ఇంగ్లీష్‌లో కూడా రిలీజ్ అవుతున్న కాంతార చాప్టర్ 1.. 39 నిమిషాల సీన్స్ గోవిందా.. ప్రభాస్, రవితేజతో బాక్సాఫీస్ పోటీ!
బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతున్న కన్నడ చిత్రం కాంతార చాప్టర్ 1 ఇంగ్లీష్‌లో కూడా రిలీజ్ కానుంది. రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన కాంతార 2 సినిమా ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. అయితే, ఇంగ్లీష్ వెర్షన్‌కు సుమారుగా 39 సన్నివేశాలను ఎత్తివేశారని సమాచారం.
రిషబ్ శెట్టి బిగ్గెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సినిమా కాంతార: చాప్టర్ 1. ప్రఖ్యాత పాన్-ఇండియా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదలైన అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని ఘన విజయాన్ని అందుకుంది.

విజువల్ వండర్‌గా కాంతార 2
రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో కొత్త బెంచ్ మార్క్‌ని క్రియేట్ చేసింది కాంతా 2. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించిన కాంతార చాప్టర్ 1 విజువల్ వండర్‌గా ప్రేక్షకులని మెస్మరైజ్ చేస్తోంది. ప్రేక్షకులు విమర్శకుల నుంచి అద్భుతమైన ప్రశంసలు అందుకుంది.
కాంతార చాప్టర్ 1 ఇంగ్లీష్ వెర్షన్
ఇప్పుడీ సినిమా మరో మైల్ స్టోన్ క్రియేట్ చేసింది. ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో కాంతార చాప్టర్ 1 విడుదల కానుంది. అక్టోబర్ 31న కాంతార 2 ఇంగ్లీష్ వెర్షన్ వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. దీంతో ప్రభాస్, రానా దగ్గుబాటితోపాటు రవితేజ సినిమాలతో రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 బాక్సాఫీస్ పోటీకి సిద్ధమైంది.
మరో రెండు సినిమాలు
ఎందుకంటే అక్టోబర్ 31నే బాహుబలి ది ఎపిక్ మూవీ వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ రెండు పార్ట్స్‌ను ఒకే మూవీగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతోపాటు అక్టోబర్ 31న రవితేజ మాస్ జాతర కూడా థియేట్రికల్ రిలీజ్ కానుంది.
బాక్సాఫీస్ పోటీ
ఇలా, అక్టోబర్ 31న బాహుబలి ది ఎపిక్, మాస్ జాతర, కాంతార చాప్టర్ 1 ఇంగ్లీష్ వెర్షన్ మూడు రిలీజ్ అవుతూ బాక్సాఫీస్ పోటీకి తెరలేపాయి. అయితే, ఈ లేటెస్ట్ వెర్షన్‌లో కాంతార చాప్టర్ 1 రన్‌టైమ్‌ను తగ్గించారు. కాంతార 2 అసలైన రన్‌టైమ్ 169 నిమిషాలు. అంటే రెండు గంటల 19 నిమిషాలు.
కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్
కానీ, ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ కోసం ఏకంగా 39 నిమిషాల సీన్స్ ఎత్తివేశారు. అంటే ఆ సన్నివేశాలకు కత్తెర పడింది. దీంతో కాంతార చాప్టర్ 1 ఇంగ్లీష్ వెర్షన్ రన్ టైమ్ 2 గంటల 14 నిమిషాలుగా మారింది. ఇకపోతే కాంతార: చాప్టర్ 1 తెలుగులో రూ. 100 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 800 కోట్లు కలెక్ట్ చేసింది.
కాంతారకు ప్రీక్వెల్‌గా
కన్నడ బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచిన కాంతార చాప్టర్ 1 అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కాంతార సినిమాకు ప్రీక్వెల్‌గా తెరకెక్కిన కాంతార: చాప్టర్ 1 ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తూ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


