Alpha OTT: ఓటీటీలోకి నిన్న రిలీజైన ఆల్ఫా- ఇద్దరు హీరోయిన్ల యాక్షన్ థ్రిల్లర్- 215 కోట్ల డైరెక్ట్ డీల్ కాదని- ఎక్కడంటే?

Alpha OTT Streaming: ఇద్దరు ముద్దుగుమ్మలు అలియా భట్, శార్వరి వాఘ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఆల్ఫా ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. రూ. 215 కోట్ల డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ డీల్‌ను పక్కన పెట్టి నిన్న థియేటర్లలో ఆల్ఫాను విడుదల చేశారు. ఈ క్రమంలో ఆల్ఫా ఓటీటీ రిలీజ్‌పై క్యూరియాసిటీ నెలకొంది.

Published on: Jul 4, 2026, 05:35:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Alpha OTT Release Details: భారీ యాక్షన్ సినిమాలను ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు 'వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్' (YRF Spy Universe) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పఠాన్, టైగర్, వార్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత ఈ క్రేజీ యూనివర్స్ నుంచి వచ్చిన సరికొత్త హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఆల్ఫా' (Alpha).

ఓటీటీలోకి నిన్న రిలీజైన ఆల్ఫా- ఇద్దరు హీరోయిన్ల యాక్షన్ థ్రిల్లర్- 215 కోట్ల డైరెక్ట్ డీల్ కాదని- ఎక్కడంటే?
ఓటీటీలోకి నిన్న రిలీజైన ఆల్ఫా- ఇద్దరు హీరోయిన్ల యాక్షన్ థ్రిల్లర్- 215 కోట్ల డైరెక్ట్ డీల్ కాదని- ఎక్కడంటే?

ఇద్దరు హీరోయిన్ల యాక్షన్ సినిమా

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, యంగ్ బ్యూటీ శార్వరి మెయిన్ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ పీరియాడిక్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఎట్టకేలకు వెండితెరపైకి వచ్చేసింది. ఈ యూనివర్స్ నుంచి వచ్చిన మొదటి లేడీ ఓరియెంటెడ్ స్పై సినిమా కావడంతో దీనిపై ట్రేడ్ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

నిన్న (జూలై 3) థియేటర్లలో విడుదలైన ఈ యాక్షన్ విందును ఆస్వాదిస్తున్న సినీ ప్రియులు.. అప్పుడే ఆల్ఫా ఓటీటీ రిలీజ్ ఎప్పుడు, ఎక్కడ అనే విషయాలపై ఆరా తీయడం మొదలుపెట్టారు.

రూ. 215 కోట్ల భారీ ఆఫర్‌ను తిరస్కరించిన వైఆర్ఎఫ్

ఆల్ఫా ఓటీటీ హక్కులకు సంబంధించి సినిమా ఇండస్ట్రీలో ఒక సంచలన వార్త చక్కర్లు కొడుతోంది. ప్రముఖ మీడియా సంస్థ 'మిడ్-డే' నివేదిక ప్రకారం.. ఆల్ఫా సినిమా థియేటర్లలో విడుదల కావడానికి కొన్ని నెలల ముందే ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఒక భారీ డీల్‌ను మేకర్స్ ముందు ఉంచింది.

థియేటర్లలో కాదని నేరుగా ఆల్ఫా మూవీని ఓటీటీలోనే విడుదల (Direct OTT Release) చేసేలా దాదాపు రూ. 215 కోట్ల భారీ ఆఫర్‌ను ప్రకటించింది. అయితే యష్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రా ఈ మైండ్ బ్లోయింగ్ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారు. తమ సినిమాను కచ్చితంగా థియేటర్లలోనే మొదట విడుదల చేయాలనే నమ్మకంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆల్ఫా ఓటీటీ రైట్స్

మహిళా ప్రధాన యాక్షన్ సినిమాలకు థియేటర్లలో పెద్దగా ఆదరణ ఉండదనే కొందరి అపోహలను పటాపంచల్ చేయడానికే వైఆర్ఎఫ్ ఈ రిస్క్ తీసుకుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. తమ స్పై యూనివర్స్ సినిమాలను ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారో, అలియా భట్ యాక్షన్ సినిమాను కూడా అంతే అద్భుతంగా రిసీవ్ చేసుకుంటారనే నమ్మకాన్ని మేకర్స్ నిజం చేసి చూపించారు.

థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ కోసమే డిజైన్ చేసిన అల్ఫా మూవీని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేస్తే ఆ ఫీల్ రాదని నిర్మాతలు గట్టిగా నమ్మారు. డైరెక్ట్ ఓటీటీ ఆఫర్‌ను వదులుకున్నప్పటికీ, థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థే సొంతం చేసుకుంది.

సాధారణంగా పెద్ద సినిమాలకు ఉండే ఎనిమిది వారాల విండో నిబంధన ప్రకారం.. ఈ సినిమా థియేటర్లలో విడుదలైన రెండు నెలల తర్వాత ఓటీటీ వేదికపైకి రానుంది. వైఆర్ఎఫ్ సంస్థ సాధారణంగా అనుసరించే పద్ధతిలోనే ఈ ఆల్ఫా ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే ఆల్ఫా

అయితే, నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్ట్ 28న ఆల్ఫా ఓటీటీ రిలీజ్ కానుందని సోషల్ మీడియాలో ఒక టాక్ నడుస్తోంది. దీంట్లో అధికారిక క్లారిటీ లేదు. అలాగే, ఆల్ఫా శాటిలైట్ రైట్స్‌ను ప్రముఖ టీవీ సంస్థ సోనీ మ్యాక్స్ సొంతం చేసుకుందని సమాచారం. ఓటీటీ రిలీజ్ అనంతరం సోనీ మ్యాక్స్‌లో టీవీ ప్రీమియర్ కానుందని తెలుస్తోంది.

హృతిక్ రోషన్ క్యామియో హైలైట్

ఆల్ఫా సినిమాలో అలియా భట్ చేసిన సాహసోపేతమైన యాక్షన్ సీక్వెన్సులు థియేటర్లలో విజిల్స్ వేయిస్తున్నాయి. శార్వరి కూడా తన నటనతో పర్ఫెక్ట్ సపోర్ట్ అందించింది. అయితే ఈ సినిమాకు థియేటర్లలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది మాత్రం ఇద్దరు స్టార్ హీరోలే.

'వార్' సినిమాలో కబీర్ పాత్రతో మెప్పించిన గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ఈ చిత్రంలో స్పెషల్ క్యామియో (అతిథి పాత్ర)లో కనిపించి థియేటర్లను ఊపేస్తున్నారు. ఆ సీన్ థియేటర్లలో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది.

బాబీ డియోల్ విలనిజం..

అలాగే 'యానిమల్' సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి నార్త్, సౌత్ అనే తేడా లేకుండా క్రేజ్ సంపాదించుకున్న బాబీ డియోల్ ఇందులో విలన్‌గా మరోసారి పవర్‌ఫుల్ పర్‌ఫార్మెన్స్‌తో మెప్పించారు.

లోపాలున్నాయన్న రివ్యూవర్స్

స్క్రీన్‌ప్లే లో అక్కడక్కడా కొన్ని లోపాలు ఉన్నాయని కొందరు రివ్యూయర్స్ చెప్తున్నప్పటికీ.. యాక్షన్ కొరియోగ్రఫీ, గ్రాండ్ విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాయని యాక్షన్ లవర్స్ ప్రశంసిస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More