This Week OTT: ఈ వారం ఓటీటీ రచ్చ.. సేవ్ ది టైగర్స్ 3లో ఇంద్రలోకం ట్విస్ట్.. యోగి బాబు బావి మిస్టరీ.. దృశ్యం 3 సస్పెన్స్
This Week OTT: జూన్ 15 నుంచి జూన్ 21 వరకు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్ వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో క్రేజీ సినిమాలు, సిరీస్ లు రాబోతున్నాయి. ఇందులో సేవ్ ది టైగర్స్ 3 నుంచి దృశ్యం 3 వరకు ఉన్నాయి. ఓ లుక్కేయండి.
This Week OTT: ఈ వారం ఓటీటీలో రచ్చ మరో లెవల్ లో ఉండబోతుంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, లయన్స్‌గేట్ ప్లే వంటి ప్లాట్‌ఫామ్‌లలో క్రేజీ సినిమాలు, సిరీస్‌లు డిజిటల్ స్క్రీన్‌లపైకి వస్తున్నాయి. ఇందులో మోస్ట్ అవేటెడ్ 'సేవ్ ది టైగర్స్ 3' తో పాటు హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్ క్రైమ్ థ్రిల్లర్స్ ఉన్నాయి.

సేవ్ ది టైగర్స్ సీజన్ 3 (జూన్ 19 – జియోహాట్‌స్టార్)
తెలుగు ఓటీటీ స్పేస్‌లో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచిన 'సేవ్ ది టైగర్స్' ఇప్పుడు సీజన్ 3 తో వస్తోంది. గంట రవి (ప్రియదర్శి), రాహుల్ (అభినవ్ గోమఠం), విక్రమ్ (కృష్ణ చైతన్య) ఈసారి మరింత రచ్చ చేయబోతున్నారు.
అసలు ట్విస్ట్ ఇదే
ఈ సారి సేవ్ ది టైగర్స్ కథలోకి ఇంద్రదేవుడు ఎంట్రీ ఇచ్చి ఒక దైవిక సామాజిక ప్రయోగం చేస్తాడు. హీరోలు కోరుకున్న పారలల్ వరల్డ్స్ లోకి పంపడంతో రవి ఎమ్మెల్యేగా, రాహుల్ సక్సెస్‌ఫుల్ రైటర్‌గా, విక్రమ్ సీఈఓగా మారతారు. కోరుకున్న లైఫ్ వచ్చాక ఈ భర్తలు ఎలాంటి తిప్పలు పడ్డారనేది ఈ సారి మెయిన్ ఫన్ ఎలిమెంట్.
కెనతా కాణోమ్ (జూన్ 16 – జియోహాట్‌స్టార్)
దివంగత తమిళ దర్శకుడు సురేష్ సంగయ్య తెరకెక్కించిన చివరి చిత్రమిది. కరవుతో అల్లాడే కరియాపట్నం అనే గ్రామంలో ప్రభుత్వ భూమిలో ఒక పురాతన బావి కనిపిస్తుంది. తీరా నీటి సమస్య తీరింది అనుకునేలోపే ఆ బావి అకస్మాత్తుగా మాయమవుతుంది.
ఎందుకు చూడాలి?
యోగి బాబు లీడ్ రోల్ లో నటించిన ఈ పొలిటికల్ సెటైర్ కేవలం కామెడీ మాత్రమే కాదు, నీటి కొరత వెనుక ఉన్న పెద్ద కుట్రను డీకోడ్ చేస్తుంది. రా డ్రామాలు ఇష్టపడే వారికి బెస్ట్ ఛాయిస్.
