TV: నిర్మాతపై సీరియల్ నటి తప్పుడు లైంగిక ఆరోపణలు- ట్విస్టుల మీద ట్విస్టులు- శిల్పా, కోహ్లీ ఇద్దరిని వాయించిన మరో నటి!

Hina Khan Slams TV Actress Shilpa Shinde: టీవీ సీరియల్ ప్రొడ్యూసర్‌పై తాను పెట్టిన లైంగిక వేధింపుల కేసు అబద్ధమని బుల్లితెర నటి శిల్పా షిండే షాకింగ్ నిజం ఒప్పుకున్నారు. శిల్పా వ్యాఖ్యలతో అటు నటి, మరోవైపు నిర్మాత కోహ్లీపై మరో నటి హినా ఖాన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చూస్తుంటే అసహ్యం వేస్తుందన్నారు.

Published on: Jun 4, 2026, 12:52:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Hina Khan Slams TV Actress Shilpa Shinde: బుల్లితెరపై నటి శిల్పా షిండే లైంగిక ఆరోపణలు గతంలో సంచలనం సృష్టించాయి. దాదాపు పదేళ్ల క్రితం 'భాబీజీ ఘర్ పర్ హై' (Bhabiji Ghar Par Hain) సీరియల్ నిర్మాత సంజయ్ కోహ్లీపై లైంగిక వేధింపుల (Sexual Harassment) ఆరోపణలు చేసి సంచలనం సృష్టించింది నటి శిల్పా షిండే.

నిర్మాతపై సీరియల్ నటి తప్పుడు లైంగిక ఆరోపణలు- ట్విస్టుల మీద ట్విస్టులు- శిల్పా, కోహ్లీ ఇద్దరిని వాయించిన మరో నటి!
నిర్మాతపై సీరియల్ నటి తప్పుడు లైంగిక ఆరోపణలు- ట్విస్టుల మీద ట్విస్టులు- శిల్పా, కోహ్లీ ఇద్దరిని వాయించిన మరో నటి!

షాక్‌లో ఇండస్ట్రీ

అయితే, ఇప్పుడు అదంతా అబద్ధమని నటి శిల్పా షిండే పెద్ద బాంబ్ పేల్చింది. ఇటీవల కమెడియన్ భారతి సింగ్, హర్ష్ లింబాచియాలతో జరిగిన ముఖాముఖిలో శిల్పా షిండే చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీని షాక్‌కు గురిచేశాయి.

కేవలం కాంట్రాక్ట్ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి తనకు "మరో మార్గం లేక" ఆరోపణలు చేశానని శిల్పా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, మరో ప్రముఖ నటి హినా ఖాన్ (Hina Khan) శిల్పా షిండేపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 'ది జోక్ ఈజ్ ఆన్ అజ్' (The joke is on us) అంటూ తన ఆవేదనను, ఆగ్రహాన్ని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు.

'నేను మాటల్లో చెప్పలేనంత షాక్‌లో ఉన్నా'

హినా ఖాన్ తన సుదీర్ఘ పోస్టులో శిల్పా షిండే పేరు ఎత్తకుండానే, ఆమె ప్రవర్తనను ఎండగట్టారు. "సాధారణంగా నేను ఎవరి గురించి మాట్లాడను, ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోను. కానీ, ఇది మన సమాజంపై, ముఖ్యంగా మహిళలపై ప్రభావం చూపే సున్నితమైన అంశం కాబట్టి మాట్లాడుతున్నాను. ప్రజల్లో గుర్తింపు ఉన్న వ్యక్తిగా, మాట్లాడే అవకాశం ఉన్నందున నా వంతు బాధ్యతగా స్పందిస్తున్నాను" అని హినా ఖాన్ పేర్కొన్నారు.

నటి హినా ఖాన్ ఇంకా ఏమన్నారంటే.. "అవును, ఒక వివాదంలో గెలవడం కోసం మీ జెండర్‌ని వాడుకుని ఒక వ్యక్తి ఇమేజ్‌ను దెబ్బతీయడం అత్యంత సిగ్గుచేటు. దీనిని ఖండిస్తూ, న్యాయం డిమాండ్ చేయడం సరైనదే. నేను మాటల్లో చెప్పలేనంత షాక్‌లో ఉన్నాను" అని హినా ఖాన్ అన్నారు.

