Kangana PM: నరేంద్ర మోదీని ఫ్యామిలీతో కలిసిన కంగనా రనౌత్- బహుమతిగా విష్ణు దశావతారం పెయింటింగ్- ప్రత్యేక ఆకర్షణగా ఆ చీర!

Kangana Ranaut Met Narendra Modi With Family: బాలీవుడ్ క్వీన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని తన కుటుంబంతో పాటు కలిసింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా కంగనా రనౌత్ కట్టిన చీర స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది.

Published on: Mar 23, 2026, 23:04:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, మండి లోక్‌సభ నియోజకవర్గ ఎంపీ, హీరోయిన్ కంగనా రనౌత్ 40వ వసంతంలోకి అడుగుపెట్టారు. సోమవారం (మార్చి 23) తన పుట్టినరోజును పురస్కరించుకుని కంగనా రనౌత్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా మీట్ అయ్యారు. ఈ అపురూప ఘట్టానికి సంబంధించిన ఫోటోలను కంగనా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

నరేంద్ర మోదీని ఫ్యామిలీతో కలిసిన కంగనా రనౌత్- బహుమతిగా విష్ణు దశావతారం పెయింటింగ్- ప్రత్యేక ఆకర్షణగా ఆ చీర!
నరేంద్ర మోదీని ఫ్యామిలీతో కలిసిన కంగనా రనౌత్- బహుమతిగా విష్ణు దశావతారం పెయింటింగ్- ప్రత్యేక ఆకర్షణగా ఆ చీర!

ప్రధానితో చిరస్మరణీయమైన పుట్టినరోజు

ఈ భేటీ గురించి కంగనా రనౌత్ స్పందిస్తూ.. "గౌరవనీయులైన ప్రధానమంత్రి సమయాన్ని, ఆయన అమూల్యమైన మార్గదర్శకత్వాన్ని ఈ రోజు నా కుటుంబంతో కలిసి పొందాను. నా జీవితంలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే పుట్టినరోజు" అని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఉత్సాహంగా ఆడుకుంటూ

కంగనా పంచుకున్న ఫోటోలలో ఆమె తల్లిదండ్రులు ప్రధాని ముందు వినయంగా చేతులు జోడించి కూర్చోగా, మోదీ చిరునవ్వుతో వారితో మాట్లాడుతుండటం కనిపిస్తోంది. మరో ఫోటోలో కంగనా మేనల్లుడు ప్రధాని సమీపంలో ఉత్సాహంగా ఆడుకుంటూ కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు.

ప్రధానికి ప్రత్యేక కానుకలు

ఈ సందర్భంగా కంగనా తన సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ సంస్కృతి ఉట్టిపడేలా ప్రధానికి అద్భుతమైన కానుకలను అందించారు. హిమాచలీ చేనేత శాలువాతో పాటు, విష్ణుమూర్తి పది అవతారాలను ప్రతిబింబించే 'విష్ణు దశావతారం' పెయింటింగ్‌ను ఆమె బహుకరించారు. ఎప్పుడూ భారతీయ చేనేత వస్త్రాలకు ప్రాధాన్యత ఇచ్చే కంగనా రనౌత్ ఈ వేడుక కోసం తెల్లటి హ్యాండ్లూమ్ శారీని (చేనేత చీర) ధరించి ఎంతో హుందాగా కనిపించారు.

సినిమా నుంచి రాజకీయం దాకా..

కాగా మార్చి 23, 1986న హిమాచల్ ప్రదేశ్‌లో జన్మించిన కంగనా రనౌత్ రెండు దశాబ్దాల పాటు హిందీ చిత్రసీమలో హీరోయిన్‌గా తనదైన ముద్ర వేశారు. పలు జాతీయ అవార్డులను అందుకున్న కంగనా రనౌత్ 2024 ఎన్నికల్లో మండి నుంచి ఎంపీగా గెలుపొంది రాజకీయాల్లోకి ప్రవేశించారు.

ఇందిరా గాంధీ పాత్రలో

కంగనా స్వీయ దర్శకత్వంలో ఇందిరా గాంధీ పాత్రలో నటించిన 'ఎమర్జెన్సీ' (2023) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా, ఆమె నటనకు మాత్రం మంచి గుర్తింపు లభించింది.

తదుపరి ప్రాజెక్ట్: భారత్ భాగ్య విధాత

ప్రస్తుతం కంగనా రనౌత్ తన తదుపరి చిత్రం 'భారత్ భాగ్య విధాత' (Bharat Bhhagya Viddhaata) షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. మనోజ్ తపాడియా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం 26/11 ముంబై ఉగ్రదాడుల నేపథ్యంలో సాగుతుంది.

ఇందులో కామా అండ్ అల్బ్‌లెస్ హాస్పిటల్ స్టాఫ్ చూపిన ధైర్యసాహసాలను వెండితెరపై ఆవిష్కరించనున్నారు. ఈ సినిమాలో కంగనా ఒక నర్సు పాత్రలో కనిపించనున్నారు. 2026లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More