OTT: ఈ వారం ఓటీటీలోని తెలుగు సినిమాలు- హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ల నుంచి బోల్డ్ మూవీ వరకు- ఓ లుక్కేయండి

OTT: ఈ వారం ఓటీటీలో సినిమాలు సందడి చేస్తున్నాయి. ఇందులో తెలుగులోనూ స్పెషల్ మూవీస్ రిలీజ్ అయ్యాయి. రెండు తెలుగు సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేశాయి. మరి ఈ వారం డిజిటల్ స్ట్రీమింగ్ లో అలరిస్తున్న తెలుగు సినిమాలేవో చూసేయండ

Published on: Jan 24, 2026 9:51 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భయపెట్టే హారర్ థ్రిల్లర్ ఓ వైపు.. సీరియల్ కిల్లర్ స్టోరీతో సస్పెన్స్ రేపే క్రైమ్ థ్రిల్లర్ మరోవైపు.. బోల్డ్ సీన్లతో సాగే హాట్ మూవీ ఇంకోవైపు.. ఇలా ఈ వారం ఓటీటీలోకి డిఫరెంట్ జోనర్లలో వేర్వేరు తెలుగు సినిమాలు వచ్చేశాయి. డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇందులో ఆది శంబాల నుంచి శోభితా ధూళిపాళ చీకటిలో వరకు ఉన్నాయి.

ఈ వారం ఓటీటీలోని తెలుగు సినిమాలు
ఈ వారం ఓటీటీలోని తెలుగు సినిమాలు

శంబాల ఓటీటీ

ఈ వారం తెలుగు ఆడియన్స్ అత్యంత ఆత్రుతగా ఎదురు చూసిన ఓటీటీ రిలీజ్ మూవీ ‘శంబాల’. ఆది సాయి కుమార్ హీరోగా నటించిన ఈ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ రిజల్ట్ సాధించింది. ఆదికి చాలా కాలం తర్వాత హిట్ అందించింది.

ఆకాశంలో నుంచి ఓ ఉల్క శంబాల అనే గ్రామంలో పడుతుంది. ఆ తర్వాత అక్కడ వింత సంఘటనలు, హత్యలు జరుగుతాయి. దెయ్యం అని జనాలు భయపడతారు. మరి అప్పుడు జియాలజిస్ట్ అయిన హీరో ఏం చేశాడు? అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఈ సినిమా ఆహా వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

చీకటిలో

ఓటీటీ ఆడియన్స్ ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేసిన మరో సినిమా ‘చీకటిలో’. శోభితా ధూళిపాళ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఇందులో హీరోయిన్ ఓ పాడ్ కాస్ట్ నిర్వహిస్తుంది. చీకటిలో వచ్చి అమ్మాయిలను చంపే సీరియల్ కిల్లర్ గురించి చెప్తుంటుంది. మరి ఆ కిల్లర్ ఎవరు? ఎందుకు అమ్మాయిలను చంపుతున్నాడు? అన్నది చీకటిలో సినిమాలో చూడాల్సిందే.

మారియో

ఈ వారం ఓటీటీలోకి వచ్చిన మరో తెలుగు మూవీ ‘మారియో’. ఈ సినిమాలో హెబ్బా పటేల్ కీలక పాత్ర పోషించింది. రొమాంటిక్ సీన్లతో ఈ మారియో మూవీ బోల్డ్ గా ఉంది. ఈ మారియో సినిమాలో ఒక డ్రగ్ ఉంటుంది. దాన్ని తీసుకున్న వాళ్లకు గ్యాబ్లింగ్, డ్రింకింగ్, సెక్స్ వంటి మూడు కోరికలు కలుగుతాయి. సినిమాలో హీరోయిన్ హెబ్బా పటేల్ ఈ డ్రగ్ తీసుకుంటుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో మారియో మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమా ఆహా, ప్రైమ్ వీడియో ఓటీటీల్లో ఉంది.

సంధ్యానామ ఉపాసతే

ఓటీటీలోకి ఈ వారం డైరెక్ట్ గా వచ్చిన మరో తెలుగు సినిమా ‘సంధ్యానామ ఉపాసతే’. 2022లోనే షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ మూవీ వివిధ కారణాల వల్ల లేట్ అవుతూ వచ్చింది. ఇన్నేళ్లకు ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీలో నేరుగా రిలీజైంది. కరోనా టైమ్ లో క్వారంటైన్, లాక్ డౌన్ తదితర పరిస్థితుల్లో జరిగే కథతో తెరకెక్కిన మూవీ సంధ్యానామ ఉపాసతే. క్వారంటైన్ లో పరిచయమైన హీరో, హీరోయిన్ లవ్ చేసుకుంటారు. లాక్ డౌన్ లో చక్కర్లు కొడతారు. మరి చివరకు వీళ్ల ప్రేమ కథ ఏమైంది? అన్నది సినిమాలో చూడాలి.