Sanchita Ugale: బుల్లితెరపై తీవ్ర విషాదం- 22 ఏళ్ల సీరియల్ హీరోయిన్ సంచిత ఉగాలే సూసైడ్- ఇన్‌స్టాగ్రామ్ వీడియో వైరల్!

Serial Actress Sanchita Ugale Suicide: ప్రముఖ టీవీ సీరియల్ హీరోయిన్ సంచిత ఉగాలే ఆత్మహత్య చేసుకుని మరణించారు. 'కుంకుమ్ భాగ్య', 'వాగ్లే కీ దునియా' సీరియల్స్, ఛావా, సైలెన్స్ 2 సినిమాల్లో నటించిన సంచిత 22 ఏళ్లకే ఆత్మహత్యకు పాల్పడటం బుల్లితెర ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Published on: Jun 15, 2026, 15:19:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Serial Heroine Sanchita Ugale Suicide: గ్లామర్ ప్రపంచంలో వెలుగుల వెనుక ఎన్నో చీకట్లు ఉంటాయనే నిజాన్ని నిరుపిస్తూ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న బుల్లితెర హీరోయిన్ సంచిత ఉగాలే (22) ఆదివారం (జూన్ 14) సాయంత్రం అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు విడిచారు.

బుల్లితెరపై తీవ్ర విషాదం- 22 ఏళ్ల సీరియల్ హీరోయిన్ సంచిత ఉగాలే సూసైడ్- ఇన్‌స్టాగ్రామ్ వీడియో వైరల్!
బుల్లితెరపై తీవ్ర విషాదం- 22 ఏళ్ల సీరియల్ హీరోయిన్ సంచిత ఉగాలే సూసైడ్- ఇన్‌స్టాగ్రామ్ వీడియో వైరల్!

ఫ్యాన్‌కు ఉరేసుకుని

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా పరిధిలోని నల్లసోపార ప్రాంతంలో ఉన్న తన నివాసంలో సంచిత ఉగాలే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు సోమవారం (జూన్ 15) ఉదయం వెల్లడించారు.

ఆదివారం సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో సంచిత ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అచోలే పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడ ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని, ప్రాథమికంగా అనుమానాస్పద అంశాలేవీ కనిపించలేదని పోలీసులు తెలిపారు.

ఎవరూ బాధ్యులు కాదని

తన కుమార్తె మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని, దీనికి ఎవరూ బాధ్యులు కారని సంచిత తండ్రి పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనను ప్రమాద వశాత్తూ జరిగిన మరణంగా (Accidental Death) కేసు నమోదు చేసి, పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కెరీర్ ఎదుగుతున్న సమయంలోనే..

హిందీ టెలివిజన్ రంగంలో సంచిత ఉగాలే మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఆదరణ పొందిన 'కుంకుమ్ భాగ్య' సీరియల్‌లో దియా టాండన్ పాత్రలో నటించి సంచిత ఉగాలే వీక్షకులకు దగ్గరయ్యారు. ఈ పాత్రే తన కెరీర్‌ను మలుపు తిప్పిందని, తనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిందని ఆమె గతంలో పలు ఇంటర్వ్యూలలో సంతోషం వ్యక్తం చేశారు.

దీనితో పాటు 'వాగ్లే కీ దునియా - నయీ పీఢీ నయే కిస్సే' సీరియల్‌లోనూ, 'దిల్‌వాలే దుల్హా లే జాయేంగే' అనే సీరియల్‌లో లీడ్ రోల్‌లోనూ అంటే హీరోయిన్‌గా నటించి మెప్పించారు సంచిత. బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా సంచిత అడుగులు వేశారు.

విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన చారిత్రక నేపథ్య చిత్రం 'ఛావా'లో తారా రాణి చిన్నప్పటి పాత్రను సంచిత ఉగాలే పోషించారు. అలాగే ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ నటించిన ఓటీటీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'సైలెన్స్ 2: ది నైట్ ఔల్ బార్ షూటౌట్' లోనూ చిన్న పాత్రలో మెరిశారు.

కొన్ని గంటల ముందే డ్యాన్స్ వీడియో

సంచిత ఆత్మహత్య చేసుకోవడానికి కేవలం కొన్ని గంటల ముందే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పంచుకున్నారు. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాలోని హిట్ సాంగ్ 'రాధా' పాటకు ఆమె ఎంతో హుషారుగా, నవ్వుతూ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ ఆ వీడియోలో కనిపించారు.

అంతలోనే సంచిత ఉగాలే ఈ ఘోరానికి ఒడిగట్టడాన్ని అభిమానులు, సహ నటీనటులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నోట్: మానసిక ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఒంటరిగా బాధపడకుండా నిపుణుల సహాయం తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కావు. మానసిక సహాయం కోసం ఆసరా (022 2754 6669), రోషిణి ఫౌండేషన్ సికింద్రాబాద్ (040-66202001, 040-66202000), వన్ లైఫ్ (78930 78930) వంటి హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించవచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More