దర్శకుడిగా మారుతున్న నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్.. వీవీ వినాయక్ సలహాతో.. ప్రభాస్ పుట్టినరోజే తనది కావడం సంతోషంగా ఉందంటూ!

ఇండస్ట్రీలో నిర్మాత దర్శకుడుగా మారడం చాలా అరుదైన విషయం. అలాంటిది టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన సెవెన్ హిల్స్ సతీష్ డైరెక్టర్‌గా మారనున్నారు. ఈ విషయాన్ని తన పుట్టినరోజు సందర్భంగా మీడియా సమక్షంలో ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు. ప్రభాస్ పుట్టినరోజే తన బర్త్ డే కావడం సంతోషంగా ఉందన్నారు సతీష్.

Published on: Oct 22, 2025, 21:16:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బట్టలరామస్వామి బయోపిక్, కాఫీ విత్ ఏ కిల్లర్, సోలో బాయ్ సినిమాలను నిర్మించిన ప్యాషనేట్ ప్రొడ్యూసర్ సెవెన్ హిల్స్ సతీష్ తన పుట్టినరోజు(అక్టోబర్ 23) సందర్భంగా నూతన ప్రయాణం మొదలుపెట్టినట్లు ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు.

దర్శకుడిగా మారుతున్న నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్.. వీవీ వినాయక్ సలహాతో.. ప్రభాస్ పుట్టినరోజే తనది కావడం సంతోషంగా ఉందంటూ!
దర్శకుడిగా మారుతున్న నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్.. వీవీ వినాయక్ సలహాతో.. ప్రభాస్ పుట్టినరోజే తనది కావడం సంతోషంగా ఉందంటూ!

డైరెక్టర్ కావాలనే లక్ష్యంతో

3 విజయవంతమైన సినిమాలను నిర్మించి సతీష్.. త్వరలో దర్శకుడిగా మారబోతున్నట్లు తెలిపారు. డైరెక్టర్ కావాలనే లక్ష్యంతో ఇండస్ట్రీకి వచ్చిన తను నిర్మాతగా ప్రారంభమై సినిమా నిర్మాణానికి అన్నీ నేర్చుకుని పూర్తిగా సన్నద్ధం అయిన తర్వాత తన లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

అలాగే తన బ్యానర్‌లో ఇంకో రెండు సినిమాలు తీస్తున్నట్లు చెప్పారు. ఎడిటర్ ప్రవీణ్ పూడి దర్శకత్వంలో ఒక సినిమా తీస్తున్నామని, రాజశేఖర్ గడ్డం దర్శకత్వంలో మరో సినిమా స్క్రిప్ట్ దశలో ఉందని చెప్పారు.

నార్నె నితిన్ హీరోగా

నార్నే నితిన్ హీరోగా ఉగాది రోజున ప్రారంభమైన సినిమా అనుకోకుండా పట్టాలెక్కకపోవడంతో ఆ కథను సరికొత్తగా మార్చి త్వరలో సినిమా చేస్తున్నామని చెప్పారు. ఈ రెండు సినిమాల అప్‌డేట్స్ వచ్చే ఏడాదిలో ఇస్తామన్నారు దర్శకుడిగా మారిన నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్.

సోలో బాయ్ ఈవెంట్‌లో తన గురువు వీవీ వినాయక్ చెప్పిన విధంగా తాను డైరెక్టర్ అవ్వాలనే ప్రయత్నాన్ని ఈ పుట్టినరోజు సందర్భంగా మొదలు పెట్టినట్లు సెవెన్ హిల్స్ సతీష్ తెలిపారు. మూడు సినిమాల అనుభవంతో వచ్చే ఏడాది దర్శకుడిగా మారబోతున్నట్లు చెప్పారు.

ప్రభాస్ పుట్టినరోజే కావడం

తన స్నేహితుల సహాయంతో వాళ్ల నిర్మాణంలో తన మొదటి సినిమా డైరెక్షన్ చేయబోతున్నట్లు చెప్పారు. తొలిసారి మీడియా సమక్షంలో కేక్ కట్ చేసి గ్రాండ్‌గా బర్త్ డే జరుపుకోవడం కొత్తగా ఉందన్నారు. ప్రభాస్ పుట్టినరోజే తన బర్త్ డే కావడం హ్యాపీగా ఉందన్నారు సతీష్.

ఈ సందర్భంగా సెవెన్ హిల్స్ సతీష్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. "నేను మీడియా ముఖంగా ఎప్పుడూ బర్త్ డే చేసుకోలేదు. నా ఫ్రెండ్స్ నాకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. తప్పకుండా బర్త్ డే చేసుకోవాలని సూచించారు. మూడు సినిమాల నిర్మాణంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నా. అన్ని క్రాప్ట్‌లకు సంబంధించి విషయాలు నేర్చుకున్నాను" అని అన్నారు.

వీవీ వినాయక్ గారు చెప్పడంతో

"వయసులో ఉన్నప్పుడే డైరెక్షన్ చేయాలని వీవీ వినాయక్ గారు చెప్పడంతో డైరెక్టర్‌గా మారుతున్నా. నార్నే నితిన్ డేట్స్ అలాగే ఉన్నాయి. కథ ఓకే అయితే ఆయనతో సినిమా చేస్తాను. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నా. డైరెక్టర్‌గా డెబ్యూ మూవీ అనేది చాలా ముఖ్యం. మంచి సినిమా చేస్తేనే మన టాలెంట్ ఏంటనేది బయటపడుతుంది. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను" అని సతీష్ తెలిపారు.

"ప్రస్తుతం మనం మెసేజ్ ఇస్తే చూసే మూడ్‌లో ఆడియన్స్ లేరు. అందుకే నవ్వించి ఎంటర్‌టైన్ చేస్తేనే ఆడియన్స్ థియేటర్లకు వస్తారు. బలగం, లిటిల్ హార్ట్స్‌ వంటి సినిమాలతో అది ప్రూవ్ అయింది. అందుకే తక్కువ బడ్జెట్‌తో మంచి కంటెంట్ ఉన్న సినిమా చేస్తాను" అని నిర్మాత సతీష్ పేర్కొన్నారు.

చాలా వేరియేషన్స్

"చాలా వేరియేషన్స్ ఉన్న స్క్రిప్ట్ రెడీ చేస్తున్నా. సినిమా మొత్తం ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఏ సినిమా ఎందుకు హిట్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. నిజాయితీగా మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోవాలి" అని డైరెక్టర్‌గా మారబోతున్న నిర్మాత సతీష్ వెల్లడించారు.

"నిర్మాతగా బట్టల రామస్వామి బయోపిక్ మంచి డబ్బులు వచ్చాయి. రెండో సినిమా కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. నేను నిర్మించిన మూడు సినిమాలు కూడా కొత్త వాళ్లతో చేశాను. డైరెక్టర్‌గా కూడా కొత్తవాళ్లతో చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కొత్తవాళ్లతో చేస్తే డేట్స్ ఇబ్బంది ఉండదు" అని సెవెన్ హిల్స్ సతీష్ చెప్పుకొచ్చారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More