Bobby Deol: ఆమె వల్లే బాబీ డియోల్‌కు దూరమయ్యానా? 40 ఏళ్ల నాటి ప్రేమకథకు తెరదించిన నగల డిజైనర్ ఫరా ఖాన్
Designer Farah Khan On Bobby Deol Love Story: యానిమల్ విలన్ బాబీ డియోల్ పాత ప్రేమాయణాలపై ప్రముఖ జ్యువెలరీ డిజైనర్ ఫరా ఖాన్ అలీ సంచలన నిజాలు వెల్లడించారు. ఆ నటి వల్లే తాము విడిపోయామంటూ 40 ఏళ్లుగా రూమర్లపై అసలు కథ చెప్పారు. ఇప్పుడు ఫరా ఖాన్ అలీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Designer Farah Khan On Bobby Deol Love Story: బాలీవుడ్ సీనియర్ హీరో బాబీ డియోల్ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్ పాత్రలతో దూసుకుపోతున్నారు. 'యానిమల్' సినిమాతో గ్లోబల్ రేంజ్‌లో క్రేజ్ తెచ్చుకున్న ఆయన.. తాజాగా జూలై 4న విడుదలైన వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ చిత్రం 'ఆల్ఫా' (Alpha) లోనూ పవర్‌ఫుల్ నెగెటివ్ రోల్‌లో మెరిశారు.

గతానికి సంబంధించిన రూమర్స్
ఒకవైపు కెరీర్ పరంగా ఫుల్ జోష్‌లో ఉన్న బాబీ డియోల్ పాత ప్రేమాయణాలు, గతానికి సంబంధించిన రూమర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ హల్‌చల్ చేస్తున్నాయి. బాబీ డియోల్ టీనేజ్ లవ్ స్టోరీపై ప్రముఖ జ్యువెలరీ డిజైనర్ ఫరా ఖాన్ అలీ తాజాగా స్పందించారు. నటి నీలం కొఠారితో బాబీ డియోల్ నడిపిన అఫైర్ కారణంగానే తమ బంధం విడిపోయిందనే వార్తలపై ఆమె గట్టిగా క్లారిటీ ఇచ్చారు.
ఉత్తరాలు రాసుకునేవాళ్లం.. అప్పటి ప్రేమ వేరు!
విక్కీ లాల్వానీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఫరా ఖాన్ అలీ తమ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. తామిద్దరం చిన్ననాటి స్నేహితులమని, ఒకరంటే ఒకరికి విపరీతమైన ఇష్టం ఉండేదని చెప్పారు.
"మేము చైల్డ్‌హుడ్ స్వీట్‌హార్ట్స్‌మి. నాకు తన మీద, తనకు నా మీద విపరీతమైన క్రష్ ఉండేది. అంతకుమించి మా మధ్య ఏమీ లేదు. చేతులు పట్టుకోవడం, ఒకరికొకరు ప్రేమ ఉత్తరాలు రాసుకోవడం వరకే మా బంధం పరిమితమైంది. ఈ కాలం పిల్లలు చేసుకునే డేటింగ్‌లా మాది కాదు. అప్పుడు నాకు 16 ఏళ్లు, బాబీకి 17 ఏళ్లు. దాదాపు 40 ఏళ్ల క్రితం నాటి మాట ఇది. అప్పటి జీవితాలు, పరిస్థితులు చాలా వేరు" అని ఫరా ఖాన్ అలీ స్పష్టం చేశారు.
నీలం మా మధ్య దూరం పెంచలేదు
బాబీ డియోల్‌తో విడిపోవడానికి నటి నీలం కొఠారి కారణమనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఫరా ఖాన్ కొట్టిపారేశారు. తమ టీనేజ్ లవ్ స్టోరీ ముగిసిన తర్వాతే బాబీ జీవితంలోకి నీలం వచ్చిందని చెప్పారు.
"ఆ ప్రచారంలో అస్సలు నిజం లేదు. నీలం నా ప్రాణ స్నేహితురాలు. నా తర్వాతే తను బాబీ జీవితంలోకి వచ్చింది. కాబట్టి మా బ్రేకప్‌కు తను కారణం కాదు. ఈ విషయాన్ని నేను అస్సలు ఒప్పుకోను. మా అందరికీ చిన్నప్పుడు ఎంతో అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి, ఇప్పటికీ మేమంతా టచ్‌లోనే ఉన్నాం. నేను చాలా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిని, నా జీవితంలో చేసిన ఏ పనికీ నేను ఎప్పుడూ బాధపడలేదు" అని ఫరా ఖాన్ వివరించారు.
బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడానికి ముందే బాబీ డియోల్, నీలం దాదాపు ఐదేళ్ల పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఆ తర్వాత 1990ల ప్రారంభంలో ఇద్దరూ పరస్పర అంగీకారంతోనే విడిపోయారు. ప్రస్తుతం బాబీ డియోల్, ఆయన భార్య తాన్యా ఇద్దరూ తనకు కుటుంబ సభ్యులతో సమానమని, వాళ్లిద్దరూ ఒకరికొకరు దొరకడం సంతోషంగా ఉందని ఫరా ఖాన్ ఆనందం వ్యక్తం చేశారు.
వ్యక్తిగత జీవితాలు.. 'ఆల్ఫా'తో బాబీ సందడి!
బాబీ డియోల్ 1996లో తాన్యాను వివాహం చేసుకోగా.. వీరికి ఆర్యమన్ డియోల్, ధరమ్ డియోల్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో పెద్ద కుమారుడు ఆర్యమన్ త్వరలోనే బాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు ఫరా ఖాన్ అలీ 1999లో డీజే అఖీల్‌ను పెళ్లి చేసుకోగా.. మనస్పర్థల కారణంగా 2023లో వీరు విడిపోయారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. బాబీ డియోల్ విలన్‌గా నటించిన 'ఆల్ఫా' సినిమా జూలై 4న థియేటర్లలోకి వచ్చింది. శివ్ రావల్ దర్శకత్వం వహించిన ఈ భారీ యాక్షన్ చిత్రంలో అలియా భట్, శార్వరి వాఘ్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


