స్టార్ హీరోతో లవ్ ఎఫైర్ రూమర్స్- ప్రెస్ అంటే భయం వేసేది- అసలు నిజం బయటపెట్టిన హీరోయిన్ నీలం కొఠారి
హిందీ చిత్ర సీమలో 80, 90వ దశకంలో వెండితెరపై మ్యాజిక్ చేసిన హిట్ జోడీ గోవిందా-నీలం కొఠారి. 90స్‌లో గోవిందా, నీలం కొఠారి మధ్య ప్రేమాయణం సాగుతోందని వార్తలు షికార్లు చేశాయి. తాజాగా ఈ పుకార్లపై స్పందించిన బ్యూటిపుల్ హీరోయిన్ నీలం కొఠారి అసలు నిజం బయటపెట్టారు.
80వ దశకంలో బాలీవుడ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన జంటల్లో గోవిందా, నీలం కొఠారి జోడీ ఒకటి. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడమే కాకుండా, వారి కెమిస్ట్రీ చూసి వీరిద్దరూ నిజ జీవితంలోనూ ప్రేమలో ఉన్నారనే ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది.

పుకార్లపై నీలం కొఠారి
స్వయంగా గోవిందా కూడా ఒకానొక సందర్భంలో తాను నీలం పట్ల ఆకర్షితుడనయ్యానని, ఆమెను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నానని గతంలో గోవిందా వెల్లడించారు. అయితే, తాజాగా ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సీనియర్ హీరోయిన్ నీలం కొఠారి పాత జ్ఞాపకాలు, పుకార్లపై స్పందించారు.
గోవిందాతో ఎఫైర్? నీలం సమాధానం ఇదే!
ఉషా కాకడే ప్రొడక్షన్స్ పాడ్‌కాస్ట్‌లో గోవిందాతో లవ్ ఎఫైర్ గురించి నీలం కొఠారి మాట్లాడుతూ.. "బాబోయ్! ఈ మాట ఎవరు చెప్పారు? గోవిందా గారు చాలా మంచి వ్యక్తి. ఈ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు. మేమిద్దరం కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించాం. ఆయన అద్భుతమైన మనిషి, కానీ మా మధ్య ఎలాంటి సంబంధం లేదనేది వాస్తవం. సారీ.. కానీ ఈ వార్తలను నేను పూర్తిగా ఖండిస్తున్నాను" అని స్పష్టం చేశారు.
ఏదో ఉందనే ముద్ర వేసేవారు
ఆ కాలంలో మీడియా పోకడల గురించి వివరిస్తూ.. "అప్పట్లో ఒక హీరో హీరోయిన్ కలిసి వరుసగా రెండు మూడు సినిమాలు చేశారంటే చాలు, వారిద్దరి మధ్య ఏదో ఉందనే ముద్ర వేసేవారు. పత్రికల్లో వారికి నచ్చింది రాసేవారు. నిజం చెప్పాలంటే అప్పట్లో మాకు ప్రెస్ (మీడియా) అంటే భయం వేసేది. ఎందుకంటే అప్పుడు పెన్నుకున్న శక్తి అలాంటిది. వివరణ ఇచ్చే అవకాశం కూడా ఉండేది కాదు" అని నీలం కొఠారి ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు.
మనసు పారేసుకున్నానని చెప్పిన గోవిందా
నీలం కొఠారి ఇప్పుడు ఈ వార్తలను కొట్టిపారేసినప్పటికీ, గతంలో గోవిందా మాత్రం తన మనసులోని మాటను బహిరంగంగానే చెప్పారు. అప్పట్లో ఒక సినిమా మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గోవిందా మాట్లాడుతూ.. "మేము కలిసి చాలా సినిమాలు చేశాం. తరచూ కలుస్తుండటంతో ఆమె (నీలం కొఠారి) గురించి తెలిసే కొద్దీ నాకు ఇష్టం పెరిగింది. ఏ మగాడైనా మనసు పారేసుకునే అందం, వ్యక్తిత్వం నీలం సొంతం. నేను కూడా ఆమెను చూసి ఫ్లాట్ అయ్యాను" అని పేర్కొన్నారు.
వెండితెరపై అలరించిన ఈ జోడీ
కాగా, గోవిందా, నీలం కొఠారి కలిసి దాదాపు డజనుకు పైగా చిత్రాల్లో నటించారు. 1986లో వచ్చిన 'లవ్ 86', 'ఇల్జామ్' చిత్రాలతో మొదలైన వీరి ప్రయాణం.. 'ఖుద్‌గర్జ్', 'సిందూర్', 'ఫర్జ్ కీ జంగ్', 'బిల్లూ బాద్‌షా', 'తాకత్వర్', 'ఘరానా' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల వరకు కొనసాగింది. వీరిద్దరి డ్యాన్స్, ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీకి ఇప్పటికీ ప్రత్యేకమైన అభిమాన గణం ఉంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


