Cocktail 2 Movie Review: కాక్‌టెయిల్ 2 రివ్యూ.. రష్మిక మందన్న బాలీవుడ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలా ఉందంటే?
Cocktail 2 Movie Review: రష్మిక మందన్న మరో బాలీవుడ్ మూవీ కాక్‌టెయిల్ 2 రిలీజైంది. సైఫ్ అలీ ఖాన్, దీపికా కాక్‌టెయిల్ కు సీక్వెల్ గా భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా.. ఆ స్థాయిని మాత్రం అందుకోలేకపోయింది.
Cocktail 2 Movie Review: బాలీవుడ్‌లో గతంలో సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకోన్, డయానా పెంటి కాంబినేషన్‌లో వచ్చిన 'కాక్‌టెయిల్' ఎంతటి సెన్సేషనల్ హిట్ సాధించిందో మనకు తెలుసు. ఇంతియాజ్ అలీ రాసిన ఆ బ్రీజీ లవ్ స్టోరీకి ఇప్పుడు ఒక స్పిరిచువల్ సీక్వెల్‌గా 'కాక్‌టెయిల్ 2' (Cocktail 2) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

షాహిద్ కపూర్, కృతి సనన్, మన టాలీవుడ్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్స్ పోషించిన ఈ మోడరన్ రిలేషన్‌షిప్ డ్రామాను ఒరిజినల్ డైరెక్టర్ హోమి అదజానియానే తెరకెక్కించారు. అయితే ఈ మూవీ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.
కాక్‌టెయిల్ 2 కథేంటంటే?
కాక్‌టెయిల్ 2 మూవీ స్టోరీ విషయానికి వస్తే.. కునాల్ (షాహిద్ కపూర్), దియా (రష్మిక మందన్న) ఇద్దరూ కాలేజీ రోజుల నుంచే పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుంటారు. ఒకరినొకరు ఎంతగానో ఇష్టపడినా, పెళ్లి అనే వ్యవస్థపై మాత్రం వీరికి పెద్దగా నమ్మకం ఉండదు. ఈ క్రమంలోనే ఈ జంట ఇటలీలోని అందమైన సిసిలీ దీవులకు వెకేషన్ ప్లాన్ చేసుకుంటుంది.
అక్కడ వారికి అనుకోకుండా దియా క్లోజ్ ఫ్రెండ్ అయిన అల్లీ (కృతి సనన్) పరిచయం అవుతుంది. అల్లీ బలవంతం చేయడంతో కునాల్, దియా తమ పాత ప్లాన్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకుని ఆమెతో కలిసి ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు.
అయితే పైకి అంతా హ్యాపీగా కనిపిస్తున్నా దియా మనసులో ఒక తెలియని అభద్రతాభావం మొదలవుతుంది. కునాల్ తనను నిజాయితీగా ప్రేమిస్తున్నాడా లేక ఏదో బాధ్యతగా పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడా అనే అనుమానం ఆమెను వేధిస్తుంది. తన ప్రియుడి లాయల్టీని టెస్ట్ చేయడం కోసం కునాల్‌తో క్లోజ్‌గా ఉంటూ ఫ్లర్ట్ చేయమని తన ఫ్రెండ్ అల్లీని కోరుతుంది దియా. ఈ చిన్న టెస్ట్ కాస్తా వాళ్ల ముగ్గురి జీవితాలను ఎలాంటి మలుపు తిప్పింది? ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ చివరకు ఏ తీరానికి చేరింది? అనేదే మిగతా సినిమా కథ.
కాక్‌టెయిల్ 2 ప్లస్ పాయింట్స్
ఈ సినిమాకు బిగ్గెస్ట్ అసెట్ ఎవరైనా ఉన్నారంటే అది కచ్చితంగా సినిమాటోగ్రాఫర్ సంతాన కృష్ణన్ రవిచంద్రన్ అని చెప్పాలి. సిసిలీ అందాలను ఆయన కెమెరాలో బంధించిన తీరు అద్భుతం. కథ కొంచెం వీక్ అయినా కూడా విజువల్స్ మిమ్మల్ని స్క్రీన్‌కు కట్టిపడేస్తాయి.
సినిమా ఫస్టాఫ్ చాలా బ్రీజీగా, లవ్ రంజన్, తరుణ్ జైన్ మార్క్ మోడరన్ రిలేషన్‌షిప్ కామెడీతో సరదాగా సాగిపోతుంది. ముగ్గురు ప్రధాన నటుల మధ్య కెమిస్ట్రీ కూడా ఫస్టాఫ్‌లో చాలా బాగా వర్కవుట్ అయింది. ప్రీతమ్ అందించిన మ్యూజిక్, సాంగ్స్ సినిమా ఎనర్జీని బాగా మెయింటైన్ చేశాయి.
కాక్‌టెయిల్ 2 మైనస్ పాయింట్స్
సినిమా ఫస్టాఫ్ అంతా బాగుంది అనుకునే సమయానికి ఇంటర్వెల్ తర్వాత కథ పూర్తిగా ట్రాక్ తప్పుతుంది. విజువల్స్ ఎంత బాగున్నా కూడా గాడి తప్పిన స్క్రీన్‌ప్లేను అవి కాపాడలేకపోయాయి. అల్లీ క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత కథలో ఇంటెన్స్ ఎమోషన్స్ రావాల్సింది పోయి, ఇదొక మెలోడ్రామాలా మారిపోతుంది.
నేటితరం ప్రేమలోని కన్ఫ్యూజన్‌ను చూపించాలనుకున్న దర్శకుడు.. సీన్లను చాలా సాగదీసి బోర్ కొట్టించాడు. లోతైన క్యారెక్టరైజేషన్ లేకపోవడం, కేవలం అరవడాలు, విపరీతమైన ఏడుపులతో కూడిన సీన్లు పెట్టడంతో సహజత్వం లోపించింది.
నటీనటులు ఎవరెలా చేశారంటే?
షాహిద్ కపూర్ ఇలాంటి లవర్ బాయ్ క్యారెక్టర్లలో చాలా ఈజీగా సెట్ అయిపోతాడు, ఈ సినిమాలో కూడా తను చాలా కంఫర్టబుల్‌గా నటించాడు. ఇక రష్మిక మందన్న విషయానికి వస్తే దియా పాత్రలో ఓకే అనిపించినా, కొన్ని ఎమోషనల్ సీన్లలో ఆమె నటన అంతగా పండలేదు.
కృతి సనన్ స్క్రీన్ ప్రెజెన్స్ అల్ట్రా మోడరన్ లుక్ లో చాలా స్టన్నింగ్‌గా ఉంది. కానీ ఈ ముగ్గురి నటన కూడా బలహీనమైన కథను నిలబెట్టలేకపోయింది. సపోర్టింగ్ కాస్ట్‌కు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో వాళ్లు పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు.
2012లో వచ్చిన ఒరిజినల్ ‘కాక్‌టెయిల్’లో ఒక సోల్ ఉంటుంది, ప్రేక్షకులు వాటితో కనెక్ట్ అవుతారు. కానీ ఈ సరికొత్త ‘కాక్‌టెయిల్ 2’లో గ్లామర్, విజువల్స్, లగ్జరీ లొకేషన్స్ ఉన్నాయి తప్ప హృదయాన్ని హత్తుకునే ఎమోషనల్ పంచ్ లేదు. కేవలం టైమ్ పాస్ కోసం, విజువల్స్ కోసం థియేటర్లలో ఒకసారి ట్రై చేయవచ్చు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


