OTT Horror: 5 ఓటీటీల్లోకి వచ్చిన హారర్ యాక్షన్ థ్రిల్లర్- రక్తపాతం, మైండ్ గేమ్‌తో- అమరత్వం కోసం మనుషులను బలిచ్చే ముఠా!
They Will Kill You OTT Streaming On 5 Platforms: ఏకంగా 5 ఓటీటీల్లోకి కామెడీ హారర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ దే విల్ కిల్ యూ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. రక్తపాతం, మైండ్ గేమ్‌తో అమరత్వం కోసం మనుషులను బలిచ్చే ముఠా కథగా తెరకెక్కిన దే విల్ కిల్ యూ ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
They Will Kill You OTT Release On 5 Platforms: మన టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో ‘కామెడీ ప్లస్ హారర్’ జోనర్‌కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. థియేటర్లలో ఈ తరహా సినిమాలు వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి.

ఓటీటీ హారర్ యాక్షన్ థ్రిల్లర్
సరిగ్గా ఇలాంటి విభిన్నమైన కథాంశంతో, రక్తపాతం, మైండ్ గేమ్, హింసతో థ్రిల్ పంచే అంతర్జాతీయ డార్క్ కామెడీ హారర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘దే విల్ కిల్ యూ’ (They Will Kill You) ఓటీటీ ప్రియులను పలకరించింది. ఒకటి, రెండు కాదు ఏకంగా 5 ఓటీటీల్లోకి దే విల్ కిల్ యూ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
2026 మార్చి 26న యూఎస్‌ఏ థియేటర్లలో విడుదలై, ప్రపంచవ్యాప్తంగా హారర్ థ్రిల్లర్ లవర్స్‌ను ఆకట్టుకున్న ఈ సినిమా 3 నెలలకు దే విల్ కిల్ యూ ఓటీటీలోకి రావడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.
మైండ్ గేమ్‌తో సీన్స్
కిరిల్ సోకోలోవ్, అలెక్స్ లిట్వాక్ సంయుక్తంగా దే విల్ కిల్ యూ సినిమా కథను అందిస్తూ దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు. యాక్షన్, హారర్, సస్పెన్స్‌తో పాటు నవ్వించేలా డార్క్ కామెడీని సమానంగా దట్టించి ఈ సినిమాను అద్భుతంగా మలిచారు. సాధారణ హారర్ సినిమాల్లా కేవలం రక్తం చిందే దారుణమైన హింస కాకుండా, మైండ్ గేమ్‌తో నడిచే సస్పెన్స్ ఎలిమెంట్స్ ఈ చిత్రానికి ప్రధాన బలం అని చెప్పుకోవచ్చు.
హ్యారీపోటర్ స్టార్‌తో కూడిన భారీ తారాగణం
ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన జాజీ బీట్జ్ అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ఆమెతో పాటు హాలీవుడ్ ప్రముఖ నటీనటులు ప్యాట్రిసియా ఆర్క్వెట్, మైహాలా కీలక పాత్రలు పోషించారు.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్న ‘హ్యారీ పోటర్’ సిరీస్ ఫేమ్ డ్రాకో మాల్‌ఫాయ్ (టామ్ ఫెల్టన్) ఈ సినిమాలో ఒక విభిన్నమైన పాత్రలో కనిపించి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. వీరితో పాటు హీథర్ గ్రాహం, ప్యాటర్సన్ జోసెఫ్ తమ నటనతో సినిమా స్థాయిని పెంచారు.
లగ్జరీ బిల్డింగ్ వెనుక దాగున్న భయంకర రహస్యం!
ఈ సినిమా కథాంశం మొత్తం న్యూయార్క్ నగరంలోని ‘వర్జిల్’ అనే ఒక అత్యంత విలాసవంతమైన భవనం చుట్టూ తిరుగుతుంది. నేరచరిత్ర ఉన్న ఆసియా రీవ్స్ (జాజీ బీట్జ్) అనే యువతి జైలు నుంచి విడుదలై వర్జిల్ బిల్డింగ్‌లో మెయిడ్‌గా పనికి చేరుతుంది.
అయితే, అలా ఆసియా ఉద్యోగంలో చేరడం వెనుక ఒక బలమైన కారణం ఉంటుంది. అదే భవనంలో పనిచేస్తూ హఠాత్తుగా అదృశ్యమైన తన సోంత చెల్లెలు మరియా కోసం ఆమె వెతుకులాట ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో ఆ బిల్డింగ్‌లో నివసించే కోటీశ్వరులంతా ఒక భయంకరమైన సాతాను (Satanic Cult) అనే రహస్య హంతక ముఠాగా ఏర్పడిందని, వారు అమరత్వం కోసం మనుషులను బలి ఇస్తారని తెలుసుకుంటుంది ఆసియా.
5 ఓటీటీల్లోకి
అక్కడి నుంచి ఆమె తన ప్రాణాలను కాపాడుకుంటూ, చెల్లెలిని ఎలా వెతికి పట్టుకుందా?, ఆ హంతక ముఠా నుంచి తన చెల్లెలిని కాపాడుకుందా? ప్రాణాలతో ఆసియా బయటపడిందా? అనేదే ఈ సినిమా మిగిలిన కథ. ఈ కథను రక్తం పారే యాక్షన్ సీన్లతో చూపించారు.
ఇలా రక్తం ఏరులై పారే యాక్షన్ సీన్లతోపాటు భయపెట్టే హారర్ ఎలిమెంట్స్‌తో సాగే దే విల్ కిల్ యూ ఏకంగా 5 ఓటీటీల్లోకి వచ్చేసింది. భారత్‌లోని ఓటీటీ ఆడియెన్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), యాపిల్ టీవీ (Apple TV), గూగుల్ యూట్యూబ్ (YouTube) వేదికల ద్వారా ఈ సినిమాను అద్దెకు (Rental) తీసుకోవడం లేదా పూర్తిగా కొనుగోలు (Purchase) చేయడం ద్వారా వీక్షించవచ్చు.
దే విల్ కిల్ యూ ఓటీటీ స్ట్రీమింగ్
అయితే, హెచ్‌బీవో మ్యాక్స్ ఓటీటీలో (HBO Max OTT) రెంటల్ విధానం లేకుండా సబ్‌స్క్రిప్షన్‌తో ఫ్రీగా దే విల్ కిల్ యూ సినిమాను చూసేయొచ్చు. ఇదే కాకుండా ఫండంగో ఎట్ హోమ్ (Fandango at Home OTT) అనే మరో డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో కూడా దే విల్ కిల్ యూ ఓటీటీ రిలీజ్ అయింది. ఇలా ఐదింట్లో జూన్ 12 నుంచి దే విల్ కిల్ యూ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


