కొత్త హీరోయిన్లకు షుగర్ డాడీ కావాలి, ట్రాప్ చేసి బ్లాక్‌మెయిల్‌కు దిగుతారు- స్టార్ హీరో గోవిందా ఎఫైర్స్‌పై భార్య సునీత

బాలీవుడ్ స్టార్ హీరో గోవిందా వ్యక్తిగత జీవితంపై ఆయన భార్య సునీత ఆహుజా మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్టార్లను యువ నటీమణులు ఎలా ట్రాప్ చేస్తారో వివరిస్తూనే, ఈ వయసులో గోవిందా ప్రవర్తనపై తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం వల్ల ఎదుగుతున్న పిల్లలు డిస్టర్బ్ అయ్యారని సునీత తెలిపారు.

Published on: Jan 26, 2026, 12:03:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ సీనియర్ హీరో గోవిందా వైవాహిక జీవితంలోని విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. గోవిందాకు వివాహేతర సంబంధాలు ఉన్నట్లుగా చెబుతున్న ఆయన భార్య సునీత ఆహుజా తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సంచలన నిజాలను పంచుకున్నారు. నేటి తరం నటీమణులపై విమర్శలు చేస్తూనే, తన భర్త తీరును కూడా ఆమె తప్పుపట్టారు.

కొత్త హీరోయిన్లకు షుగర్ డాడీ కావాలి, ట్రాప్ చేసి బ్లాక్‌మెయిల్‌కు దిగుతారు- స్టార్ హీరో గోవిందా ఎఫైర్స్‌పై భార్య సునీత
కొత్త హీరోయిన్లకు షుగర్ డాడీ కావాలి, ట్రాప్ చేసి బ్లాక్‌మెయిల్‌కు దిగుతారు- స్టార్ హీరో గోవిందా ఎఫైర్స్‌పై భార్య సునీత

హీరోయిన్ల ట్రాప్.. బ్లాక్‌మెయిలింగ్!

మిస్ మాలినితో జరిగిన సంభాషణలో సునీత మాట్లాడుతూ చిత్ర పరిశ్రమలోకి వచ్చే కొత్త హీరోయిన్ల తీరుపై విరుచుకుపడ్డారు. "నేటి కాలంలో స్ట్రగుల్స్‌తో వచ్చే చాలా మంది అమ్మాయిలకు తమ ఖర్చులు భరించడానికి ఒక ‘షుగర్ డాడీ’ కావాలి. సరైన రూపం లేకపోయినా హీరోయిన్లు అయిపోవాలని కలలు కంటారు. అలాంటి వారు స్టార్లను ట్రాప్ చేసి, ఆ తర్వాత బ్లాక్‌మెయిల్‌కు దిగుతుంటారు" అని సునీత ఆవేదన వ్యక్తం చేశారు.

63 ఏళ్ల వయసులో ఇవన్నీ ఏంటి?

గోవిందాతో తనకున్న 38 ఏళ్ల బంధం గురించి ప్రస్తావిస్తూ సునీత సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించారు. "నీకు (గోవిందా) ఇప్పుడు 63 ఏళ్లు. నీ పిల్లలు పెద్దవారయ్యారు. నీకు ఒక అందమైన భార్య, చక్కని కుటుంబం ఉంది" అని సునీత అహుజా అన్నారు.

"యవ్వనంలో తప్పులు చేయడం వేరు, ఆ వయసులో ఏవైనా చేసి ఉంటే అర్థం ఉంటుంది. కానీ, ఈ వయసులో కూడా ఇలాంటివి చేయడం ఏమాత్రం సమంజసం కాదు. ఇలాంటి పనుల వల్ల ఎదుగుతున్న పిల్లలు మానసికంగా కృంగిపోతారు" అని సునీత అహుజా పేర్కొన్నారు. గోవిందా తన వయసుకు తగ్గట్టుగా నడుచుకోవాలని ఆమె హితవు పలికారు.

గోవిందా కౌంటర్: ‘ఇదొక పెద్ద కుట్ర’

తనపై వస్తున్న ఈ ఆరోపణలను స్టార్ హీరో గోవిందా తీవ్రంగా ఖండించారు. ఏఎన్ఐ (ANI) వార్తా సంస్థతో మాట్లాడుతూ గోవిందా తన వాదనను వినిపించారు.

"మనం మౌనంగా ఉంటే అది మన బలహీనత అనుకుంటారు లేదా మనమే తప్పు చేశామని భావిస్తారు. అందుకే ఈరోజు స్పందిస్తున్నాను. నా కుటుంబ సభ్యులకు తెలియకుండానే వారు ఒక పెద్ద కుట్రలో భాగస్వాములవుతున్నారు. సునీతను ఎవరో కావాలనే రెచ్చగొట్టి ఫీల్డ్‌లోకి ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా దింపారు. ఆమెకు తెలియకుండానే ఒక పెద్ద కుట్రలో చిక్కుకుంది" అని గోవిందా ఆరోపించారు.

హాట్ టాపిక్‌గా

కాగా, భార్యాభర్తల మధ్య మొదలైన ఈ మాటల యుద్ధం ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలోనూ సునీత ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ, ఈసారి ఆమె ఏకంగా గోవిందా వయసును, బాధ్యతను గుర్తు చేయడం చర్చకు దారితీసింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More