బోర్డర్ 2 బాక్సాఫీస్ ధమాకా- 4 రోజుల్లోనే 250 కోట్లు దాటిన సన్నీ డియోల్ మూవీ-సల్మాన్ ఖాన్ సినిమా ఔట్

సన్నీ డియోల్ లీడ్ రోల్ ప్లే చేసిన బోర్డర్ 2 మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. సండే, ఆ తర్వాత రిపబ్లిక్ డే హాలీడేస్ కలిసి రావడంతో కలెక్షన్లు కుమ్మేసింది. నాలుగు రోజుల్లోనే రు.250 కోట్లకు పైగా వసూళ్లు ఖాతాలో వేసుకుంది. సల్మాన్ ఖాన్ సికిందర్ లైఫ్ టైమ్ కలెక్షన్లను బోర్డర్ 2 దాటేసింది.

Published on: Jan 27, 2026, 09:06:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

1971 ఇండో-పాక్ వార్ నేపథ్యంలో తెరకెక్కిన బోర్డర్ 2 బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతోంది. సండే, రిపబ్లిక్ డే హాలీడేస్ కలిసి రావడంతో వసూళ్లు అదరగొట్టింది. నాలుగు రోజుల్లోనే బోర్డర్ 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది.

బోర్డర్ 2లో సన్నీ డియోల్
బోర్డర్ 2లో సన్నీ డియోల్

బోర్డర్ 2 కలెక్షన్లు

భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన బోర్డర్ 2 హైప్ ను కొనసాగిస్తోంది. ఫస్ట్ డే నుంచే బాక్సాఫీస్ మోత మోగిస్తోంది. పాజిటివ్ టాక్ తో ఈ సినిమా సాగిపోతోంది. బోర్డర్ 2 మూవీ నాలుగో రోజు (జనవరి 26) రిపబ్లిక్ డే సందర్భంగా రూ.59 కోట్ల కలెక్షన్లు సాధించింది.

మొత్తం వసూళ్లు

'బోర్డర్ 2' భారీ ఓపెనింగ్ అందుకుంది. ట్రేడ్ అనలిస్ట్ సక్నిల్క్ ప్రకారం ఈ మూవీ ఫస్ట్ డే రూ.30 కోట్ల నెట్ వసూలు చేసింది. ఆ తర్వాత మూడు రోజుల్లోనూ అదరగొట్టింది. నాలుగో రోజు అంటే సోమవారం రూ.59 కోట్లు ఖాతాలో వేసుకుంది. దీంతో బోర్డర్ 2 ఇండియా నెట్ కలెక్షన్లు రూ.180 కోట్లకు చేరుకున్నాయి. ఈ గ్రాస్ రూ.212.5 కోట్లుగా ఉంది.

ఇక ప్రపంచవ్యాప్తంగానూ బోర్డర్ 2 దూకుడు కొనసాగుతోంది. విదేశాల్లోనూ ఈ మూవీకి మంచి ఆదరణ దక్కుతోంది. నాలుగు రోజుల తర్వాత బోర్డర్ 2 కలెక్షన్లు వరల్డ్ వైడ్ గా రూ.251 కోట్లుగా ఉన్నాయి.

ఈ సినిమాలను దాటి

బోర్డర్ 2 కేవలం నాలుగు రోజుల్లోనే సల్మాన్ ఖాన్ సికిందర్, అజయ్ దేవగన్ రైడ్ 2 మూవీ లైఫ్ టైమ్ కలెక్షన్లను దాటేసింది. సికిందర్ రూ.184 కోట్లు, రైడ్ 2 రూ.243 కోట్లు సాధించాయి. ఇప్పుడు రూ.251 కోట్లతో బోర్డర్ 2 మూవీ సికిందర్, రైడ్ 2ను దాటేసింది. ఈ మూవీ త్వరలోనే రూ.300 కోట్ల క్లబ్ లో చేరే సూచనలు కనిపిస్తున్నాయి.

బోర్డర్ 2 గురించి

1997లో వచ్చిన క్లాసిక్ మూవీ బోర్డర్ కు సీక్వెల్ గా ఇప్పుడు బోర్డర్ 2 వచ్చింది. ఇందులో సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహాన్ శెట్టి తదితరులు నటించారు. పాజిటివ్ మౌత్ టాక్ తో బోర్డర్ 2 కు మంచి ఆదరణ దక్కుతోంది. ముఖ్యంగా ఇండో-పాక్ యుద్ధం నేపథ్యంలో వచ్చే సీన్లు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. మన భారత త్రివిధ దళాలకు బోర్డర్ 2 మూవీ మంచి ట్రిబ్యూట్ అనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా సన్నీ డియోల్ కు అదిరే కమ్ బ్యాక్ అనే కామెంట్లు వస్తున్నాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More