టీవీ నిర్మాతలు వైట్ కాలర్ మాఫియా- ఆ దౌర్భాగ్యుల దగ్గర పనిచేయను, రోడ్డుపై కూరగాయలు అమ్ముకుంటా: సీరియల్ హీరోయిన్ శిల్పా
Serial Actress Shilpa Shinde On TV Producers: బుల్లితెర పరిశ్రమలో నిర్మాతల తీరుపై ప్రముఖ సీరియల్ హీరోయిన్ శిల్పా షిండే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇండస్ట్రీని మాఫియాలా నడుపుతున్నారని, అలాంటి దౌర్భాగ్యుల దగ్గర చేతులు కట్టుకుని పనిచేసేకంటే రోడ్డుపై కూరగాయలు అమ్ముకోవడం మేలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Serial Actress Shilpa Shinde On TV Producers: ముంబై టెలివిజన్ పరిశ్రమలో మరోసారి పారితోషికాల వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. నటుడు షెహజాదా ధామికి రావాల్సిన రూ. 30 లక్షల బాకీని నిర్మాతలు ఇవ్వడం లేదనే వార్తలపై ‘భాబీజీ ఘర్ పర్ హై’ సీరియల్ హీరోయిన్ శిల్పా షిండే ఘాటుగా స్పందించారు.

వైట్ కాలర్ మాఫియాల
బుల్లితెరను శాసిస్తున్న కొందరు నిర్మాతలు ‘వైట్ కాలర్ మాఫియా’లా వ్యవహరిస్తున్నారంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోను విడుదల చేసి సంచలనం సృష్టించారు బుల్లితెర హీరోయిన్ శిల్పా షిండే.
సాధారణంగా టీవీ సీరియళ్లలో నటించే ఆర్టిస్టులకు మూడు నెలల (90 రోజులు) తర్వాతే పారితోషికాలు ఇచ్చే నిబంధన ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని నిర్మాతలు నటీనటులను లొంగదీసుకుంటున్నారని, ప్రశ్నిస్తే భవిష్యత్తు లేకుండా చేస్తామని బెదిరిస్తున్నారని శిల్పా ఆరోపించారు.
ఆ దౌర్భాగ్యుల దగ్గర పనిచేయను.. కూరగాయలు అమ్ముకుంటా!
"టీవీ ఇండస్ట్రీలో ఇప్పుడు క్రియేటివిటీ అనేది పూర్తిగా నశించింది. అంతా చెత్త షోలు తీస్తున్నారు. ఇలాంటి గతిమాలిన వాతావరణంలో, ఆ దౌర్భాగ్యుల దగ్గర అవకాశాల కోసం నేను చేతులు కట్టేసుకోను. దానికంటే రోడ్డుపై కూరగాయలు అమ్ముకోవడానికైనా సిద్ధమే కానీ, లొంగిపోయే ప్రసక్తే లేదు" అని శిల్పా షిండే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్టిస్ట్ అసోసియేషన్లు కూడా నిర్మాతలకు కొమ్ముకాస్తున్నాయే తప్ప కష్టాల్లో ఉన్న నటీనటులకు అండగా నిలవడం లేదని విమర్శించారు. కొందరు నటులు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే దానికి ఈ ఆర్థిక వేధింపుల వ్యవస్థే కారణమని శిల్పా షిండే ఆవేదన వ్యక్తం చేశారు.
పాత కేసుపై ట్రోల్స్.. సహనటులపై ఆగ్రహం
పదేళ్ల క్రితం ‘భాబీజీ ఘర్ పర్ హై’ సీరియల్ నిర్మాత సంజయ్ కోహ్లీపై తాను పెట్టిన లైంగిక వేధింపుల కేసు కేవలం డబ్బుల కోసమేనంటూ వస్తున్న విమర్శలపై శిల్పా కౌంటర్ ఇచ్చారు. ఆ సమయంలో తాను ఎలాంటి మానసిక క్షోభ అనుభవించానో బయట ఉన్నవారికి తెలియదన్నారు. కష్టకాలంలో తనతో కలిసి పనిచేసిన సహనటులు ఎవరూ అండగా నిలబడలేదని మండిపడ్డారు.
నాటి వివాదంలో తాను ఒంటరిగా పోరాడాల్సి వచ్చిందని, ఇప్పటికీ ఇండస్ట్రీలో అదే ధోరణి కొనసాగుతోందని స్పష్టం చేశారు. తన అంతరాత్మకు ఏం జరిగిందో తెలుసని, వేరెవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు.
సంచలనం రేపిన ‘నకిలీ కేసు’ అంగీకారం
ఇటీవలే భారతీ సింగ్, హర్ష్ లింబాచియా నిర్వహిస్తున్న ఒక పాడ్‌కాస్ట్‌లో శిల్పా షిండే చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీని కుదిపేశాయి. పదేళ్ల క్రితం నిర్మాత సంజయ్ కోహ్లీ తన పారితోషికం ఇవ్వకుండా వేధించడంతో, అతడిని దారికి తెచ్చుకోవడానికి చివరి అస్త్రంగా ‘ఫేక్ లైంగిక వేధింపుల కేసు’ పెట్టానని ఆమెనే స్వయంగా అంగీకరించారు.
ఆ తర్వాత ఇరు వర్గాల మధ్య సెటిల్‌మెంట్ జరిగి తన డబ్బులు అందాయని వెల్లడించారు శిల్పా షిండే. అయితే, లైంగిక వేధింపుల చట్టాన్ని వ్యక్తిగత కక్షల కోసం వాడుకున్నారంటూ తోటి నటీమణులు హీనా ఖాన్, పూజా బేడీలు శిల్ప తీరును తీవ్రంగా ఖండించారు.
తప్పుడు ఆరోపణల వల్ల
అటు ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) కూడా శిల్పా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి తప్పుడు ఆరోపణల వల్ల భవిష్యత్తులో నిజంగా బాధితులైన మహిళలకు న్యాయం జరగకుండా పోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వివాదం బాలీవుడ్, బుల్లితెర వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


