ఈ సినిమా మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది: మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ నెక్ట్స్ మూవీపై రామ్‌గోపాల్ వర్మ ప్రశంసలు

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇప్పుడో సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. మంజుమ్మెల్ బాయ్స్ లాంటి సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ చిదంబరం డైరెక్ట్ చేసిన సినిమా కావడం విశేషం. ఆ మూవీ విశేషాలేంటో చూద్దాం.

Feb 12, 2026, 16:21:03 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

'మంజుమ్మెల్ బాయ్స్'తో సంచలనం సృష్టించిన మలయాళ దర్శకుడు చిదంబరం నెక్ట్స్ మూవీ 'బాలన్' (Balan) విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా రషెస్ చూసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ).. ఇది ఇండస్ట్రీని కుదిపేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. మరి అతడు ఈ కామెంట్స్ ఎందుకు చేశాడో చూడండి.

ఈ సినిమా మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది: మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ నెక్ట్స్ మూవీపై రామ్‌గోపాల్ వర్మ ప్రశంసలు
ఈ సినిమా మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది: మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ నెక్ట్స్ మూవీపై రామ్‌గోపాల్ వర్మ ప్రశంసలు

"ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.."

2024లో 'మంజుమ్మెల్ బాయ్స్' (Manjummel Boys) సినిమాతో మలయాళ సినిమా ఇండస్ట్రీలో రికార్డులు తిరగరాసిన దర్శకుడు చిదంబరం. అతని దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ సినిమా 'బాలన్' (Balan). ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబవుతోంది. తాజాగా ఈ సినిమా గురించి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇటీవల చిదంబరాన్ని కలిసిన వర్మ.. 'బాలన్' సినిమాకు సంబంధించిన చిన్న క్లిప్‌ను చూశారట. ఆ తర్వాత తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ.. "మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరంతో నేను.. అతడు తీస్తున్న 'బాలన్' క్లిప్ చూశాను. ఇది అద్భుతం అనే మాట కంటే ఎక్కువే అని చెప్పాలి. ఈ సినిమా కచ్చితంగా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది," అని ఆకాశానికెత్తేశాడు.

భారీ అంచనాలు.. ఆవేశం రైటర్ మ్యాజిక్

చిదంబరం డైెరెక్ట్ చేస్తున్న ఈ బాలన్ సినిమాపై అంచనాలు పెరగడానికి మరో కారణం దీని రచయిత. బ్లాక్ బస్టర్ హిట్ 'ఆవేశం' (Aavesham) దర్శకుడు జీతూ మాధవన్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించాడు. డిసెంబర్ 2025లోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. 2026 ప్రథమార్ధంలోనే ఈ సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.

బాలన్ మూవీ విశేషాలు

ఈ బాలన్ సినిమాలో టొవినో థామస్ (Tovino Thomas) గెస్ట్ రోల్ చేస్తున్నారని పుకార్లు వచ్చాయి. కానీ చిదంబరం సోదరుడు, నటుడు గణపతి ఆ వార్తలను ఖండించాడు. ఈ సినిమాలో మిగిలిన నటీనటులు ఎవరన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే.. మంజుమ్మెల్ బాయ్స్ టీమ్ మళ్ళీ రిపీట్ అయ్యింది. సుశిన్ శ్యామ్ సంగీతం, షైజు ఖలీద్ సినిమాటోగ్రఫీ, అజయన్ చాలిస్సేరి ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేశారు.

ఈ బాలన్ డైరెక్టర్ చిదంబరం గత సినిమాలు అయిన 'మంజుమ్మెల్ బాయ్స్' జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుండగా.. 'జాన్-ఈ-మన్' (Jan-E-Man) సన్ నెక్ట్స్ లో అందుబాటులో ఉంది.