ఓటీటీలో ఎక్కువ మంది చూసిన టాప్ 5 మూవీస్ ఇవే.. వచ్చీ రాగానే మలయాళం సూపర్ హీరో మూవీ, కన్నడ యాక్షన్ డ్రామా హవా
ఓటీటీల్లో ఎక్కువ మంది చూసిన టాప్ 5 సినిమాల లేటెస్ట్ జాబితా వచ్చేసింది. గతవారం అంటే అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 మధ్య ఎక్కువ వ్యూస్ సంపాదించిన సినిమాల జాబితాను ఆర్మాక్స్ మీడియా సోమవారం (నవంబర్ 3) రిలీజ్ చేసింది.
ఓటీటీలోకి వచ్చీ రాగానే మలయాళం సూపర్ హీరో మూవీ, కన్నడ యాక్షన్ డ్రామా చెలరేగిపోతున్నాయి. మూడు రోజుల్లోనే టాప్ 5 సినిమాల జాబితాలో తొలి రెండు స్థానాల్లో నిలవడం విశేషం. వీటిని నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో చూడొచ్చు. మరి టాప్ 5లో ఉన్న సినిమాలేంటో చూడండి.

లోకా ఛాప్టర్ 1 చంద్ర టాప్‌లోకి..
మలయాళం ఫిమేల్ సూపర్ హీరో మూవీ లోకా ఛాప్టర్ 1 చంద్ర అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. గత శుక్రవారం (అక్టోబర్ 31) జియోహాట్‌స్టార్ లోకి వచ్చిన ఈ సినిమా మూడు రోజుల్లోనే 3.8 మిలియన్ల వ్యూస్ తో తొలి స్థానంలో నిలిచింది. ఏడు భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. కల్యాణి ప్రియదర్శన్, నస్లేన్ లీడ్ రోల్స్ లో నటించారు.
కాంతార ఛాప్టర్ 1 - ప్రైమ్ వీడియో
ఇక గత శుక్రవారమే ఓటీటీలోకి వచ్చిన కన్నడ యాక్షన్ డ్రామా మూవీ కాంతార ఛాప్టర్ 1 రెండో స్థానంలో ఉంది. ప్రైమ్ వీడియోలో కన్నడతోపాటు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు 3.5 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఒకే రోజు ఓటీటీలోకి వచ్చిన ఈ రెండు బ్లాక్‌బస్టర్ సినిమాలు వ్యూస్ విషయంలో పోటాపోటీగా సాగుతున్నాయి.
ఓజీ - నెట్‌ఫ్లిక్స్
పవన్ కల్యాణ్ నటించిన ఓజీ మూవీ కూడా ఇంకా దూసుకెళ్తూనే ఉంది. ఈ సినిమాకు గత వారం 3 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. టాప్ 5లో మూడో స్థానంలో ఉంది. ఒకవారం టాప్ లోకి దూసుకెళ్లినా.. ఇప్పుడు మూడోస్థానంతో సరిపెట్టుకుంది.
పరమ్ సుందరి - ప్రైమ్ వీడియో
జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన పరమ్ సుందరి సినిమా నాలుగో స్థానంలో ఉంది. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు గత వారం 2.8 మిలియన్ వ్యూస్ వచ్చాయి. బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడినా ఓటీటీలో మాత్రం మంచి వ్యూసే వస్తున్నాయి.
ఇడ్లీ కొట్టు - నెట్‌ఫ్లిక్స్
తమిళ స్టార్ హీరో ధనుష్ లీడ్ రోల్లో నటించిన ఇడ్లీ కొట్టు మూవీ ఐదో స్థానంలో ఉంది. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు 2 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. తమిళంలో ఇడ్లీ కడాయ్ పేరుతో ఈ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. థియేటర్లలో దీనికి పెద్దగా రెస్పాన్స్ రాలేదు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


