సల్మాన్ ఖాన్ ఆస్తుల విలువ తెలిస్తే షాకవ్వాల్సిందే.. ఎన్నో లగ్జరీ ప్రాపర్టీలు.. రూ.100 కోట్ల విలువైన బీజ్ హౌస్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ శనివారం (డిసెంబర్ 27) తన 60వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. మరి అతని నెట్‌వర్త్ ఎంతో తెలుసా? సుమారు రూ.2900 కోట్లు. అతనికి ఎన్నో లగ్జరీ ప్రాపర్టీలు ఉండటం విశేషం.
బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ (Salman Khan) పుట్టినరోజు సందర్భంగా అతని ఆస్తుల వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కెరీర్ మొదట్లో సపోర్టింగ్ రోల్స్ చేసిన సల్మాన్.. ఇప్పుడు రూ. 2900 కోట్ల సామ్రాజ్యానికి అధిపతి. అతనికున్న లగ్జరీ ఇళ్లు, ఫామ్‌హౌస్‌ల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

సల్మాన్ ఖాన్.. ఆస్తుల్లోనూ టాప్
1988లో 'బీవీ హో తో ఐసీ' సినిమాతో సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా మొదలై.. 1989లో 'మైనే ప్యార్ కియా'తో స్టార్ హీరోగా ఎదిగిన సల్మాన్ ఖాన్ నేడు కోట్లకు అధిపతి. శనివారం (డిసెంబర్ 27) అతని పుట్టినరోజు సందర్భంగా సల్మాన్ ఆస్తుల చిట్టా ఓసారి చూద్దాం.
తాజాగా వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం సల్మాన్ ఖాన్ మొత్తం ఆస్తి విలువ సుమారు రూ. 2900 కోట్లు. బాలీవుడ్‌లో అత్యంత సంపన్న నటుల్లో సల్మాన్ ఒకరు. ఎన్నో లగ్జరీ ప్రాపర్టీలు అతని సొంతం.
సల్మాన్ లగ్జరీ ఆస్తులు ఇవే..
1. గెలాక్సీ అపార్ట్‌మెంట్ (ముంబై): సల్మాన్ ఖాన్ ఎప్పటినుంచో తన కుటుంబంతో కలిసి ఉంటున్న ఇల్లు ఇదే. బాంద్రాలోని ఈ అపార్ట్‌మెంట్‌లో సల్మాన్ ఉండేది కేవలం 1 బీహెచ్‌కే ఫ్లాట్‌లో మాత్రమే కావడం విశేషం. మనీ కంట్రోల్ రిపోర్ట్ ప్రకారం దీని విలువ రూ. 16 కోట్లు.
2. పన్వేల్ ఫామ్‌హౌస్: సల్మాన్ ఎక్కువగా టైమ్ స్పెండ్ చేసేది ఇక్కడే. ఇది ఏకంగా 150 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో స్విమ్మింగ్ పూల్, జిమ్, గుర్రపు శాలలు, గెస్ట్ బంగళాలు ఉన్నాయి. దీని విలువ సుమారు రూ. 80 కోట్లు. సెలబ్రిటీల పార్టీలన్నీ ఇక్కడే జరుగుతుంటాయి.
3. గొరై బీచ్ హౌస్: సల్మాన్‌కు ఉన్న మరో లగ్జరీ ప్రాపర్టీ ఇది. ఇందులో ప్రైవేట్ థియేటర్, బైక్ ఎరేనా, జిమ్, స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. దీని విలువ ఏకంగా రూ. 100 కోట్లు ఉంటుందని సమాచారం.
4. ట్రిపుల్స్ అపార్ట్‌మెంట్ (బాంద్రా): బాంద్రాలో సల్మాన్‌కు 3 అంతస్తుల (ట్రిప్లెక్స్) అపార్ట్‌మెంట్ కూడా ఉంది. 4 బెడ్‌రూమ్స్ ఉన్న ఈ విలాసవంతమైన ఫ్లాట్ విలువ రూ. 30 కోట్లు.
5. దుబాయ్ అపార్ట్‌మెంట్: దుబాయ్‌లోని ఫేమస్ 'ది అడ్రస్ డౌన్‌టౌన్' (The Address Downtown)లో కూడా సల్మాన్‌కు ఒక ఖరీదైన అపార్ట్‌మెంట్ ఉంది.
సల్మాన్ ఖాన్ తన 60వ పుట్టిన రోజు వేడుకలను ఒక రోజు ముందే మొదలుపెట్టిన విషయం తెలిసిందే. శుక్రవారం (డిసెంబర్ 26) రాత్రి అతని ఫామ్ హౌస్ లో జరిగిన ఈ పార్టీకి ధోనీతోపాటు ఎంతో మంది బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా వచ్చారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


