ఓటీటీలో ఈ వారం కచ్చితంగా చూడాల్సిన 8 సినిమాలు- హారర్ థ్రిల్లర్ టు సర్వైవల్- నెట్‌ఫ్లిక్స్‌లోనే ఎక్కువగా స్ట్రీమింగ్!

ఓటీటీలోకి ఈ వారం రిలీజ్ కానున్న సినిమాల్లో 8 చాలా స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్‌గా కచ్చితంగా చూసేవిధంగా ఉన్నాయి. వీటిలో హారర్ థ్రిల్లర్ నుంచి సర్వైవల్ సిరీస్ వరకు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5 తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయ్యే ఆ సినిమాలు ఏంటో ఇక్కడ చూద్దాం.

Published on: Nov 3, 2025, 14:57:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి ఈ వారం ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో అన్ని రకాల జోనర్స్ ఉన్నాయి. అయితే ఇందులో 8 సినిమాలు కచ్చితంగా చూడాల్సినవిగా ఇంట్రెస్టింగ్‌ అండ్ స్పెషల్‌గా ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏంటీ, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలో ఈ వారం కచ్చితంగా చూడాల్సిన 8 సినిమాలు- హారర్ థ్రిల్లర్ టు సర్వైవల్- నెట్‌ఫ్లిక్స్‌లోనే ఎక్కువగా స్ట్రీమింగ్!
ఓటీటీలో ఈ వారం కచ్చితంగా చూడాల్సిన 8 సినిమాలు- హారర్ థ్రిల్లర్ టు సర్వైవల్- నెట్‌ఫ్లిక్స్‌లోనే ఎక్కువగా స్ట్రీమింగ్!

ఫ్రాంకిన్‌స్టన్ ఓటీటీ

ఆస్కార్ ఐజాక్, జాకబ్ ఎలోర్డి, మియా గోత్, క్రిస్టోఫ్ వాల్ట్జ్ నటించిన సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ సినిమా ఫ్రాంకిన్‌స్టన్. ఈ మూవీ నవంబర్ 7 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

బారాముల్లా ఓటీటీ

ఆర్టికల్ 370 తరువాత దర్శకుడు ఆదిత్య జంభాలే తెరకెక్కించిన సినిమా బారాముల్లా. మానవ్ కౌల్, భాషా సుంబ్లీ యాక్ట్ చేసిన హారర్ థ్రిల్లర్ బారాముల్లా నవంబర్ 7 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ కానుంది.

ఫస్ట్ కాపీ సీజన్ 2 ఓటీటీ

క్రిస్టల్ డిసౌజా, గుల్షన్ గ్రోవర్, సాకిబ్ అయూబ్, ఆషి సింగ్, మీయాంగ్ చాంగ్, ఇనామ్ ఉల్ హక్, రజా మురాద్, నవాబ్ షా నటించిన ఫస్ట్ కాపీ సీజన్ 2 అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్‌లో నవంబర్ 5 నుంచి ప్రీమియర్ కానుంది.

మహారాణి సీజన్ 4 ఓటీటీ

హుమా ఖురేషి నటించిన హిందీ పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్ మహారాణి. ఈ సిరీస్ నుంచి కొత్తగా వస్తున్న సీజన్ 4. అమిత్ సియాల్, శ్వేతా బసు ప్రసాద్, వినీత్ కుమార్, కని కుశ్రుతి, విపిన్ శర్మ, శార్దూల్ భరద్వాజ్, ప్రమోద్ పాఠక్ నటించిన ఈ సిరీస్ నవంబర్ 7 నుంచి సోనీలివ్‌ ఓటీటీలో ప్రసారం కానుంది.

తోడే దూర్ తోడే పాస్ ఓటీటీ

పంకజ్ కపూర్, మోనా సింగ్, కునాల్ రాయ్ కపూర్, ఆయేషా కడుస్కర్ యాక్ట్ చేసిన తోడే దూర్ తోడే పాస్ జీ5 ఓటీటీలో నవంబర్ 7 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.

ప్లురిబస్ ఓటీటీ

రియా సీహార్న్, కరోలినా వైడ్రా, కార్లోస్ మాన్యువల్ వెస్గా, మిరియం షోర్, సాంబా షుట్టే తారాగణంతో వచ్చిన ప్లురిబస్ వెబ్ సిరీస్ నవంబర్ 7 నుంచి యాపిల్ ప్లస్ టీవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. డిసెంబర్ 26 వరకు ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్‌ను ఓటీటీ రిలీజ్ చేయనున్నారు.

ది హ్యాక్ ఓటీటీ

బ్రిటన్‌లో జరిగిన అతిపెద్ద మీడియా కుంభకోణాల్లో ఒకటైన ట్యాపింగ్ కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమానే ది హ్యాక్. డేవిడ్ టెన్నాంట్, రాబర్ట్ కార్లైల్, రోజ్ లెస్లీ, డగ్రే స్కాట్, టోబి జోన్స్ నటించి ది హ్యాక్ నవంబర్ 7న లయన్స్ గేట్ ప్లేలో ఓటీటీ రిలీజ్ కానుంది.

యాజ్ యూ స్టుడ్ బై నవంబర్ 7 నెట్‌ఫ్లిక్స్

జియోంగ్ సో-నీ, లీ యు-మి, జాంగ్ సియుంగ్-జో, లీ ము-సాంగ్ నటించిన కొరియన్ థ్రిల్లర్ యాజ్ యూ స్టుడ్ బై. ఈ సర్వైవల్ థ్రిల్లర్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 7 నుంచి ఓటీటీ ప్రీమియర్ కానుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More