OTT War: ఏకంగా 9 ఓటీటీల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన 816 కోట్ల వార్ యాక్షన్ థ్రిల్లర్- 7.7 రేటింగ్- ఇప్పుడెందుకు ట్రెండింగ్?

Black Hawk Down OTT Streaming On 9 Platforms: దిగ్గజ డైరెక్టర్ రిడ్లీ స్కాట్ అందించిన బ్లాక్ హాక్ డౌన్ ఒక విజువల్ ట్రీట్. 2001 నాటి ఈ సంచలన యుద్ధ చిత్రం బ్లాక్ హాక్ డౌన్ ఏకంగా 9 ఓటీటీల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. మరి ఆ ఓటీటీలు ఏంటీ, ఇప్పుడెందుకు ఈ సినిమా ట్రెండింగ్‌లోకి వచ్చిందనే వివరాలపై లుక్కేద్దాం.

Published on: Jun 21, 2026, 12:23:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Black Hawk Down OTT Release On 9 Platforms: ప్రపంచ సినిమా చరిత్రలో యుద్ధ నేపథ్యంలో వచ్చిన చిత్రాలకు ఎప్పుడూ ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. కేవలం రక్తం చిందే యాక్షన్ సీన్లు మాత్రమే కాకుండా, యుద్ధరంగంలో సైనికులు ఎదుర్కొనే మానసిక ఘర్షణను కళ్లకు కట్టే చిత్రాలను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు.

ఏకంగా 9 ఓటీటీల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన 816 కోట్ల వార్ యాక్షన్ థ్రిల్లర్- 7.7 రేటింగ్- ఇప్పుడెందుకు ట్రెండింగ్?
ఏకంగా 9 ఓటీటీల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన 816 కోట్ల వార్ యాక్షన్ థ్రిల్లర్- 7.7 రేటింగ్- ఇప్పుడెందుకు ట్రెండింగ్?

9 ఓటీటీల్లోకి వార్ యాక్షన్ థ్రిల్లర్

ఆ కోవకు చెందినదే హాలీవుడ్ క్లాసిక్ సూపర్ హిట్ వార్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా చిత్రం 'బ్లాక్ హాక్ డౌన్'. ప్రముఖ దర్శకుడు రిడ్లీ స్కాట్ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిన ఈ సినిమా, సుదీర్ఘ కాలం తర్వాత ఓటీటీలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. అది కూడా ఏకంగా 9 ఓటీటీల్లోకి బ్లాక్ హాక్ డౌన్ స్ట్రీమింగ్‌కు మళ్లీ వచ్చేసింది.

1993లో సోమాలియా రాజధాని మొగదిషులో అమెరికా మిలిటరీ జరిపిన రియల్ ఆపరేషన్‌పై మార్క్ బౌడెన్ రాసిన నాన్-ఫిక్షన్ పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. రిడ్లీ స్కాట్ అనగానే 'గ్లాడియేటర్', 'బ్లేడ్ రన్నర్' వంటి భారీ బడ్జెట్ కాల్పనిక చిత్రాలు గుర్తొస్తాయి.

ఐఎమ్‌డీబీ రేటింగ్

అయితే, వాటికి భిన్నంగా ఈ 144 నిమిషాల రన్‌టైమ్ ఉన్న బ్లాక్ హాక్ డౌన్ చిత్రంలో యుద్ధభూమిలోని గందరగోళాన్ని, సైనికుల మధ్య ఉండే అనుబంధాన్ని అత్యంత సహజంగా, కఠినమైన వాస్తవాలతో ఆవిష్కరించారని ప్రముఖ సినీ విశ్లేషక సంస్థ 'కొలైడర్' పేర్కొంది. అంతేకాకుండా ఈ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి పదికి 7.7 రేటింగ్ కూడా ఉంది.

భారీ తారాగణం.. అకాడమీ అవార్డుల పంట

బ్లాక్ హాక్ డౌన్ చిత్రంలో హాలీవుడ్ టాప్ స్టార్స్ జోష్ హార్ట్‌నెట్, ఇవాన్ మెక్‌గ్రెగర్, ఎరిక్ బానా, టామ్ సైజ్‌మోర్, విలియం ఫిచ్ట్‌నర్, జేసన్ ఐజాక్స్, జెరెమీ పివెన్, ఓర్లాండో బ్లూమ్‌లతో పాటు నేటి గ్లోబల్ స్టార్ టామ్ హార్డీ కూడా ఒక ముఖ్య పాత్రలో నటించారు.

