Kangana Kiss:తన వికృతమైన సెక్స్ ఫాంటసీలను తీర్చుకోవడానికి మనల్ని వాడుకుంటుంది- లేడి జర్నలిస్ట్‌ను ఏకిపారేసిన కంగనా రనౌత్

Kangana Ranaut Kiss Scene Controversy: రివాల్వర్ రాణిలో సహనటుడు వీర్ దాస్ పెదవి కొరికి గాయపరిచానంటూ వస్తున్న రూమర్లపై బాలీవుడ్ హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించారు. ఆ వార్తలను వీర్ దాస్ ఖండించగా, సదరు జర్నలిస్ట్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కంగనా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Jun 29, 2026, 09:54:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Kangana Ranaut Kiss Scene Controversy: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, పార్లమెంట్ సభ్యురాలు కంగనా రనౌత్ మరోసారి తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఈసారి ఆమె పదేళ్ల నాటి పాత వివాదంపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు.

తన వికృతమైన సెక్స్ ఫాంటసీలను తీర్చుకోవడానికి మనల్ని వాడుకుంటుంది- లేడి జర్నలిస్ట్‌ను ఏకిపారేసిన కంగనా రనౌత్
తన వికృతమైన సెక్స్ ఫాంటసీలను తీర్చుకోవడానికి మనల్ని వాడుకుంటుంది- లేడి జర్నలిస్ట్‌ను ఏకిపారేసిన కంగనా రనౌత్

హీరోతో ముద్దు సీన్ వివాదం

2014లో విడుదలైన ‘రివాల్వర్ రాణి’ సినిమాలో సహ నటుడు, హీరో వీర్ దాస్‌తో చేసిన ఓ ముద్దు సీన్‌కు సంబంధించిన రూమర్లు నెట్టింట హల్‌చల్ చేయడమే ఇందుకు కారణం. ఈ కిస్ సీన్ వల్ల వీర్ దాస్ గాయపడ్డారంటూ వస్తున్న వార్తలను ఆయన స్వయంగా ఖండించడంతో, కంగనా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూనే సదరు వార్తలను వ్యాప్తి చేసిన జర్నలిస్ట్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

సిమీ చందోక్ కామెంట్స్

ఈ వివాదం ఎలా మొదలైందంటే.. ఇటీవల ఒక ప్రముఖ పాడ్‌కాస్ట్‌లో సీనియర్ జర్నలిస్ట్ సిమీ చందోక్ ‘రివాల్వర్ రాణి’ షూటింగ్ విశేషాలను పంచుకున్నారు. దర్శకుడు కట్ చెప్పినప్పటికీ కంగనా రనౌత్ ఆపకుండా వీర్ దాస్‌ను ముద్దు పెట్టుకుంటూనే ఉన్నారని, ఆ క్రమంలో ఆయన పెదవి తెగేలా కొరకడంతో రక్తం వచ్చిందని ఆమె ఆరోపించారు.

ఈ సంఘటనతో వీర్ దాస్ తీవ్ర దిగ్భ్రాంతికి, మానసిక వేదనకు లోనయ్యారని సదరు జర్నలిస్ట్ పేర్కొన్నారు. ఈ పాత ఇంటర్వ్యూ క్లిప్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.

అదంతా పచ్చి అబద్ధం: వీర్ దాస్ క్లారిటీ

ఈ వైరల్ ప్రచారంపై నటుడు, స్టాండప్ కమెడియన్ వీర్ దాస్ స్పందిస్తూ సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. కంగనా రనౌత్ ప్రొఫెషనలిజంను ఆయన పూర్తిగా సమర్థించారు.

"ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదు, ఇదంతా పచ్చి అబద్ధం. కంగనా సెట్స్‌లో ఎంతో ప్రొఫెషనల్‌గా ప్రవర్తించారు. ఆమె అద్భుతమైన నటి. ఇలాంటి రూమర్లతో ఆమె ప్రతిష్టను దెబ్బతీయడం తగదు. ఆ తర్వాత కొన్నేళ్లకు నా కామెడీ చూసి నన్ను టెర్రరిస్ట్ అని అన్నప్పటికీ, షూటింగ్ సెట్స్‌లో మాత్రం మా మధ్య ఎలాంటి ఇబ్బందులు లేవు" అని వీర్ దాస్ స్పష్టం చేశారు.

వికృతమైన ఫాంటసీలు.. కంగనా ఘాటు కౌంటర్

వీర్ దాస్ ఇచ్చిన వివరణపై కంగనా రనౌత్ స్పందిస్తూ సదరు జర్నలిస్ట్‌ను ఏకిపారేశారు. తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో వీర్ దాస్ పోస్ట్‌ను షేర్ చేస్తూ తీవ్ర పదజాలంతో విమర్శించారు.

"థాంక్స్ వీర్ దాస్, ఇంతకీ ఎవరామె? తన వికృతమైన సెక్స్ ఫాంటసీలను తీర్చుకోవడానికి మనల్ని వాడుకుంటున్న ఒక వింత మనిషిలా అనిపిస్తోంది. నేను నీ రక్తం తాగేసానట, పదేళ్లయినా నువ్వు ఇంకా ఏడుస్తూనే ఉన్నావట.. ఎంత హాస్యాస్పదంగా ఉందో కదా" అని కంగనా వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

బాక్సాఫీస్ వద్ద 'రివాల్వర్ రాణి' ప్రస్థానం

కాగా సాయి కబీర్ శ్రీవాస్తవ దర్శకత్వంలో 2014లో వచ్చిన ‘రివాల్వర్ రాణి’ సినిమాలో కంగనా రనౌత్ ఒక డేరింగ్ అండ్ డాషింగ్ రోల్ పోషించారు. వీర్ దాస్ ఆమెను ప్రేమించే ఒక అప్ కమింగ్ హీరో పాత్రలో కనిపించారు.

పియూష్ మిశ్రా, జాకీర్ హుస్సేన్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. సుమారు రూ. 22 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 13 కోట్లు మాత్రమే వసూలు చేసి డిజాస్టర్‌గా నిలిచింది.

కంగనా లేటెస్ట్ ప్రాజెక్ట్ విశేషాలు

కంగనా రనౌత్ ఇటీవలే 'భారత్ భాగ్య విధాత' చిత్రంలో కనిపించారు. మనోజ్ తపడియా రచన, దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను పెన్ స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి.

2008 ముంబై ఉగ్రదాడుల సమయంలో 20 మంది గర్భిణుల ప్రాణాలను కాపాడిన ధీర వనిత, నర్స్ అంజలి కుల్తే (సినిమాలో గీతా మాధవ్ గాంధారే) జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాలో కంగనాతో పాటు ఈషా దేవ్, గిరిజా ఓక్ కీలక పాత్రల్లో నటించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More