Maanvi Gagroo OTT: లక్ష రూపాయలు.. ప్లస్ కాంప్రమైజ్- కాస్టింక్ కౌచ్‌పై ఓటీటీ నటి మాన్వీ కామెంట్స్- జీఎస్టీ అనుకున్నానంటూ!

OTT Actress Maanvi Gagroo On Casting Couch: ఓటీటీ బ్యూటీ మాన్వి గాగ్రూ తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. ఒక సినిమా ఆఫర్ కోసం 'లక్ష రూపాయలు ప్లస్ కాంప్రమైజ్' అంటూ వచ్చిన మెసేజ్ చూసి తాను మొదట జీఎస్టీ అనుకున్నాననంటూ కాస్టింగ్ కౌచ్‌పై మాన్వి కామెంట్స్ చేసింది.

Published on: Jun 18, 2026, 17:46:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Actress Maanvi Gagroo On Casting Couch: గ్లామర్ ప్రపంచంలో మెరిసిపోయే నటీమణుల వెనుక ఎన్నో చీకటి కోణాలు, చేదు నిజాలు దాగుంటాయి. కాస్టింగ్ కౌచ్ (లైంగిక వేధింపులు) అనే మహమ్మారి చిత్ర పరిశ్రమను ఎంతగా పట్టిపీడిస్తోందో ఎందరో నటీమణులు ఇప్పటికే బహిరంగంగానే చెప్పారు.

లక్ష రూపాయలు.. ప్లస్ కాంప్రమైజ్- కాస్టింక్ కౌచ్‌పై ఓటీటీ నటి మాన్వీ కామెంట్స్- జీఎస్టీ అనుకున్నానంటూ!
లక్ష రూపాయలు.. ప్లస్ కాంప్రమైజ్- కాస్టింక్ కౌచ్‌పై ఓటీటీ నటి మాన్వీ కామెంట్స్- జీఎస్టీ అనుకున్నానంటూ!

భయంకరమైన అనుభవం

తాజాగా ప్రముఖ బోల్డ్ ఓటీటీ వెబ్ సిరీస్ స్టార్, నటి మాన్వి గాగ్రూ తన కెరీర్ తొలినాళ్లలో ఎదురైన ఒక భయంకరమైన అనుభవాన్ని పంచుకుని సంచలనం రేపింది. ఒక ప్రాజెక్ట్ కోసం తనను నేరుగా మెసేజ్‌లోనే ‘కాంప్రమైజ్’ (శృంగారానికి సమ్మతి) అవ్వమన్నారంటూ ఆమె షాకింగ్ విషయాలు వెల్లడించింది.

లక్ష రూపాయలు.. ప్లస్ కాంప్రమైజ్!

ఇటీవల ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాన్వి గాగ్రూ, సినిమా ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చినప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తుచేసుకుంది. ఒక రోజు ఒక వ్యక్తి నుంచి తన ఫోన్‌కు మెసేజ్ వచ్చిందని, అందులో "రూ. 1 లక్ష ప్లస్ కాంప్రమైజ్" అని రాసి ఉందని చెప్పింది. అప్పట్లో ఇండస్ట్రీకి కొత్త కావడం వల్ల ఆ పదానికి అసలు అర్థం ఏమిటో కూడా తనకు తెలియదని పేర్కొంది.

"మొదట్లో ఆ మెసేజ్ చూసి నేను అయోమయానికి గురయ్యాను. దాంతో ఎదుటి వ్యక్తికి ‘కాంప్రమైజ్ అంటే ఏంటి?’ అని రిప్లై కూడా ఇచ్చాను" అని మాన్వి వివరించింది. ఆ తర్వాత ఈ విషయాన్ని తనకు మెంటార్‌లా ఉండే ఒక కాస్టింగ్ డైరెక్టర్‌కు చూపించగా, అతను వెంటనే ఆ నంబర్‌ను బ్లాక్ చేసి, మెసేజ్ డిలీట్ చేయమని సలహా ఇచ్చాడని తెలిపింది.

