Cocktail 2 OTT: ఓటీటీలోకి నిన్న థియేటర్లలో రిలీజైన రష్మిక మందన్నా రొమాంటిక్ మూవీ కాక్‌టెయిల్ 2- స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Rashmika Mandanna Cocktail 2 OTT Streaming: షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్నాల బాలీవుడ్ రొమాంటిక్ మూవీ కాక్‌టెయిల్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. జూన్ 19న అంటే నిన్న థియేటర్లలో విడుదలైన కాక్‌టెయిల్ 2 ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
Rashmika Mandanna Cocktail 2 OTT Release Details: బాలీవుడ్ లవ్ అండ్ రోమాంటిక్ ఎంటర్‌టైనర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఒక సూపర్ అప్‌డేట్ వచ్చేసింది. 2012లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన 'కాక్‌టెయిల్' చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన 'కాక్‌టెయిల్ 2' ఎట్టకేలకు జూన్ 19న అంటే నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

రష్మిక రొమాంటిక్ డ్రామా
షాహిద్ కపూర్, కృతి సనన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ముగ్గురు జంటగా నటించిన కాక్‌టెయిల్ 2 చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. హోమీ అదజానియా దర్శకత్వంలో సరికొత్త హంగులతో రూపుదిద్దుకున్న ఈ మోడరన్ లవ్ స్టోరీని చూసేందుకు సినీ ప్రియులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.
ఈ క్రేజీ మూవీ థియేటర్లలో రిలీజ్ కాగానే ఓటీటీ లవర్స్ అప్పుడే దీని డిజిటల్ రిలీజ్ ప్లాట్‌ఫామ్ గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. దీంతో కాక్‌టెయిల్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలపై అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది.
కాక్‌టెయిల్ 2 ఓటీటీ రైట్స్
అయితే, కాక్‌టెయిల్ 2 ఓటీటీ హక్కులను డిజిటల్ స్ట్రీమింగ్ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) సొంతం చేసుకుంది. అంటే, థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో కాక్‌టెయిల్ 2 ఓటీటీ రిలీజ్ కానుంది.
సినిమా థియేటర్ల విడుదల ఒప్పందంతోనే నెట్‌ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు ఈ కాక్‌టెయిల్ 2 డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అయితే స్ట్రీమింగ్ తేదీపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో
సాధారణంగా పెద్ద సినిమాలు విడుదలైన నాలుగు నుంచి ఆరు వారాల తర్వాతే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి వస్తాయి కాబట్టి, ఆగస్టు మొదటి వారంలో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి కాక్‌టెయిల్ 2 అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
బాక్సాఫీస్ వద్ద సమంతతో రష్మిక ఫైట్!
ఈ వారం బాక్సాఫీస్ రేసు చాలా ఆసక్తికరంగా మారింది. తెలుగు ప్రేక్షకులకు ఇది ఇద్దరు మోస్ట్ వాంటెడ్ స్టార్ హీరోయిన్ల మధ్య జరుగుతున్న పోరులా కనిపిస్తోంది. షాహిద్, రష్మికల ‘కాక్‌టెయిల్ 2’ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీనే ఎదురవుతోంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ అవేటెడ్ విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaaram) కూడా ఇదే సమయంలో థియేటర్లలోకి వచ్చింది. రష్మిక బాలీవుడ్ మార్కెట్‌లో తన సత్తా చాటాలని చూస్తుంటే, సమంత తన ప్రాంతీయ బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమైంది. దీంతో సౌత్ ఇండస్ట్రీలో ఈ ఇద్దరు ముద్దుగుమ్మల బాక్సాఫీస్ ఫైట్ ఆసక్తి రేపుతోంది.
తెరవెనుక స్టార్ టెక్నీషియన్స్
కాగా కాక్‌టెయిల్ 2 చిత్రానికి మొదటి భాగమైన 'కాక్‌టెయిల్'తో పాటు 'అంగ్రేజీ మీడియం' వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన హోమీ అదజానియా దర్శకత్వం వహించడం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. మాడ్‌డాక్ ఫిలిమ్స్, లవ్ ఫిలిమ్స్ బ్యానర్లపై దినేష్ విజన్, లవ్ రంజన్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మించారు.
బాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ ప్రీతమ్ చక్రవర్తి అందించిన స్వరాలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యువతను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. అక్షర ప్రభాకర్ ఎడిటింగ్ బాధ్యతలు చూసుకోగా, సంతాన కృష్ణన్ రవిచంద్రన్ తన కెమెరా పనితనంతో విజువల్స్‌ను రిచ్‌గా ఆవిష్కరించారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


