OTT: 2 ఓటీటీల్లోకి ఇవాళ వచ్చిన హారర్ థ్రిల్లర్- 92 శాతం ఫ్రెష్ కంటెంట్- రెండింట్లో తెలుగులోనే! వికృత జలకన్య ఇంట్లో ఉంటే?
Mermaid OTT Streaming Today On 2 Platforms: తీరానికి కొట్టుకొచ్చిన ఒక వికృత జలకన్యను కాపాడేందుకు ఒక డ్రగ్ అడిక్ట్ చేసిన పోరాటంగా వచ్చిన సరికొత్త హారర్ థ్రిల్లర్ మెర్మెయిడ్. ఇవాళ ఏకంగా 2 ఓటీటీల్లోకి మెర్మెయిడ్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు తెలుగులో వచ్చింది. మరి మెర్మెయిడ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో చూద్దాం.
Mermaid OTT Release Today On 2 Platforms: హాలీవుడ్ చిత్రాలలో జలకన్యల (Mermaids) చుట్టూ అల్లిన కథలు అనగానే మనకు ఒక అందమైన ఫాంటసీ ప్రపంచం గుర్తొస్తుంది. అయితే దానికి పూర్తి భిన్నంగా, ఒక క్రేజీ డార్క్ కామెడీ, హారర్, సస్పెన్స్, థ్రిల్లర్, ఎమోషనల్ యాస్పెక్ట్‌తో సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది 'మెర్మెయిడ్' (2026) చిత్రం.

92 శాతం ఫ్రెష్ కంటెంట్
అమెరికాలోని ఫ్లోరిడా తీర ప్రాంత నేపథ్యంలో సాగే ఈ విభిన్న చిత్రం మే 8, 2026న థియేటర్లలో విడుదలైంది. థియేటటర్లలో డిఫరెంట్ కాన్సెప్ట్ కారణంగా రొట్టెన్ టోమాటోస్ సంస్థ నుంచి 100కి 92 శాతం ఫ్రెష్ కంటెంట్‌గా సర్టిఫికేట్ అందుకుంది మెర్మెయిడ్ సినిమా.
నెల దాటిన తర్వాత
ఒక సినిమా ఎంత క్రియేటివిటీతో ఫ్రెష్‌గా ఉంటుందో చెప్పే వెబ్‌సైటే రొట్టెన్ టోమాటోస్. దాని నుంచి 92 శాతం ఫ్రెష్ కంటెంట్ వచ్చిందంటే కచ్చితంగా చూడాల్సిన సినిమా అనుకోవచ్చు. అలాంటి మెర్మెయిడ్ నెల దాటిన తర్వాత ఏకంగా రెండు ఓటీటీల్లోకి ఇవాళ (జూన్ 16) స్ట్రీమింగ్‌కు రావడం హారర్, థ్రిల్లర్ ప్రియులకు పండగ అని చెప్పుకోవచ్చు.
జలకన్య ప్రాణం కాపాడిన డ్రగ్ అడిక్ట్
ఈ సినిమా కథ అంతా ఫ్లోరిడాలో నివసించే ఒక యువకుడి చుట్టూ తిరుగుతుంది. అతను 'పెర్కోసెట్' (Percocet) అనే డ్రగ్స్‌కు బానిసై, జీవితంలో తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉంటాడు. ఒకరోజు డ్రగ్స్ మత్తులో ఉన్న సమయంలో అతనికి సముద్ర తీరంలో ఒక వింత జీవి కనిపిస్తుంది. నిశితంగా గమనిస్తే అది తీవ్రమైన గాయాలతో ఉన్న ఒక జలకన్య (మెర్మెయిడ్) అని గ్రహిస్తాడు.
ఇంట్లోకి వికృత జలకన్య
కాకపోతే అది చాలా వికృతంగా ఉంటుంది. మొదట తన కళ్లను తనే నమ్మలేకపోయినా, ఆ తర్వాత కోలుకుని ఆ వికృత జలకన్య కూడా తనలాగే బాధను అనుభవించే ఒక ప్రాణి అని గుర్తిస్తాడు. ఎవరికీ తెలియకుండా వికృత జలకన్యను తన ఇంటికి తెచ్చి రహస్యంగా చికిత్స అందిస్తాడు.
ఊరు ఊరంతా ఆమె వెనుకే..
గాయపడిన జలకన్యకు ఆశ్రయం ఇచ్చి ప్రాణాలు కాపాడిన ఆ యువకుడికి అసలు కష్టాలు ఆ తర్వాతే మొదలవుతాయి. నగరంలో ఒక జలకన్య ఉందనే విషయం మెల్లిగా చుట్టుపక్కల వారికి, ఊరి జనాలకు తెలిసిపోతుంది. దాంతో ఆ అరుదైన జీవిని చూసి ఆనందించడం పక్కన పెట్టి, స్వార్థం కోసం ఆమెను వాడుకోవాలని, వేధించాలని కొందరు దుర్మార్గులు ప్రయత్నిస్తారు.
ఎలాగైనా కాపాడాలని
డ్రగ్స్ అలవాటు ఉన్నప్పటికీ, ఆ జలకన్యను ఎలాగైనా కాపాడాలని ఆ యువకుడు నిర్ణయించుకుంటాడు. సమాజం నుంచి, క్రూరమైన మనుషుల నుంచి ఆమెను రక్షించడానికి అతను ఎంత దూరం వెళ్లాడు, ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అనేదే హారర్ సస్పెన్స్ డార్క్ కామెడీ థ్రిల్లర్ సినిమా మెర్మెయిడ్.
అమెజాన్ ప్రైమ్ అండ్ జియో హాట్‌స్టార్
అలాంటి మెర్మెయిడ్ ఓటీటీల్లోకి ఇవాళ వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్‌లలో మెర్మెయిడ్ ఓటీటీ రిలీజ్ అయింది. రెండు ఓటీటీల్లోనూ తెలుగు భాషలో జూన్ 16 నుంచి మెర్మెయిడ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా ఎలాంటి రెంటల్ విధానం లేకుండా సబ్‌స్క్రైబర్స్ ఫ్రీగా చూసేలా అందుబాటులోకి ఈ సినిమాను తీసుకొచ్చారు.
4 భాషల్లో స్ట్రీమింగ్
అటు అమెజాన్ ప్రైమ్‌లో ఇటు జియో హాట్‌స్టార్ ఓటీటీలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు వంటి నాలుగు భాషల్లో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో మెర్మెయిడ్ స్ట్రీమింగ్ అవుతోంది.
టైలర్ కాన్‌రాక్ దర్శకత్వం
మెర్మెయిడ్ సినిమాకు టైలర్ కాన్‌రాక్ దర్శకత్వం వహించడంతో పాటు కథను కూడా ఆయనే అందించారు. జోయెల్ లావోల్డ్ ఈ సినిమాకు అద్భుతమైన సినిమాటోగ్రఫీని అందించగా, 'బ్యాడ్ గ్రే' సంస్థ నిర్మించింది. ఉటోపియా దీనికి డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించింది.
2 ఓటీటీల్లో తెలుగులో
జానీ పెంబర్టన్, అవేరి పొటెమ్రి ప్రధాన పాత్రలు పోషించగా.. డేనియల్ బ్రాండ్, డాన్ ఎకెర్లే, కోల్ ఎకెర్లే నిర్మాతలుగా వ్యవహరించారు. భిన్నమైన కథాంశంతో సాగే చిత్రాలను ఇష్టపడే వారు ఈ వీకెండ్‌లో అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్ వంటి 2 ఓటీటీల్లో తెలుగులో ఎంచక్కా చూసేయొచ్చు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


