Girija Oak: నేషనల్ క్రష్ ట్యాగ్‌పై నటి గిరిజా ఓక్- అందాన్ని వాడుకోమన్న కంగనా రనౌత్- గంటకి ఎంత తీసుకుంటావని మెసేజ్‌లు!

Girija Oak On National Crush Tag: సోషల్ మీడియాలో 'నేషనల్ క్రష్'గా మారిన నటి గిరిజా ఓక్ తన వైరల్ ఫేమ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూన్ 12న విడుదలవుతున్న భారత్ భాగ్య విధాత మూవీ ప్రమోషన్లలో కంగనా రనౌత్‌తో కలిసి పాల్గొన్న గిరిజా ఓక్ తనకు వచ్చిన ఇంటర్నెట్ క్రేజ్ వెనుక ఉన్న చీకటి కోణాన్ని బయటపెట్టారు.

Published on: Jun 2, 2026, 13:03:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Girija Oak On National Crush And Blue Saree Girl Tag: డిజిటల్ ప్రపంచంలో రాత్రికి రాత్రే స్టార్‌డమ్ రావడం ఎంత సులువో, అంతే వేగంగా దాని వల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా అంతే సహజంగా మారిపోయింది. గత ఏడాది నవంబర్ 2025లో ఒకే ఒక్క వీడియో క్లిప్‌తో ఇంటర్నెట్‌ను ఊపేసిన బ్యూటిపుల్ నటి గిరిజా ఓక్ (Girija Oak) తాజా ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినిమా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

నేషనల్ క్రష్ ట్యాగ్‌పై నటి గిరిజా ఓక్- అందాన్ని వాడుకోమన్న కంగనా రనౌత్- గంటకి ఎంత తీసుకుంటావని మెసేజ్‌లు!
నేషనల్ క్రష్ ట్యాగ్‌పై నటి గిరిజా ఓక్- అందాన్ని వాడుకోమన్న కంగనా రనౌత్- గంటకి ఎంత తీసుకుంటావని మెసేజ్‌లు!

బ్లూ శారీ గర్ల్

కేవలం ఒక బ్లూ కలర్ శారీ కట్టుకుని ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల గిరిజా ఓక్ 'బ్లూ శారీ గర్ల్'గా సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. నెటిజన్లు ఆమెను ఏకంగా కొత్త 'నేషనల్ క్రష్' అంటూ ట్రెండ్ చేశారు. అయితే, ఈ వైరల్ ఫేమ్‌పై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.

గిరిజా ఓక్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'భారత్ భాగ్య విధాత' (Bharat Bhhagya Viddhaata) జూన్ 12, 2026న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్‌తో కలిసి గిరిజా ఓక్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఆ సమయంలో యాంకర్ గిరిజాను ఉద్దేశించి, 'బ్లూ శారీ గర్ల్'గా మీరు దేశవ్యాప్తంగా ఎంతగానో ఫేమస్ అయ్యారు కదా అని ప్రశ్నించారు. అంతేకాదు, గిరిజా బయోటెక్నాలజీ చదివారని, ఆమెకు ఒక బాధ్యతగల తల్లిగా మరో జీవితం కూడా ఉందని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న కంగనా స్పందిస్తూ, "అసలు ఏంటి ఆ బ్లూ శారీ కథ? నేను కూడా దీని గురించి విన్నాను" అంటూ ఆసక్తి చూపించారు.

అందం నా ఘనత కాదు: గిరిజా ఓక్

ఈ ప్రశ్నపై గిరిజా స్పందిస్తూ ఇంటర్నెట్ ప్రపంచం గురించి కొన్ని ఆసక్తికర నిజాలు పంచుకున్నారు. "ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూకు సంబంధించిన చిన్న క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు దాన్ని విపరీతంగా షేర్ చేశారు. అసలు ఇంటర్నెట్ ఎప్పుడు ఎలా స్పందిస్తుందో ఎవరికీ అర్థం కాదు. దానికి ఎలాంటి లాజిక్ ఉండదు" అని గిరిజా ఓక్ అన్నారు.

"చాలామంది నా లుక్స్‌ను తెగ పొగిడారు. కానీ, చివరికి ఆలోచిస్తే అది నా కష్టంతో సాధించిన ఘనత ఏమాత్రం కాదు. అది కేవలం నా తల్లిదండ్రుల నుంచి వచ్చిన జీన్స్ (Genes) వల్ల జరిగింది. నా లుక్ కోసం నేను సొంతంగా సాధించింది ఏమీ లేదు" అని గిరిజా ఓక్ స్పష్టం చేశారు.

గిరిజా ఓక్ సమాధానానికి కంగనా రనౌత్ నవ్వుతూ ఒక సరదా కౌంటర్ ఇచ్చారు. "నువ్వు నా సినిమాలో నటించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దయచేసి నీ ఆ అందాన్ని వాడుకునే మన సినిమాను బాగా ప్రమోట్ చెయ్" అని కంగనా రనౌత్ చమత్కరించారు.

