Harassment Case: 241 కోట్ల మూవీ డైరెక్టర్‌పై లైంగిక వేధింపుల కేసు- న్యాయస్థానం నుంచి ఊరట- చిదంబరం పరిస్థితి ఏంటంటే?
Chidambaram S Poduval Sexual Harassment Case: 2022లో ఒక యువతిని లైంగికంగా వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మలయాళ దర్శకుడు చిదంబరం ఎస్ పోదువల్‌కు ఎర్నాకులం కోర్టు నుంచి ఊరట లభించింది. ఈ నేపథ్యంలో పుకార్లను నమ్మవద్దని సోషల్ మీడియా వేదికగా చిదంబరం కోరారు. పూర్తి వివరాల్లోకి వెళితే..!
మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన 'మంజుమ్మెల్ బాయ్స్' చిత్ర దర్శకుడు చిదంబరం ఎస్. పొదువల్ చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. 2022లో ఒక యువతి పట్ల లైంగికంగా అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. కొచ్చి పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో చిదంబరం ఎస్‌కు తాజాగా న్యాయస్థానం నుంచి ఊరట లభించింది.

కోర్టు కీలక నిర్ణయం
చిదంబరం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ఎర్నాకులం జిల్లా సెషన్స్ కోర్టు, శనివారం (మార్చి 7) ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. జిల్లా జడ్జి శ్రీ కె.కె. బాలకృష్ణన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
అక్రమంగా ప్రవేశించి
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. 2022లో చిదంబరం ఆమె అపార్ట్‌మెంట్‌లోకి అక్రమంగా ప్రవేశించి, తనపై లైంగిక దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. ఈ క్రమంలో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 74 (మహిళ గౌరవానికి భంగం కలిగించడం), సెక్షన్ 75 (లైంగిక వేధింపులు) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే బాధితురాలి స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డ్ చేశారు.
పుకార్లపై దర్శకుడి స్పందన
ఈ కేసు వ్యవహారం బయటకు రాకముందే చిదంబరం పొదువల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను పబ్లిక్ నుంచి ప్రైవేట్‌కు మార్చడం చర్చనీయాంశమైంది. మరోవైపు, చిదంబరం నటుడు దిలీప్‌తో కలిసి ఒక సినిమా చేస్తున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి.
చెత్త పోస్ట్ చేసేముందు
దీనిపై చిదంబరం తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఘాటుగా స్పందించారు. "ఏదైనా చెత్త పోస్ట్ చేసే ముందు వాస్తవాలు సరిచూసుకోండి. అలాగే, నేను కేవలం సర్వైవల్ థ్రిల్లర్ నిపుణుడిని మాత్రమే కాదు" అని చిదంబరం ఎస్ పొదువల్ పేర్కొన్నారు.
కెరీర్ ప్రస్థానం..
పయ్యన్నూరుకు చెందిన చిదంబరం ఎస్ పొదువల్ మలయాళ పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రయాణాన్ని మొదలుపెట్టారు. 2021లో 'జన్.ఇ.మన్' చిత్రంతో దర్శకుడిగా పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, 2024లో వచ్చిన 'మంజుమ్మెల్ బాయ్స్' ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది.
241 కోట్ల డైరెక్టర్
గుణ కేవ్స్ నేపథ్యంలో సాగే ఈ సర్వైవల్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా రూ. 241 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం చిదంబరం ఎస్ పొదువల్ 'బాలన్' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుశీన్ శ్యామ్ సంగీతం అందిస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