బాక్సాఫీస్ వద్ద కూడా ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. దాదాపు 92 మిలియన్ డాలర్ల (2001 నాటి మారకపు విలువ ప్రకారం రూ. 432.4 కోట్లు) భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 173 మిలియన్ డాలర్ల (రూ. 816.3 కోట్లు) కలెక్షన్స్ రాబట్టింది. ఆస్కార్ బరిలోనూ నిలిచి నాలుగు నామినేషన్లను దక్కించుకోవడమే కాకుండా.. బెస్ట్ ఫిలిం ఎడిటింగ్, బెస్ట్ సౌండ్ విభాగాల్లో రెండు ప్రతిష్టాత్మక అకాడమీ అవార్డులను గెలుచుకుంది.

ఓటీటీలో ఎక్కడ చూడాలి?

ప్రస్తుత ఓటీటీ స్ట్రీమింగ్ సర్కిల్‌లో బ్లాక్ హాక్ డౌన్ సినిమాను ఏకంగా 9 వివిధ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులోకి వచ్చింది. అయితే, వేర్వేరు యాక్సెస్ మోడల్స్ ద్వారా దీనిని వీక్షించవచ్చు.

సబ్‌స్క్రిప్షన్ ద్వారా: పీకాక్ (Peacock Premium / Premium Plus) ఓటీటీ యాప్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే ఫైలో (Philo) ప్లాట్‌ఫామ్‌లో కొన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంది.

రెంట్ లేదా కొనుగోలు ద్వారా: అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Video), జీ5 (Zee5 OTT), యాపిల్ టీవీ స్టోర్ (Apple TV Store), ఫాండాంగో ఎట్ హోమ్, స్పెక్ట్రమ్ ఆన్ డిమాండ్ ఓటీటీలో బ్లాక్ హాక్ డౌన్ సినిమాను అద్దెకు తీసుకోవడం లేదా కొనుగోలు చేయడం ద్వారా చూడవచ్చు.

ఉచిత లైబ్రరీ స్ట్రీమింగ్: కానోపీ (Kanopy), హూప్లా (Hoopla) వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో లైబ్రరీ యాక్సెస్ ద్వారా ఈ చిత్రం లభ్యమవుతోంది.

ఇప్పుడే ఎందుకు ట్రెండ్ అవుతోంది?

ఈ ఓల్డ్ సినిమా ఇప్పుడు హఠాత్తుగా ఓటీటీలోకి రావడం వెనుక ఒక ఆసక్తికరమైన కారణం ఉంది. దర్శకుడు రిడ్లీ స్కాట్ నుంచి వస్తున్న తదుపరి సైన్స్ ఫిక్షన్ చిత్రం 'ది డాగ్ స్టార్స్' (The Dog Stars) 2026 ఆగస్టు 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

2017లో వచ్చిన 'ఏలియన్: కోవెనెంట్' తర్వాత ఆయన మళ్లీ సైన్స్ ఫిక్షన్ జోనర్‌లోకి వస్తుండటంతో హాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే 20వ సెంచరీ స్టూడియోస్ విడుదల చేసిన ప్రమోషనల్ వీడియోలో భయంకరమైన ఫ్లూ మహమ్మారి వల్ల భార్యను కోల్పోయిన పైలట్‌గా జాకబ్ ఎలోర్డి, మాజీ మెరైన్ సైనికుడిగా జోష్ బ్రోలిన్, మెడిక్‌గా మార్గరెట్ క్వాలీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నట్లు చూపించారు.

ఓటీటీలో మళ్లీ డిమాండ్

రిడ్లీ స్కాట్ కొత్త ప్రాజెక్ట్ చుట్టూ నడుస్తున్న ఈ బజ్ కారణంగానే, ఆయన పాత మాస్టర్‌పీస్ అయిన 'బ్లాక్ హాక్ డౌన్' చిత్రానికి ఓటీటీలో మళ్లీ భారీగా డిమాండ్ పెరిగింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More