జీఎస్టీ లాంటిదేమో అనుకున్నా!

సాధారణంగా ఇలాంటి విషయాల్లో ఎలాంటి ఆధారాలు దొరక్కుండా ఫోన్లలో మాట్లాడుతుంటారని, కానీ తనకు నేరుగా టెక్ట్స్ మెసేజ్ పంపడం చూసి ఆశ్చర్యపోయానని ఓటీటీ బ్యూటీ మాన్వి గాగ్రూ చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీపై ఎలాంటి అవగాహన లేకపోవడం వల్లే తాను ఆ పదాన్ని తప్పుగా అర్థం చేసుకున్నానని మాన్వి నవ్వుతూ చెప్పింది.

"కాంప్రమైజ్ అంటే బడ్జెట్‌లో ఏమైనా తగ్గించుకోవాలేమో అనుకున్నా. మనం జీఎస్టీ ప్లస్ అంటాం కదా.. అలాగే ఒక లక్ష రూపాయలు, దానికి తోడు జీఎస్టీ లాంటిది లేదా కాంప్లిమెంటరీ ఆఫర్ ఏమైనా ఇస్తున్నారేమో అని భావించా" అని మాన్వి నాటి అమాయకత్వాన్ని గుర్తుచేసుకుంది. ఆ తర్వాత కానీ ఆ మెసేజ్ వెనుక ఉన్న అసలు క్రూరమైన ఉద్దేశం తనకు అర్థం కాలేదని స్పష్టం చేసింది.

వారసత్వం లేని వారికే ఈ కష్టాలు

చిత్ర పరిశ్రమలో బ్యాక్‌గ్రౌండ్ లేని నటీనటులు (నాన్-నెపో కిడ్స్) ఎదుర్కొనే సవాళ్లపై మాన్వి స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. "సినిమా వారసత్వంతో వచ్చే స్టార్ కిడ్స్‌కు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ ఎదురుకావు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే మాలాంటి వారే ఇలాంటివన్నీ భరిస్తూ ముందుకు సాగాలి. ఇక్కడ ప్రయాణం అంత సులువు కాదు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

వెబ్ సిరీస్ స్టార్‌గా గుర్తింపు.. ఆరేళ్ల తర్వాత థియేటర్లలోకి!

2007లో డిస్నీ టీవీ సిరీస్ 'ధూమ్ మచావో ధూమ్'తో కెరీర్ ప్రారంభించిన మాన్వి గాగ్రూ, ఆ తర్వాత 'నో వన్ కిల్డ్ జెస్సికా', ఆమిర్ ఖాన్ నటించిన 'పీకే' వంటి చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించింది. భారతదేశంలో ఓటీటీ విప్లవానికి నాంది పలికిన తొలినాటి వెబ్ సిరీస్ 'పిచర్స్', 'ట్రిప్లింగ్'లలో చంచల్ పాత్రతో ఆమె విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.

ఆ తర్వాత 'మేడ్ ఇన్ హెవెన్', 'ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్!' వంటి ఓటీటీ బోల్డ్ సిరీస్‌తోపాటు 'ఉజ్డా చమన్', శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్ వంటి ప్రాజెక్ట్‌లతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది మాన్వి గాగ్రూ. దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత మాన్వి మళ్లీ వెండితెరపై మెరిసింది.

జూన్ 12న థియేటర్లలో

మాన్వీ గాగ్రూ ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ రోడ్-ట్రిప్ డ్రామా 'హీర్ సారా' జూన్ 12న థియేటర్లలో విడుదలైంది. పాండిచ్చేరి నేపథ్యంలో సాగే ఇద్దరు భిన్నమైన మహిళల స్నేహం, ఆత్మపరిశీలన చుట్టూ ఈ కథ సాగుతుంది. ఇందులో నటి పత్రలేఖ కూడా మరో ముఖ్య పాత్ర పోషించింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More