K Rajan Suicide: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం- నదిలో దూకి ప్రముఖ నిర్మాత కే రాజన్ ఆత్మహత్య- 85 ఏళ్ల వయసులో సూసైడ్!

Producer K Rajan Suicide At Age 85: తమిళ చిత్ర పరిశ్రమలో ఘోర విషాదం నెలకొంది. వివాదరహితుడిగా, నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తిగా పేరు తెచ్చుకున్న సీనియర్ నిర్మాత కే రాజన్ (85) చెన్నైలోని అడయార్ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మృతి పట్ల ఖుష్బూ సుందర్, హీరో విశాల్ సంతాపం తెలియజేశారు.

Published on: May 17, 2026, 20:43:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Producer K Rajan Suicide At Age 85: తమిళ సినీ రంగాన్ని ఒక తీవ్ర దిగ్భ్రాంతికర వార్త కుదిపేసింది. నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ, సినిమా ఈవెంట్లలో తనదైన శైలిలో గళం విప్పే సీనియర్ నిర్మాత కే రాజన్ అర్ధాంతరంగా తనువు చాలించారు.

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం- నదిలో దూకి ప్రముఖ నిర్మాత కే రాజన్ ఆత్మహత్య- 85 ఏళ్ల వయసులో సూసైడ్!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం- నదిలో దూకి ప్రముఖ నిర్మాత కే రాజన్ ఆత్మహత్య- 85 ఏళ్ల వయసులో సూసైడ్!

85 ఏళ్ల వయసులో

చెన్నైలోని అడయార్ నదిలో దూకి సీనియర్ నిర్మాత కే రాజన్ ఆత్మహత్య చేసుకోవడం కోలీవుడ్ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. 85 ఏళ్ల వయసులో ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మృతిని న్యూస్18 తమిళనాడు మీడియా సంస్థ ధృవీకరించింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవలి కాలంలో వివిధ చిత్రాల ఆడియో లాంచ్‌లు, ప్రెస్ మీట్లలో కే రాజన్ చేసిన బోల్డ్ కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యేవి.

దిగ్భ్రాంతిలో సినీ లోకం

కే రాజన్ మరణవార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు, దర్శకులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. రాజ్‌భవన్ వర్గాలతో పాటు ఇండస్ట్రీ పెద్దలు ఆయనకు నివాళులర్పిస్తున్నారు.

"ఆయన మరణవార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మన సినీ కుటుంబంలో ఎంతో ఆదరణ పొందిన రాజన్ సర్ ఇలా ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. ఎప్పుడూ మొహమాటం లేకుండా నిజాలు మాట్లాడే వ్యక్తి ఆయన. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి" అని నటి ఖుష్బూ సుందర్ తన ఎక్స్ ఖాతాలో ఆవేదన వ్యక్తం చేశారు.

విశాల్ సంతాపం

హీరో విశాల్ కూడా ఈ ఘటనపై స్పందిస్తూ.. రాజన్ సర్ ఆత్మహత్య చేసుకున్నారనే వార్త నమ్మలేకపోతున్నానని, ఆయన ఎంతో ధైర్యంగా మాట్లాడే వ్యక్తని కొనియాడారు. గతంలో ఆయన డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా సేవలు అందించారని గుర్తుచేసుకున్నారు.

"తమిళ చిత్ర పరిశ్రమలో 1980ల నుంచి తనదైన ముద్ర వేసిన ఒక సీనియర్ నిర్మాత ఇలా అనూహ్యంగా తనువు చాలించడం కోలీవుడ్‌కు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను" అని నటుడు ఆర్ శరత్ కుమార్ సంతాపాన్ని ప్రకటించారు. దర్శకుడు సీను రామసామి సైతం రాజన్ మృతికి సోషల్ మీడియా ద్వారా నివాళులర్పించారు.

నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానం

కే రాజన్ కేవలం నిర్మాతగానే కాకుండా దర్శకుడిగా, నటుడిగా కూడా సుదీర్ఘ కాలం పాటు తమిళ చిత్ర పరిశ్రమలో కొనసాగారు. 1983లో సురేష్ హీరోగా వచ్చిన 'బ్రహ్మచారిగళ్' సినిమాతో ఆయన నిర్మాతగా ప్రస్థానం మొదలుపెట్టారు.

ఆ తర్వాత 1991లో శరత్ కుమార్, నిజాల్గల్ రవి ప్రధాన పాత్రల్లో 'నమ్మ ఊరు మరియమ్మ' చిత్రానికి కే రాజన్ దర్శకత్వం వహించారు. 'డబుల్స్', 'అవళ్ పావం', 'నినైక్కాత నాళిల్లాై' వంటి చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. ఆయన కుమారుడు ప్రభుకాంత్ కూడా ప్రస్తుతం నటుడిగా కొనసాగుతున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. తమిళ నిర్మాత కే రాజన్ ఎలా మరణించారు?

ఆయన చెన్నైలోని అడయార్ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు.

2. కే రాజన్ వయసు ఎంత? ఆయన సినీ కెరీర్ ఎప్పుడు ప్రారంభమైంది?

మరణించే సమయానికి ఆయన వయసు 85 ఏళ్లు. ఆయన 1983లో వచ్చిన 'బ్రహ్మచారిగళ్' సినిమాతో నిర్మాతగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు.

3. కే రాజన్ దర్శకత్వం వహించిన ప్రముఖ చిత్రం ఏది?

ఆయన 1991లో శరత్ కుమార్, నిజాల్గల్ రవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'నమ్మ ఊరు మరియమ్మ' అనే చిత్రానికి దర్శకత్వం వహించారు.

నోట్: జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా ఆత్మహత్య పరిష్కారం కాదని, మానసికంగా కుంగిపోతున్నవారు నిపుణుల సహాయం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. (స్నేహ ఇండియా ఫౌండేషన్ హెల్ప్‌లైన్: +914424640050, ఆసరా: 022 27546669).

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More