Akshaye Khanna Mahakali: తెలుగులోకి ధురంధర్ విలన్ ఎంట్రీ- రాక్షస గురువుగా అక్షయ్ ఖన్నా లుక్ వైరల్!
Akshaye Khanna Mahakali Shukracharya Look: ఆదిత్య ధర్ ధురంధర్‌లో విలన్ పాత్రతో అదరగొట్టిన అక్షయ్ ఖన్నా ఇప్పుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమయ్యారు. ‘మహాకాళి’ చిత్రంలో పోషిస్తున్న అసుర గురువు ‘శుక్రాచార్యుడి’ పాత్రలో అక్షయ్ ఖన్నా లుక్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది.
బాలీవుడ్ వెర్సటైల్ నటుడు, ధురంధర్ విలన్ అక్షయ్ ఖన్నా ప్రస్తుతం తన కెరీర్‌లో గోల్డెన్ పీరియడ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘ధురంధర్’ చిత్రంలో రెహ్మాన్ డెకాయిట్‌గా అక్షయ్ ఖన్నా పండించిన నెగెటివ్ షేడ్స్ ప్రేక్షకులను మెప్పించాయి.

ఈ క్రమంలో మార్చి 28న అక్షయ్ పుట్టినరోజును పురస్కరించుకుని, టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఒక అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. తమ కాంబినేషన్‌లో వస్తున్న ‘మహాకాళి’ (Mahakali) చిత్రం నుంచి అక్షయ్ ఖన్నా లుక్‌ను తాజాగా రివీల్ చేశారు.
రాక్షస గురువుగా అక్షయ్ ఖన్నా!
ప్రశాంత్ వర్మ తన సోషల్ మీడియా వేదికగా అక్షయ్ ఖన్నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఈ చిత్రంలో ఆయన ‘శుక్రాచార్యుడి’ పాత్రలో కనిపిస్తారని వెల్లడించారు. "నిజమైన ప్రతిభకు ఆర్భాటాలు అవసరం లేదని నిరూపించే నటుడు అక్షయ్ ఖన్నా సర్. మీతో కలిసి పనిచేయడం నాకు దక్కిన గౌరవం. మనం కలిసి సృష్టిస్తున్న ఈ అద్భుతాన్ని ప్రపంచానికి చూపించడానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు.
రాక్షస గురువు శుక్రాచార్యుడి పాత్ర కోసం అక్షయ్ ఖన్నా పూర్తిగా మేకోవర్ అయ్యారు. పురాణాల్లోని అసుర గురువు శుక్రాచార్యుడి పాత్రకు ఆయన తనదైన శైలిలో గాంభీర్యాన్ని అద్దనున్నారని ఈ లుక్ చూస్తే అర్థమవుతోంది.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)
పూజా కొల్లూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మహాకాళి’ చిత్రం ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో భాగంగా వస్తోంది. ‘హను-మాన్’ విజయంతో మొదలైన ఈ యూనివర్స్‌లో ‘జై హనుమాన్’, ‘అధీర’ వంటి చిత్రాలు కూడా రాబోతున్నాయి.
‘మహాకాళి’ చిత్రంతో అక్షయ్ ఖన్నా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. ఇందులో భూమి శెట్టి లేడీ సూపర్ హీరోగా నటిస్తోంది. పురాణ గాథలకు ఆధునిక సూపర్ హీరో టచ్ ఇచ్చి రూపొందిస్తున్న ఈ చిత్రం మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు
ఇటీవల కల్యాణి ప్రియదర్శన్ నటించిన ‘లోకా చాప్టర్ 1: చంద్ర’ వంటి లేడీ సూపర్ హీరో చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ‘మహాకాళి’పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, అక్షయ్ ఖన్నా కేవలం తెలుగులోనే కాకుండా హిందీలోనూ బిజీగా ఉన్నారు.
ప్రధాన విలన్‌గా
సిద్ధార్థ్ పి. మల్హోత్రా దర్శకత్వంలో వస్తున్న ‘ఇక్కా’ (Ikka) సినిమాలో సన్నీ డియోల్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు అక్షయ్ ఖన్నా. ఇందులో అక్షయ్ ఖన్నా ప్రధాన విలన్‌గా నటిస్తుండగా.. దియా మీర్జా, తిలోత్తమ షోమ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