'నేషనల్ క్రష్' ట్యాగ్‌పై సున్నితమైన కౌంటర్

యాంకర్ మరోసారి స్పందిస్తూ.. మీరు నేషనల్ క్రష్ ట్యాగ్‌ను చాలా సింపుల్‌గా తీసుకుంటున్నారని అనగా, గిరిజా దానికి మరింత వివరణ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఒక గుర్తింపు రావడానికి ఒక ప్రామాణికత ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. కంగనా రనౌత్ జాతీయ అవార్డులు సాధించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడం వెనుక ఒక లెజిటిమసీ (చట్టబద్ధత) ఉందన్న గిరిజా, ఇంటర్నెట్ ఇచ్చే నేషనల్ క్రష్ ట్యాగులకు ఎలాంటి సర్టిఫికెట్లు ఉండవని తేల్చిచెప్పారు.

ఇదిలా ఉంటే, షారుఖ్ ఖాన్ బ్లాక్‌బస్టర్ హిట్ సినిమా 'జవాన్' (2023)లో గిరిజా ఓక్ ఒక కీలక పాత్రలో మెప్పించారు. అంతకుముందు అమీర్ ఖాన్ క్లాసిక్ మూవీ 'తారే జమీన్ పర్' (2007), 'షోర్ ఇన్ ది సిటీ' (2010) వంటి చిత్రాల్లో నటించి నటిగా తన ప్రతిభను నిరూపించుకున్నారు. మరాఠీ, హిందీ చిత్ర పరిశ్రమల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న గిరిజా, కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటున్నారు.

వైరల్ ఫేమ్ వెనుక ఉన్న చీకటి కోణం

రాత్రికి రాత్రే వచ్చే ఈ డిజిటల్ ఫేమ్ వల్ల ఎదురయ్యే ఇబ్బందులను కూడా గిరిజా గతంలో ఒక ఇంటర్వ్యూలో ధైర్యంగా పంచుకున్నారు. సోషల్ మీడియాలో క్రేజ్ రాగానే తనకేమీ అదనంగా సినిమా ఆఫర్లు రాలేదని ఆమె స్పష్టం చేశారు. పైగా ఇంటర్నెట్ వేదికగా కొందరు పంపే అసభ్యకరమైన సందేశాలు తనను తీవ్రంగా కలవరపెట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు.

"నీకోసం నేను ఏదైనా చేస్తాను, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని కొందరు మెసేజ్లు పెట్టారు. మరికొందరైతే ఏకంగా నా రేటు ఎంత అని అడిగారు. నాతో ఒక గంట గడపడానికి ఎంత తీసుకుంటావని అసభ్యంగా మెసేజెస్ పంపారు. తెర వెనుక దాక్కుని ఇంటర్నెట్‌లో ఇలాంటి వాళ్లు ఏమైనా వాగుతారు. కానీ, వీళ్లే నిజ జీవితంలో ఎదురుపడితే కనీసం కళ్లెత్తి కూడా చూడలేరు. ముఖాముఖిగా మాట్లాడేటప్పుడు ఎంతో గౌరవం నటిస్తారు. ఈ వర్చువల్ ప్రపంచాన్ని మనం ఎంతవరకు సీరియస్‌గా తీసుకోవాలో అందరూ ఆలోచించాలి" అని గిరిజా చెప్పుకొచ్చారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. గిరిజా ఓక్ సోషల్ మీడియాలో ఎందుకు వైరల్ అయ్యారు?

నవంబర్ 2025లో ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో గిరిజా ఓక్ బ్లూ కలర్ శారీలో కనిపించారు. ఆ వీడియో క్లిప్ ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ కావడంతో నెటిజన్లు ఆమెను 'బ్లూ శారీ గర్ల్', 'నేషనల్ క్రష్' అని పిలవడం ప్రారంభించారు.

2. గిరిజా ఓక్ నటించిన ప్రముఖ సినిమాలు ఏవి?

ఆమె హిందీలో ఆమిర్ ఖాన్ 'తారే జమీన్ పర్', షారుఖ్ ఖాన్ 'జవాన్', అలాగే 'షోర్ ఇన్ ది సిటీ' వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. మరాఠీ సినిమాల్లోనూ ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

3. కంగనా రనౌత్, గిరిజా ఓక్ కలిసి నటించిన కొత్త సినిమా ఏది?

వీరిద్దరూ కలిసి నటించిన తాజా చిత్రం 'భారత్ భాగ్య విధాత' (Bharat Bhhagya Viddhaata). ఈ సినిమా జూన్ 12, 2026న థియేటర్లలో విడుదల కానుంది.

4. వైరల్ క్రేజ్ గురించి గిరిజా ఓక్ ఏమని వ్యాఖ్యానించారు?

తన లుక్ అనేది కేవలం తల్లిదండ్రుల నుంచి వచ్చిన జీన్స్ వల్ల కలిగిందే తప్ప, అది తన సొంత ఘనత కాదని ఆమె అన్నారు. అలాగే ఇంటర్నెట్ ఫేమ్ వల్ల వచ్చే అసభ్యకర సందేశాల (Dark Side) గురించి కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More