"కానీ, నేను ఇక్కడ 'అసలు బాధితుడి' గురించి మాట్లాడాలనుకుంటున్నాను. భార్య, కూతురు, కుటుంబంలో ఎంతోమంది మహిళలు ఉన్న ఒక గౌరవప్రదమైన వ్యక్తి.. ఎన్నో ఐకానిక్ షోలను రూపొందించిన కష్టపడే నిర్మాత" అని హినా ఖాన్ చెప్పుకొచ్చారు.

"అతను ఎంత మానసిక క్షోభను అనుభవించి ఉంటాడు? సదరు మహిళా నటి ఒప్పుకున్నట్లుగా, ఆమె ఆరోపణలు నిరాధారమైనవి మాత్రమే కాదు, ప్రయోజనం పొందడానికి, గెలవడానికి, చట్టాన్ని వాడకుండా సెటిల్ చేసుకోవడానికి ఉపయోగించారు" అని హినా మండిపడ్డారు.

'మళ్లీ అదే వ్యక్తికి ఛాన్స్.. ఏంటిది?'

హినా ఖాన్ తన పోస్టులో మరో షాకింగ్ అంశాన్ని కూడా ప్రస్తావించారు. అదే నిర్మాత, ఆమె ఫేక్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినప్పటికీ, మళ్లీ అదే షోలో ఆమెకు ఛాన్స్ ఇవ్వడంపై హినా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

"మరో లాంచ్ ప్యాడ్, మరో నోరు, మరో గుర్తింపు, ఆమె ఫేక్ లైంగిక వేధింపుల క్లెయిమ్‌కు చట్టబద్ధత కల్పించడానికి మరో అవకాశం. ఆ నటి మళ్లీ అలా చేస్తే ఏంటి పరిస్థితి? ఆమె అబద్ధపు ఆరోపణలు చేసిన వ్యక్తి ద్వారానే మళ్లీ అదే షోలో అవకాశం పొందింది. ఇది చూస్తుంటే నాకు అసహ్యం వేస్తోంది" అని హినా ఖాన్ స్పష్టం చేశారు.

ఇద్దరిని వాయించేసిన నటి

తప్పుడు లైంగిక ఆరోపణలపై అటు నటి శిల్పా షిండేను, నిర్మాత సంజయ్ కోహ్లీని ఇద్దరిని చెడామడా వాయించేసింది హినా ఖాన్. 2016లో శిల్పా షిండే 'భాబీజీ ఘర్ పర్ హై' సీరియల్ నుంచి తప్పుకున్నప్పుడు, నిర్మాతలు వేధిస్తున్నారని, డబ్బులు చెల్లించడం లేదని, పని వాతావరణం బాగోలేదని ఆరోపణలు చేశారు.

సెటిల్‌మెంట్‌తో ముగిసిన వివాదం

ఈ వివాదం సెటిల్‌మెంట్‌తో ముగిసింది. తన స్నేహితులు తనను హెచ్చరించారని, నేను ఏం చేశానో తెలుసా అని అడిగారని శిల్పా గుర్తు చేసుకున్నారు. కానీ, షో నుంచి తప్పుకున్నా తనకు మరో మార్గం లేకపోవడంతో అలా చేయాల్సి వచ్చిందని ఆమె వివరించారు.

2025లో శిల్పా మళ్లీ 'భాబీజీ ఘర్ పర్ హై' సీరియల్‌లోకి తిరిగి వచ్చారు. ఆ సీరియల్ రైటర్ కోసం తాను తిరిగి వచ్చానని, ఇప్పుడు మొత్తం టీమ్‌తో మంచి సంబంధాలు ఉన్నాయని శిల్పా షిండే తెలిపారు.

ట్విస్టుల మీద ట్విస్టులు

ఏదేమైనా నిర్మాతపై లైంగిక ఆరోపణలు పెట్టడం, అవి అబద్ధమని తేలడం, మళ్లీ అదే నటికి ప్రొడ్యూసర్ ఛాన్స్ ఇవ్వడం సీరియల్, సినిమా తరహాలో ట్విస్టులతో సాగినట్లుగా తెలుస్తోంది.'

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More