Amulya Sri: ఉరేసుకుని నటి అమూల్య శ్రీ సూసైడ్.. నగ్న వీడియోలతో కామాంధుల బ్లాక్‌మెయిల్.. పట్టించుకోని పోలీసులు!

Actress Amulya Sri Suicide: హీరోయిన్ కావాలనే కలలతో హైదరాబాద్‌ వచ్చిన షార్ట్ ఫిల్మ్ నటి అమూల్య శ్రీ సూసైడ్ చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. కొందరు యువకులు ఆమె నగ్న వీడియోలను రహస్యంగా రికార్డ్ చేసి బ్లాక్‌మెయిల్ చేయడంతోనే అమూల్య శ్రీ ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Published on: Jun 13, 2026, 10:00:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Actress Amulya Sri Suicide: వెండితెరపై మెరిసిపోవాలని, హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో ఆశలతో హైదరాబాద్ మహానగరంలో అడుగుపెట్టింది ఆ యువతి. తన ప్రతిభతో షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంటున్న తరుణంలోనే కామాంధుల కన్ను ఆమెపై పడింది.

ఉరేసుకుని నటి అమూల్య శ్రీ సూసైడ్.. నగ్న వీడియోలతో కామాంధుల బ్లాక్‌మెయిల్.. పట్టించుకోని పోలీసులు!
ఉరేసుకుని నటి అమూల్య శ్రీ సూసైడ్.. నగ్న వీడియోలతో కామాంధుల బ్లాక్‌మెయిల్.. పట్టించుకోని పోలీసులు!

మృగాళ్ల వేధింపులు

సైదాబాద్ పరిధిలోని సింగరేణి కాలనీలో నివాసముంటున్న షార్ట్ ఫిల్మ్ నటి అమూల్య శ్రీ.. కొందరు మృగాళ్ల వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్ తట్టుకోలేక మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దారుణ ఘటన జరిగి పది రోజులు గడుస్తున్నా నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు ఇప్పుడు నగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

సినీ రంగుల ప్రపంచాన్ని నమ్ముకుని వచ్చే యువతులను లక్ష్యంగా చేసుకుని కొందరు కేటుగాళ్లు డిజిటల్ దాడులకు తెగబడుతున్నారు. రహస్య కెమెరాలు, స్మార్ట్‌ఫోన్ల సాయంతో వ్యక్తిగత విషయాలను రికార్డ్ చేయడం, ఆపై సోషల్ మీడియాలో పెడతామంటూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడటం లాంటి ఉదంతాలు ఇండస్ట్రీకి వస్తున్న కొత్తవారి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. షార్ట్ ఫిల్మ్ నటి అమూల్య శ్రీ విషయంలోనూ ఇదే తరహా ఘాతుకం జరిగింది.

6 నెలలుగా నరకయాతన.. నగ్న వీడియోలతో బెదిరింపులు

బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన కథనం ప్రకారం.. స్థానికంగా ఉండే కొంతమంది యువకులు అమూల్య శ్రీకి సంబంధించిన కొన్ని వ్యక్తిగత బాత్‌రూమ్ వీడియోలను రహస్యంగా రికార్డ్ చేశారు. ఆ నగ్న వీడియోలను చూపిస్తూ గత ఆరు నెలలుగా ఆమెను తీవ్ర మానసిక నరకయాతనకు గురిచేశారు.

తమ కోరిక తీర్చడానికి తమ దగ్గరికి రావాలని, లేదంటే ఈ వీడియోలను సోషల్ మీడియా వేదికగా వైరల్ చేసి కెరీర్‌ను నాశనం చేస్తామంటూ నిందితులు నిరంతరం వేధించారు. ఎదుగుతున్న కెరీర్ ఎక్కడ పాడవుతుందోననే భయంతో, ఆత్మగౌరవాన్ని చంపుకోలేక అమూల్య శ్రీ లోలోపలే కుమిలిపోయింది.

పోలీసుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆగ్రహం

ఈ వేధింపులు మితిమీరడంతో, నిందితుల నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ అమూల్య శ్రీ సూసైడ్‌కు ముందే సైదాబాద్ పోలీసులను ఆశ్రయించింది. అయితే, బాధితురాలి ఫిర్యాదుపై పోలీసులు సకాలంలో స్పందించలేదని, కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించారని కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.

చట్టం నుంచి సరైన మద్దతు లభించకపోవడం, మరోవైపు నిందితుల వేధింపులు ఎక్కువ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అమూల్య.. పది రోజుల క్రితం తన ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది.

"నా కూతురు స్నానం చేసే వీడియోలు తీసి ఆరు నెలలుగా నరకం చూపించారు. పోలీసులకు చెప్తే పట్టించుకోలేదు, నా బిడ్డ ప్రాణం పోయాక కూడా నిందితులను అరెస్ట్ చేయడం లేదు" అని అమూల్య శ్రీ తల్లి కన్నీరుమున్నీరయ్యారు.

న్యాయం కోసం తల్లి, సోదరి రోదన

అమూల్యకు తండ్రి లేకపోవడంతో ఆమె తల్లి, సోదరి ఒంటరిగా మిగిలారు. కంటికి రెప్పలా పెంచుకున్న కూతురు కామాంధుల వేధింపుల వల్ల శవంగా మారడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరవుతోంది. ఈ ఘటన జరిగి ఇన్ని రోజులవుతున్నా ప్రధాన నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు.

నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని బాధిత తల్లి ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. ఈ ఘటనపై సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి, అమూల్య సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More