Your Fault London on Prime: ఆక్స్‌ఫర్డ్ బ్యాక్‌డ్రాప్‌లో హాట్ రొమాంటిక్ డ్రామా.. ఇవాళ డైరెక్ట్ ఓటీటీలోకి బోల్డ్ మూవీ
Your Fault London on Prime: అమెజాన్ ప్రైమ్ వీడియోలో గ్లోబల్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసిన రొమాంటిక్ ఫ్రాంచైజ్ 'మై ఫాల్ట్: లండన్' సీక్వెల్ వచ్చేసింది. ‘యువర్ ఫాల్ట్: లండన్’ మూవీ ఇవాళ డైరెక్ట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఫిల్మ్ లోని మలుపులేంటో చూద్దాం.
Your Fault London on Prime: డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో బోల్డ్ రొమాంటిక్ డ్రామాలు, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్లకు ఎప్పుడూ క్రేజీ ఆడియన్స్ బేస్ ఉంటుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ విభాగంలో గ్లోబల్ వ్యూవర్స్‌ను టార్గెట్ చేస్తూ సరికొత్త ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెడుతోంది. గతంలో భారీ వ్యూవర్‌షిప్ సాధించిన 'మై ఫాల్ట్: లండన్' చిత్రానికి సీక్వెల్‌గా 'యువర్ ఫాల్ట్: లండన్' ఓటీటీలోకి వచ్చేసింది.

యువర్ ఫాల్ట్ లండన్ ఓటీటీ
ఓటీటీలోకి మరో హాట్ అండ్ బోల్డ్ ఫిల్మ్ వచ్చేసింది. ‘యువర్ ఫాల్ట్ లండన్’ ఈ రోజు (జూన్ 17) నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ అయింది.
మరింత బోల్డ్ గా
చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఈ లండన్ ఫ్రాంచైజీకి మూలం స్పానిష్‌లో సూపర్ హిట్ అయిన మెర్సిడెస్ రాన్ నవల ఆధారంగా వచ్చిన 'కుల్పా మియా' సినిమా. స్పానిష్ వెర్షన్ ఓటీటీలో క్రియేట్ చేసిన హల్‌చల్ చూసి, ప్రైమ్ వీడియో దీనిని లండన్ బ్యాక్‌డ్రాప్‌లోకి అడాప్ట్ చేసి 'మై ఫాల్ట్: లండన్'గా రీమేక్ చేసింది. ఇప్పుడు రాబోతున్న సీక్వెల్ కూడా అదే ఇంటెన్సిటీతో, మరింత బోల్డ్‌గా ఉందని ట్రేడ్ వర్గాల సమాచారం.
ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ ప్రేమకథ
మై ఫాల్ట్ లండన్ మొదటి భాగంలో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ప్రధాన పాత్రలు నోవా, నిక్ ల జీవితాలు ఈ సీక్వెల్‌లో సరికొత్త మలుపులు తిరగనున్నాయి. హీరోయిన్ నోవా ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో తన కొత్త కాలేజీ లైఫ్ ప్రారంభిస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో హీరో నిక్ తన కుటుంబ వ్యాపార బాధ్యతలను స్వీకరిస్తాడు.
రిలేషన్‌షిప్ ట్విస్ట్
రోజురోజుకూ పెరుగుతున్న నిక్ బిజినెస్ ఒత్తిళ్లు, మరోవైపు నోవా కాలేజీ లైఫ్ వల్ల వీరిద్దరి మధ్య దూరం పెరుగుతుంది. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ కారణంగా వీరి మధ్య అసూయ, అపార్థాలు చోటుచేసుకుంటాయి.
కొత్త పాత్రల ఎంట్రీ
అప్పటికే ఎన్నో ఇబ్బందులతో సాగుతున్న వీరి క్లిష్టమైన రిలేషన్‌షిప్‌ను కొత్త పరిచయాలు మరింత ప్రమాదంలోకి నెట్టేస్తాయి. ఈ కథలోకి మైఖేల్, సోఫియా అనే ఇద్దరు కొత్త వ్యక్తులు ప్రవేశిస్తారు. వీరి ఎంట్రీతో నోవా, నిక్ ల ప్రేమకథ మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది.
గ్లామర్, ఎమోషన్, లవ్, జెలసీ వంటి ఎలిమెంట్స్‌తో కూడిన ఈ సీక్వెల్ ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియన్స్‌కు కూడా అందుబాటులో ఉంది.
పర్ఫెక్ట్ వాచ్
సాధారణ యూత్ డ్రామాల్లో చూపే రొటీన్ లవ్ స్టోరీలా కాకుండా, ఇందులో ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ కల్చర్, లండన్ హై-సొసైటీ బిజినెస్ పాలిటిక్స్, యంగ్ కపుల్స్ మధ్య వచ్చే ఈగో క్లాషెస్‌ను చాలా రా అండ్ ఎమోషనల్‌గా ప్రెజెంట్ చేశారు. ‘ఆఫ్టర్’ సిరీస్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సీక్వెల్ పర్ఫెక్ట్ వాచ్ అవుతుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


