Cocktail 2: ఇండియాలోనే 13 కోట్లు రాబట్టిన రష్మిక మందన్నా రొమాంటిక్ మూవీ కాక్‌టెయిల్ 2- ఒరిజినల్ మూవీ రికార్డ్ బద్ధలు!

Cocktail 2 Box Office Collection Day 1: బాలీవుడ్ రోమాంటిక్ డ్రామా ‘కాక్‌టెయిల్ 2’ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఓపెనింగ్స్ సాధించింది. షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం తొలిరోజే డబుల్ డిజిట్ మార్కును దాటేసి ఇండియాలో రూ.13.50 కోట్ల నెట్ వసూళ్లతో దూసుకుపోతోంది.

Published on: Jun 20, 2026, 11:50:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Rashmika Shahid Kriti Cocktail 2 Box Office Collection Day 1: బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలతో విడుదలైన రొమాంటిక్ డ్రామా సినిమా ‘కాక్‌టెయిల్ 2’ థియేటర్లలో అదిరిపోయే బోణీ కొట్టింది. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన (Mixed Reviews) వచ్చినప్పటికీ, ప్రేక్షకులు మాత్రం థియేటర్లకు క్యూ కడుతున్నారు.

ఇండియాలోనే 13 కోట్లు రాబట్టిన రష్మిక మందన్నా రొమాంటిక్ మూవీ కాక్‌టెయిల్ 2- ఒరిజినల్ మూవీ రికార్డ్ బద్ధలు!
ఇండియాలోనే 13 కోట్లు రాబట్టిన రష్మిక మందన్నా రొమాంటిక్ మూవీ కాక్‌టెయిల్ 2- ఒరిజినల్ మూవీ రికార్డ్ బద్ధలు!

దేశవ్యాప్తంగా భారీ విడుదల.. తొలిరోజు కలెక్షన్స్ ఇవే

షాహిద్ కపూర్, కృతి సనన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కలయికలో వచ్చిన ఈ చిత్రం తొలిరోజే డబుల్ డిజిట్ మార్క్‌ను చాలా సులభంగా దాటేసింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా సుమారు 3000కు పైగా స్క్రీన్స్‌లో గ్రాండ్‌గా విడుదల చేశారు. ఒక ప్రేమకథా చిత్రానికి ఈ స్థాయిలో స్క్రీన్లు కేటాయించడం చాలా పెద్ద విషయమనే చెప్పాలి.

శుక్రవారం (జూన్ 19) విడుదలైన కాక్‌టెయిల్ 2 సినిమా మొదటి రోజే ఇండియాలో ఏకంగా రూ.13.50 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించగా.. రూ. 16.20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

1.6 లక్షలకుపైగా టికెట్స్ సేల్

ప్రముఖ ట్రేడ్ ట్రాకర్ సాక్‌నిల్క్ నివేదిక ప్రకారం.. మొదటి రోజు కోసం 1.6 లక్షలకు పైగా కాక్‌టెయిల్ 2 టికెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అమ్ముడయ్యాయి. దీని ద్వారా రూ.5.57 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. స్పాట్ బుకింగ్స్, బ్లాక్డ్ సీట్లను కూడా కలుపుకుంటే ఈ సంఖ్య రూ.8 కోట్లను దాటింది.

మార్నింగ్ షోల కంటే ఈవెనింగ్, నైట్ షోలకు థియేటర్లలో అక్యూపెన్సీ (ప్రేక్షకుల సంఖ్య) బాగా పెరగడంతో తొలిరోజు నెట్ వసూళ్లు రూ.13 కోట్లను దాటాయి. ఇక వరల్డ్ వైడ్‌గా తొలి రోజు కాక్‌టెయిల్ 2 సినిమాకు రూ. 20.20 కోట్ల గ్రాస్ రాగా ఓవర్సీస్‌లో రూ. 4 కోట్లు వచ్చాయి.

పాత ‘కాక్‌టెయిల్’ రికార్డు బద్దలు.. కానీ!

అయితే మిశ్రమ టాక్ రావడంతో శని, ఆదివారాల్లో మౌత్ టాక్ (Word of Mouth) ఎలా ఉంటుందనే దాన్ని బట్టే సినిమా లాంగ్ రన్ ఆధారపడి ఉంటుంది. ఈ సినిమాకు ఇంత మంచి ఓపెనింగ్స్ రావడానికి ప్రధాన కారణం 2012లో వచ్చిన ఒరిజినల్ ‘కాక్‌టెయిల్’ సినిమాకు ఉన్న క్రేజ్, అలాగే షాహిద్, కృతి, రష్మికల స్టార్ పవరేనని చెప్పాలి.

ఇంతియాజ్ అలీ కథ అందించగా, హోమి అదజానియా దర్శకత్వంలో వచ్చిన నాటి ‘కాక్‌టెయిల్’లో సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొణె, డయానా పెంటి నటించారు. ఆ సినిమా తొలిరోజు రూ.10.47 కోట్లు వసూలు చేయగా.. ఇప్పుడు వచ్చిన సీక్వెల్ రూ.13.50 కోట్లతో ఆ రికార్డును దాటేసింది.

రూ. 125 కోట్ల గ్రాస్‌తో సంచలనం

నిజానికి, నాటి వసూళ్లను నేటి ద్రవ్యోల్బణంతో (Inflation) పోల్చి చూస్తే.. పాత సినిమా రికార్డును నిజమైన అర్థంలో అధిగమించడానికి ‘కాక్‌టెయిల్ 2’ కనీసం రూ.18 నుంచి 19 కోట్లు రాబట్టాల్సి ఉండేది. ఆ లెక్కన చూస్తే టికెట్ల అమ్మకాల పరంగా పాత సినిమానే కాస్త పైచేయి సాధించిందని చెప్పాలి. నాడు 2012లో విడుదలైన కాక్‌టెయిల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.125 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి అప్పట్లో సంచలనం సృష్టించింది.

సరికొత్త కథతో ఫ్రాంచైజీ

హోమి అదజానియా దర్శకత్వం వహించిన ‘కాక్‌టెయిల్ 2’ కేవలం ఒక స్పిరిచువల్ సీక్వెల్ (కథతో సంబంధం లేని సిరీస్) మాత్రమే. అంటే పాత కథకు, ఈ కొత్త కథకు ఎలాంటి సంబంధం ఉండదు. ఇది పూర్తిగా భిన్నమైన కథాంశం, సరికొత్త పాత్రలతో సరికొత్త ఫ్రాంచైజీగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

రష్మిక మందన్నా నటన ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. వీకెండ్‌లో ఈ చిత్రం మరిన్ని వసూళ్లు సాధిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More