Rashmika Kriti Sanon: సినిమా ప్రమోషన్స్‌లో కలకలం- రష్మిక మందన్నాను అక్కలా రక్షించిన కృతి సనన్- టాల్ బేబీ ఎనర్జీ అంటూ!
Kriti Sanon Protects Rashmika Mandanna Cocktail 2 Promotions: బాలీవుడ్ రొమాంటిక్ మూవీ కాక్‌టెయిల్ 2 ప్రమోషన్స్‌లో హీరో హీరోయిన్లు షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్నాలకు చేదు అనుభవం ఎదురైంది. అభిమానులు భారీగా ఎగబడటంతో తొక్కిసలాట నెలకొంది. రష్మికను కృతి సనన్ రక్షించిన తీరు ఆకట్టుకుంటోంది.
Kriti Sanon Protects Rashmika Mandanna Cocktail 2 Promotions: సినీ తారలకు అభిమానుల క్రేజ్ ఒక్కోసారి ఊహించని ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. తాజాగా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, స్టార్ హీరోయిన్లు కృతి సనన్, రష్మిక మందన్నాలకు మహారాష్ట్రలోని పూణె నగరంలో ఇలాంటి పరిస్థితే ఎదురైంది.

ప్రమోషన్స్‌లో కలకలం
షాహిద్, రష్మిక, కృతి సనన్ హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ మూవీ 'కాక్‌టెయిల్ 2' (Cocktail 2). ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం పుణెలోని ఒక ప్రముఖ మాల్‌ను సందర్శించింది. అయితే ఈ ఈవెంట్ కాస్తా క్షణాల వ్యవధిలోనే తీవ్ర గందరగోళానికి దారితీసింది.
హీరోహీరోయిన్లను చూడటానికి వేలాదిగా తరలివచ్చిన జనం ఒక్కసారిగా భద్రతా బారికేడ్లను బద్దలు కొట్టుకుని ముందుకు దూసుకువచ్చారు. దాంతో అక్కడ తొక్కిసలాట లాంటి వాతావరణం ఏర్పడింది. ఈ ఊహించని పరిణామంతో ఈవెంట్‌ను మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది.
రష్మికను కాపాడిన కృతి సనన్
జనం విపరీతంగా మీదకు వస్తుండటంతో హీరో షాహిద్ కపూర్ తీవ్ర అసహనానికి లోనయ్యారు. భద్రతా సిబ్బంది నటీనటులను బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుండగా.. అటు ఇటు నెట్టేస్తున్న గుంపు నుంచి రష్మిక మందన్నాను కృతి సనన్ గట్టిగా పట్టుకుని, ఆమెకు రక్షణగా నిలిచారు.
ఈ తోపులాటలో రష్మిక మందన్నాకు ఎటువంటి గాయాలు కాకుండా కృతి సనన్ కాపాడిన తీరు, నేషనల్ క్రష్‌కు ఒక పెద్ద దిక్కులా వ్యవహరించిన తీరు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో అందరి మనసులను గెలుచుకుంటోంది.
వీడియో వైరల్
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కృతి సనన్ సమయస్ఫూర్తిని, తోటి నటిపై చూపిన ప్రేమాభిమానాలను కొనియాడుతున్నారు.
'అక్కలా కాపాడింది'.. నెటిజన్ల ప్రశంసల జల్లు
"రష్మికను కృతి సనన్ సొంత చెల్లెలిలా కాపాడింది, వీరిద్దరి మధ్య ఉన్న బంధం చాలా గొప్పది" అని ఒకరు కామెంట్ చేయగా.. "పక్కా టాల్ బేబ్ ఎనర్జీ.. కృతిని చూస్తుంటే ఒక పెద్దక్కలా అనిపిస్తోంది" అంటూ మరికొందరు నెటిజన్లు రాసుకొచ్చారు.
అదే సమయంలో మాల్ నిర్వాహకులు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ తీసుకున్న భద్రతా చర్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అంత పెద్ద తారలు వస్తున్నప్పుడు కనీస క్రౌడ్ మేనేజ్‌మెంట్ లేకపోవడం దారుణమని, కొంతమంది అభిమానుల ప్రవర్తన అసహ్యకరంగా ఉందంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.
ఆసక్తి రేకెత్తిస్తున్న 'కాక్‌టెయిల్ 2'
2012లో సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొణె, డయానా పెంటీ ప్రధాన పాత్రల్లో వచ్చి సూపర్ హిట్ సాధించిన 'కాక్‌టెయిల్' చిత్రానికి సీక్వెల్‌గా ఈ కొత్త సినిమా వస్తోంది. ప్రముఖ దర్శకుడు హోమి అదజానియా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ముక్కోణపు ప్రేమకథ (Love Triangle) నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఇద్దరు భామల మధ్య నలిగిపోయే యువకుడిగా షాహిద్ కపూర్ నటించారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న 'కాక్‌టెయిల్ 2' జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
లెస్బియన్ లవ్ స్టోరీపై క్లారిటీ
కాక్‌టెయిల్ 2 ట్రైలర్ లాంచ్ సమయంలో దర్శకుడు హోమి ఈ సినిమాపై వస్తున్న కొన్ని రూమర్లకు క్లారిటీ ఇచ్చారు. ఇదొక లెస్బియన్ లవ్ స్టోరీ అంటూ సాగుతున్న ప్రచారంపై ఆయన స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.
"షూటింగ్ సెట్‌లో కృతి, రష్మిక మంచి స్నేహితులు కావడంతో చాలా సరదాగా, ఒకరినొకరు హగ్ చేసుకుంటూ ఉండేవారు. అప్పుడు మేము సరదాగా.. ఒకవేళ కథ వీరిద్దరి మధ్య ఉండి, షాహిద్ కపూర్ కేవలం సైడ్ క్యారెక్టర్ అయితే ఎలా ఉంటుంది అని మాట్లాడుకున్నాం. అక్కడి నుంచే ఈ రూమర్స్ పుట్టుకొచ్చాయి" అని డైరెక్టర్ స్పష్టం చేశారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. పుణెలో జరిగిన 'కాక్‌టెయిల్ 2' ఈవెంట్‌లో ఏం జరిగింది?
సినిమా ప్రమోషన్స్ కోసం షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్న పుణెలోని మాల్‌కు వెళ్లినప్పుడు.. అభిమానులు బారికేడ్లను బద్దలు కొట్టడంతో తొక్కిసలాట జరిగి ఈవెంట్‌ను మధ్యలోనే రద్దు చేశారు.
2. సోషల్ మీడియాలో కృతి సనన్‌పై ఎందుకు ప్రశంసలు వస్తున్నాయి?
ఈవెంట్‌లో తొక్కిసలాట జరుగుతున్న సమయంలో కృతి సనన్ తోటి నటి రష్మిక మందన్నను గుంపు నుండి రక్షిస్తూ, జాగ్రత్తగా బయటకు తీసుకువచ్చినందుకు నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
3. 'కాక్‌టెయిల్ 2' సినిమా ఎప్పుడు విడుదలవుతోంది?
హోమి అదజానియా దర్శకత్వంలో షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్న లీడ్ రోల్స్ చేసిన 'కాక్‌టెయిల్ 2' చిత్రం జూన్ 19న థియేటర్లలో విడుదల కానుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


