ్రామా సినిమా. ఇందులో సన్నీ డియోల్ పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో కనిపించనుండగా, అక్షయ్ ఖన్నా ముద్దాయిగా కటకటాల్లో నిలబడ్డారు.

ధురంధర్ తరహాలో

ఇటీవల 'ధురంధర్' చిత్రంలో రెహమాన్ డెకాయిత్ పాత్రతో అద్భుతమైన విలనిజం పండించిన అక్షయ్ ఖన్నా, ఈ సినిమాలోనూ నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లోనే నటిస్తున్నారు. అక్షయ్ ఖన్నా లుక్, ఎక్స్‌ప్రెషన్స్ కూడా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

అదిరిపోయే టీజర్.. మైండ్ బ్లోయింగ్ డైలాగ్స్

ఈ సినిమా కథను పూర్తిగా రివీల్ చేయనప్పటికీ, అంతకుముందు విడుదలైన ఇక్కా టీజర్ చూస్తే ఇదొక హై-వోల్టేజ్ కోర్ట్ రూమ్ డ్రామా అని స్పష్టమవుతోంది. కోర్టు రూమ్‌లో సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నా మధ్య సాగే వాదోపవాదాలు, మైండ్ గేమ్స్ సినిమాకు ప్రధాన బలం కానున్నాయి.

ఇన్వెస్టిగేషన్ సమయంలో అక్షయ్ ఖన్నాను సన్నీ డియోల్ గట్టిగా కొట్టే సీన్, ఆ తర్వాత అక్షయ్ ఖన్నా చాలా కూల్‌గా "టిక్.. టిక్.. బూమ్" అనడం, దానికి సన్నీ డియోల్ అంతే పవర్‌ఫుల్‌గా "షట్ అప్" అంటూ అరవడం థ్రిల్ కలిగిస్తాయి. ఆ శబ్దానికి కోర్టు హాల్ మొత్తం ఒక్కసారిగా షాక్‌కు గురవుతుంది.

భారీ తారాగణం.. బలమైన పాత్రలు

సిద్ధార్థ్ పి. మల్హోత్రా దర్శకత్వం వహించిన ఇక్కా సినిమాలో భారీ తారాగణం నటిస్తోంది. సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నాతో పాటు దియా మీర్జా, తిలోత్తమా శోమే, సంజీదా షేక్, ఆకాంక్ష రంజన్ కపూర్ ఇక్కా ఓటీటీ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇందులో తిలోత్తమా శోమే పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా న్యాయం కోసం పోరాడే పాత్రలో కనిపిస్తుండగా, దియా మీర్జా కష్టకాలంలో కూడా తన కుటుంబాన్ని కాపాడుకునే ఒక బాధ్యతాయుతమైన తల్లిగా, భార్యగా ఎమోషనల్ రోల్‌లో నటిస్తున్నారు. బాలీవుడ్‌లో ఈ మధ్యకాలంలో వస్తున్న బెస్ట్ కోర్టు రూమ్ థ్రిల్లర్స్‌లో ఇది ఒకటిగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో ఇక్కా

ఇక్కా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ డిజిటల్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. జూలై 10న నెట్‌ఫ్లిక్స్‌లో ఇక్కా ఓటీటీ రిలీజ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. నెట్‌ఫ్లిక్స్ ఇండియా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. "డేట్ ఫిక్స్ అయింది. చట్టంతో ఆడే ఈ ఆటలో అసలైన 'ఇక్కా' (ఎక్కా) త్వరలోనే రంగంలోకి దిగబోతున్నాడు" అని క్యాప్షన్ ఇచ్చింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More