Rashmika Shahid: రష్మిక మందన్నాకు కౌంటర్ ఇచ్చిన హీరో షాహిద్ కపూర్- పగలబడి నవ్విన కృతి సనన్- వీడియో వైరల్- అసలు ఏమైందంటే?
Shahid Kapoor Mimics Rashmika Mandanna Cocktail 2: బాలీవుడ్ క్రేజీ సీక్వెల్ కాక్‌టేయిల్ 2 ప్రమోషన్స్‌లో భాగంగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకు స్టార్ హీరో షాహిద్ కపూర్ కౌంటర్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో నవ్వు తెప్పిస్తోంది. ఇంతకీ ఏం జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం.
Shahid Kapoor Mimics Rashmika Mandanna Cocktail 2: బాలీవుడ్‌లో 2012 కాలంలో సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొణె, డయానా పెంటీ కాంబినేషన్‌లో వచ్చి యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్న రోమాంటిక్ డ్రామా 'కాక్‌టేయిల్'. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా 'కాక్‌టేయిల్ 2' (Cocktail 2) ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.

రష్మిక మందన్నా కీలక పాత్ర
హోమీ అదజానియా దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో షాహిద్ కపూర్, కృతి సనన్ లీడ్ రోల్స్ చేస్తుండగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కీలక పాత్ర పోషిస్తోంది. జూన్ 19న థియేటర్లలోకి విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ముంబైలో జోరుగా సాగుతున్నాయి.
సోషల్ మీడియా రూమర్లకు షాహిద్ ఫన్నీ కౌంటర్
అయితే కాక్‌టేయిల్ 2 సినిమా విడుదలకంటే ముందే షాహిద్ కపూర్, రష్మికల మధ్య జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కొద్దిరోజుల క్రితం జరిగిన ఈ కాక్‌టేయిల్ 2 మ్యూజిక్ లాంచ్ ఈవెంట్‌లో ఫొటోగ్రాఫర్లకు పోజులిచ్చే సమయంలో రష్మిక భుజంపై షాహిద్ చేయి వేశాడు. ఆ వెంటనే రష్మిక కాస్త వెనక్కి తప్పుకుంది.
ఈ చిన్న వీడియో క్లిప్‌ను పట్టుకున్న నెటిజన్లు రష్మిక మందన్నా ఇబ్బందిగా ఫీలయిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు, రూమర్లు సృష్టించారు. తాజాగా మే 29న జరిగిన ప్రమోషనల్ ఈవెంట్‌లో షాహిద్ కపూర్ ఈ వివాదంపై తనదైన శైలిలో స్పందించాడు. ఫొటోలకు పోజులిస్తూ రష్మిక లాగే తానూ వెనక్కి తప్పుకుంటూ సరదాగా యాక్ట్ చేశాడు. ఇది చూసి పక్కనే ఉన్న కృతి సనన్ పగలబడి నవ్వగా, రష్మిక కూడా నవ్వుతూనే క్లారిటీ ఇచ్చింది.
"నేను ఏ ఉద్దేశంతోనూ అలా వెనక్కి తప్పుకోలేదు" అని రష్మిక మందన్నా నవ్వుతూ షాహిద్‌కు వివరణ ఇచ్చింది. దీంతో ఈ ఇద్దరి స్టార్ల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కేవలం పుకార్లేనని తేలిపోయింది.
ఈ ప్రమోషనల్ ఈవెంట్‌కు సంబంధించిన సరికొత్త వీడియోలు ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కెమెరా ముందే కాకుండా తెరవెనుక కూడా వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉందనే విషయం ఈ సరదా సంభాషణతో స్పష్టమైంది.
‘మాషూకా’ సాంగ్ కాపీ వివాదం.. ప్రీతమ్ ఘాటు స్పందన
ఈ సినిమాకు సంబంధించి మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్‌కు ఒక విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఈ చిత్రంలోని ‘మాషూకా’ (Mashooqa) అనే పాట ట్యూన్‌ను 1993 నాటి ‘సే సో అర్రుబేట్ అ నోన్నా’ అనే ఇటాలియన్ ట్రాక్ నుంచి కాపీ కొట్టారంటూ కొంతమంది నెటిజన్లు ఆరోపణలు గుప్పించారు. ఈ విమర్శలపై ప్రీతమ్ సోషల్ మీడియా వేదికగా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.
"నేను ఏ కొత్త పాట విడుదల చేసినా కొంతమంది సెల్ఫ్ అపాయింటెడ్ మ్యూజిక్ డిటెక్టివ్‌లు తయారవుతున్నారు. వాళ్లే ‘ఊహాజనిత పోలికలు’ అనే కొత్త జోనర్‌ను సృష్టించారు. అదే మనుషులు, అదే కాపీ సిద్ధాంతాలు. ఒక రకంగా మీరు నా ఉచిత పీఆర్ టీమ్‌లా పనిచేస్తున్నారు. కానీ, ఇలా చేయడం అస్సలు బాగులేదు" అని ప్రీతమ్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో అసహనం వ్యక్తం చేశారు.
రష్మిక భారీ సక్సెస్ అందుకోవాలని
వివాదాలు, క్రేజీ బంటర్లతో వార్తల్లో నిలుస్తున్న 'కాక్‌టేయిల్ 2' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన రష్మిక మందన్నా ఈ సినిమాతో బాలీవుడ్‌లో మరో భారీ సక్సెస్ అందుకోవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


