Mukesh Chhabra: ధురంధర్ విలన్ పాత్రను తిరస్కరించిన ముగ్గురు స్టార్ హీరోలు.. అక్షయ్ ఖన్నా వద్దకు ఆ ఛాన్స్ ఎలా వచ్చిందంటే?
Mukesh Chhabra On Dhurandhar Villain Role Cast: 'ధురంధర్' సినిమాలో క్రూరమైన గ్యాంగ్‌స్టర్ రెహమాన్ డకైట్‌గా అక్షయ్ ఖన్నా నటనకు ప్రేక్షకులు ఫిదా అయిన విషయం తెలిసిందే. అయితే, ఈ పవర్‌ఫుల్ పాత్ర కోసం అక్షయ్ ఖన్నా కంటే ముందు ముగ్గురు స్టార్ హీరోలను అడిగారట. ఈ విషయాన్ని తాజాగా ముఖేష్ చాబ్రా తెలిపారు.
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తున్న 'ధురంధర్ 2' చిత్రంలో ప్రతి పాత్రకూ ఒక ప్రత్యేకత ఉంది. అలాగే, మొదటి పార్ట్ ధురంధర్ సినిమాలో కూడా ప్రతి రూల్‌ను చాలా బాగా ఆవిష్కరించారు డైరెక్టర్ ఆదిత్య ధర్. ముఖ్యంగా కరాచీలోని ల్యారీ గ్యాంగ్‌లార్డ్ 'రెహమాన్ డకైట్'గా అక్షయ్ ఖన్నా పండించిన విలనిజం సినిమాకే హైలైట్‌గా నిలిచింది.

గతేడాది డిసెంబర్‌లో మొదటి భాగం విడుదలైనప్పటి నుంచి అక్షయ్ ఖన్నా నటనపై ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. అయితే, ఇంతటి గుర్తింపు తెచ్చిన ఈ పాత్రను అక్షయ్ ఖన్నా కంటే ముందు ముగ్గురు స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారనే ఆసక్తికర విషయాన్ని కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ ఛాబ్రా తాజాగా బయటపెట్టారు.
సౌత్ హీరోతో పాటు
బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖేష్ ఛాబ్రా ఈ కాస్టింగ్ వెనుక ఉన్న అసలు కథను వివరించారు. "రెహమాన్ డకైట్ పాత్ర కోసం మొదట ముగ్గురు నటులను సంప్రదించాం. వారిలో ఒకరు సౌత్ ఇండియాకు చెందిన స్టార్ హీరో కాగా, మిగిలిన ఇద్దరు బాలీవుడ్ నటులు. అయితే వారు చెప్పిన కారణం విని నేను ఆశ్చర్యపోయాను. 'ఇది మల్టీస్టారర్ సినిమా (Ensemble Cast).. పైగా ఇదంతా రణ్‌వీర్ సింగ్ సినిమా కదా, మాకేం ప్రాధాన్యత ఉంటుంది?' అని వారు వెనకడుగు వేశారు" అని ముఖేష్ చాబ్రా తెలిపారు.
వారు నో చెప్పినందుకు బాధపడ్డామని, ఎంతో ఆలోచించి ఒక నటుడిని అనుకున్నాక వారు తిరస్కరిస్తే ఆ ఫీలింగ్ వేరేలా ఉంటుందని ముఖేష్ చెప్పుకొచ్చారు. అయితే దర్శకుడు ఆదిత్య ధర్ మాత్రం చాలా కూల్‌గా స్పందిస్తూ, తన కథపై తనకు నమ్మకం ఉందని, ఎవరైతే ఏంటని ముందుకు సాగారని ముఖేష్ గుర్తు చేసుకున్నారు.
ఒక్క రోజులోనే అక్షయ్ ఖన్నా 'ఓకే'!
ఆ ముగ్గురు తప్పుకున్నాక ముఖేష్ ఛాబ్రా దృష్టి అక్షయ్ ఖన్నాపై పడింది. "అక్షయ్‌కు ఫోన్ చేయగానే వెంటనే స్పందించారు. కథ విన్న వెంటనే 'స్క్రిప్ట్ అద్భుతంగా ఉంది' అని మెచ్చుకున్నారు. కేవలం ఒక్క రోజులోనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అక్షయ్ లాంటి నటులు నిర్ణయాలు మనసుతో తీసుకుంటారు. తన చుట్టూ నలుగురు ఉండి ఇచ్చే సలహాల మీద ఆయన ఆధారపడరు" అంటూ అక్షయ్ వృత్తిపరమైన నిబద్ధతను ముఖేష్ చాబ్రా కొనియాడారు.
ఏమిటీ 'ధురంధర్' కథ?
కరాచీలోని నేర సామ్రాజ్యానికి అడ్డా అయిన 'ల్యారీ' నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. కాందహార్ విమానం హైజాక్, పార్లమెంట్ దాడి, 26/11 ముంబై దాడుల వంటి వాస్తవ సంఘటనల చుట్టూ అల్లిన గూఢచారి కథ ఇది. రణ్‌వీర్ సింగ్ (హమ్జా అలియాస్ జస్క్రీరాత్ సింగ్ రంగీ), సారా అర్జున్, అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్, రాకేష్ బేడీ వంటి ఉద్దండులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.
మార్చి 19న విడుదలైన ఈ సీక్వెల్.. హమ్జా అసలు గతాన్ని ఆవిష్కరిస్తూనే, పాకిస్థాన్‌లోని ఉగ్రవాద నెట్‌వర్క్‌ను అతను ఎలా చిన్నాభిన్నం చేశాడనే ఉత్కంఠభరిత అంశాలతో సాగుతోంది. ఇకపోతే అక్షయ్ ఖన్నా ఈ పాత్రను వదులుకోకపోవడం సినిమాకు, ఆయన కెరీర్‌కు ప్లస్ అయ్యిందనే చెప్పాలి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


