OTT Crime: ఇవాళ 2 ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్- 9.1 రేటింగ్- చంపేసి ఆ డెడ్ బాడీలను పెయింట్‌లా వేసే సైకో!

M4M OTT Streaming Today On 2 Platforms: ఇవాళ రెండు ఓటీటీల్లో తెలుగు క్రైమ్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా ఎమ్4ఎమ్ (మోటివ్ ఫర్ మర్డర్) స్ట్రీమింగ్‌కు వచ్చింది. పదికి ఏకంగా 9.1 ఐఎమ్‌డీబీ రేటింగ్ సాధించిన ఎమ్4ఎమ్ ఓటీటీ రిలీజ్ ఏ ప్లాట్‌ఫామ్స్‌లలో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jun 19, 2026, 12:57:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

M4M OTT Release Today On 2 Platforms: ప్రస్తుతం ఓటీటీ వేదికలపై సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజ్ ఎప్పుడూ ప్రత్యేకమే. క్లైమాక్స్ వరకు ఊపిరి బిగబట్టే ఉత్కంఠతో సాగే సరికొత్త కథాంశంతో రూపొందే సినిమాలను బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఓటీటీ లవర్స్.

ఇవాళ 2 ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్- 9.1 రేటింగ్- చంపేసి ఆ డెడ్ బాడీలను పెయింట్‌లా వేసే సైకో!
ఇవాళ 2 ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్- 9.1 రేటింగ్- చంపేసి ఆ డెడ్ బాడీలను పెయింట్‌లా వేసే సైకో!

మంచి రివ్యూలు

అలా ఇటీవల థియేటర్లలో విడుదలైన తెలుగు మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమానే ఎమ్4ఎమ్ మోటివ్ ఫర్ మర్డర్ (‘M4M’ Motive For Murder). ఈ సినిమా మే 8న థియేటర్లలో విడుదలై మంచి రివ్యూలు అందుకుంది.

9.1 ఐఎమ్‌డీబీ రేటింగ్

అయితే, ప్రమోషన్స్ పెద్దగా లేకపోవడం వల్ల ఈ సినిమా అంటూ ఒకటి థియేటర్లలోకి వచ్చిందన్న విషయం చాలా వరకు ఆడియెన్స్‌కు తెలియకపోయింది. అందుకే బాక్సాఫీస్ వద్ద కమర్షియల్‌గా పెద్దగా హిట్ సాధించలకేపోయింది. కానీ, ఐఎమ్‌డీబీలో 9.1/10, బుక్‌మైషోలో 9.6/10 లాంటి అసాధారణ రేటింగ్‌లను సొంతం చేసుకుంది ఎమ్4ఎమ్ సినిమా.

ఆకట్టుకునే కథ.. ఉత్కంఠ రేపే స్క్రీన్‌ప్లే

ప్రముఖ దర్శకుడు, నిర్మాత మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన ఈ చిత్రం సస్పెన్స్, మిస్టరీ, డ్రామా, క్రైమ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులకు మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుందని సమాచారం. ఒక పక్కా ప్లాన్‌తో వరుసగా జరుగుతున్న హత్యల వెనుక ఉన్న అసలు కారణం (Motive) ఏంటి? అసలు హంతకుడు ఎవరు? అనే కోణంలో కథ నడుస్తుంది.

డెడ్ బాడీలతో పెయింటింగ్ వేయడం

ప్రతి సీన్ లోనూ ఊహించని ట్విస్టులు ఇస్తూ, చివరి నిమిషం వరకు కిల్లర్ ఎవరనే సస్పెన్స్‌ను దర్శకుడు స్క్రీన్‌పై చూపించిన తీరు బాగుంటుందని టాక్. చంపేసి వారి డెడ్ బాడీలతోనే సైకో పెయింటింగ్ వేయడం కథ కొత్తగా, ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే ఓటీటీ ప్రియులకు ఈ స్క్రీన్‌ప్లే నచ్చేలా ఉంటుందని చెప్పుకోవచ్చు.

ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా జో శర్మ నటన హైలైట్!

ఈ సినిమాకు ప్రధాన బలం హీరోయిన్ జో శర్మ నటన అని రివ్యూలో చెప్పారు. అమెరికన్ నటి అయిన జో శర్మ.. ఇందులో రాధ అనే పవర్‌ఫుల్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్రలో నటించారు. హీరో సంబీత్ ఆచార్య కూడా తన పరిణతి చెందిన నటనతో మెప్పించారని టాక్ వచ్చింది.

రెంటల్ విధానంలో

ఇలాంటి రివ్యూలతో వచ్చిన ఎమ్4ఎమ్ ఇవాళ (జూన్ 19) 2 ఓటీటీల్లోకి వచ్చేసింది. అంటే, థియేటర్లలో విడుదలైన 40 రోజులకు ఓటీటీలోకి వచ్చేసింది ఎమ్4ఎమ్ మోటివ్ ఫర్ మర్డర్ సినిమా. అమెజాన్ ప్రైమ్‌తోపాటు లయన్స్ గేట్ ప్లేలో నేటి నుంచి ఎమ్4ఎమ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

అమెజాన్ ప్రైమ్, లయన్స్ గేట్ ప్లే ఓటీటీల్లో

అయితే, అమెజాన్ ప్రైమ్‌లో మాత్రం రెంటల్ విధానంలో ఎమ్4ఎమ్ ఓటీటీ రిలీజ్ అయింది. సబ్‌స్క్రిప్షన్ ఉన్నవాళ్లు మాత్రం లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో ఎమ్4ఎమ్ సినిమాను తెలుగులో ఫ్రీగా చూసేయొచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More