దృశ్యం 3 (జూన్ 18- ప్రైమ్ వీడియో)
సక్సెస్ ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రాంఛైజీలో వచ్చిన మూడో మూవీ దృశ్యం 3. మోహన్ లాల్ మరోసారి జార్జ్ కుట్టీగా మైండ్ గేమ్ తో అదరగొట్టారు. మర్చిపోయారనుకున్న పోలీస్ కేసు మరోసారి తన కుటుంబం మెడకు చుట్టుకునే పరిస్థితి వస్తే.. జార్జ్ కుట్టీ ఏం చేశాడన్నదే దృశ్యం 3 స్టోరీ.
మోటివ్ ఫర్ మర్డర్ (జూన్ 19 – లయన్స్‌గేట్ ప్లే)
హైదరాబాద్ నేపథ్యంలో సాగే సస్పెన్స్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఇది. నగరంలో వరుస హత్యలు చేస్తూ, ప్రతి క్రైమ్ సీన్‌ను ఒక ప్రసిద్ధ పెయింటింగ్ లాగా మార్చడం ఈ సైకో కిల్లర్ శైలి. ఏసీపీ కృష్ణ (సంబీత్ ఆచార్య), జర్నలిస్ట్ రాధ (జో శర్మ) ఈ మిస్టరీని ఎలా ఛేదించారనేది కథ. సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఇంటర్నేషనల్ & డబ్బింగ్ కంటెంట్
గ్లోబల్ కంటెంట్ ఇష్టపడే వారి కోసం నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలలో ఈ వారం క్రేజీ అప్‌డేట్స్ ఉన్నాయి. వాటి పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
ఆండ్రూ ఈజ్ యాన్ ఇడియట్- నెట్‌ఫ్లిక్స్ (జూన్ 17)- ఎమోషనల్ డాక్యుమెంటరీ
యువర్ ఫాల్ట్- ప్రైమ్ వీడియో (జూన్ 17)- రొమాంటిక్ డ్రామా
ఐ విల్ ఫైండ్ యూ- నెట్‌ఫ్లిక్స్ (జూన్ 18)- సస్పెన్స్ థ్రిల్లర్
హస్బెండ్స్ ఇన్ యాక్షన్- నెట్‌ఫ్లిక్స్ (జూన్ 19)- కొరియన్ యాక్షన్ డ్రామాతుడే.
షుగర్ సీజన్ 2- యాపిల్ టీవీ+ (జూన్ 19)- ప్రైవేట్ డిటెక్టివ్ సిరీస్
తుక్రా కే మేరా ప్యార్ 2- జియోహాట్‌స్టార్ (జూన్ 19)- పొలిటికల్ రివెంజ్ డ్రామా
People Also Ask (FAQ)
Q1. 'సేవ్ ది టైగర్స్ సీజన్ 3' ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా?
జవాబు: అవును, 'సేవ్ ది టైగర్స్ సీజన్ 3' కంప్లీట్ క్లీన్ కామెడీ ఎంటర్‌టైనర్. ఎలాంటి వల్గారిటీ లేకుండా భార్యాభర్తల మధ్య జరిగే ఫన్ డ్రామా కాబట్టి కుటుంబ సభ్యులందరితో కలిసి హ్యాపీగా చూడొచ్చు.
Q2. ఈ వారం తెలుగులో వస్తున్న బెస్ట్ ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్ ఏది?
జవాబు: హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో సైకో కిల్లర్ ఇన్వెస్టిగేషన్ థీమ్‌తో వస్తున్న 'M4M - మోటివ్ ఫర్ మర్డర్' ఈ వారం బెస్ట్ ఆప్షన్. ఇది జూన్ 19 నుండి లయన్స్‌గేట్ ప్లేలో అందుబాటులోకి వస్తుంది.
Q3. యోగి బాబు 'కెనతా కాణోమ్' తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఎందులో వస్తోంది?
జవాబు: పురాతన బావి అదృశ్యం చుట్టూ సాగే ఈ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ శాటైర్ జూన్ 16 నుండి జియోహాట్‌స్టార్ లో తెలుగు ఆడియోతో సహా స్ట్రీమింగ్ కానుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


