Chaithra J Achar: నువ్వు హీరోయిన్‌వా లేక సెక్స్ వర్కరా? నటి చైత్రకు పోలీస్ కామెంట్- సింగర్ పనితో నెటిజన్ క్షమాపణలు
Actress Chaithra J Achar Get Harassment: సప్త సాగరాలు దాటి, 3బీహెచ్‌కే సినిమాలతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటి, సింగర్ చైత్ర జే ఆచార్ సోషల్ మీడియాలో వేధింపులకు గురి అయ్యారు. నువ్వు హీరోయిన్‌వా లేక సెక్స్ వర్కరా అని కామెంట్ చేసిన పోలీస్‌తోనే క్షమాపణలు చెప్పించుకున్నారు చైత్ర.
Actress Chaithra J Achar Get Harassment: సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలను, అందులోనూ నటీమణులను టార్గెట్ చేస్తూ అసభ్యకర కామెంట్లు చేయడం కొందరికి అలవాటుగా మారింది. ఇలాంటి ట్రోలర్స్ పట్ల సైలెంట్‌గా ఉండకుండా, వారికి గట్టి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు కన్నడ నటి, సింగర్ అయిన చైత్ర జే ఆచార్. తన రూపాన్ని, గౌరవాన్ని తక్కువ చేస్తూ మాట్లాడిన ఒక నెటిజన్‌కు ఆమె ఇచ్చిన రిప్లై ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

పోలీస్ యూనిఫామ్‌తో
సూపర్ హిట్ కన్నడ సినిమాలు'సప్త సాగరదాచే ఎల్లో – సైడ్ ఏ, బి (సప్తసాగరాలు దాటి సినిమాలు)', సిద్ధార్థ్ తమిళ మూవీ '3BHK' ద్వారా గుర్తింపు తెచ్చుకున్న చైత్ర జే ఆచార్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టుపై పోలీస్ యూనిఫామ్‌తో ఉన్న ఓ వ్యక్తి అత్యంత దారుణమైన కామెంట్ చేశాడు. "@hosamani53" అనే హ్యాండిల్‌తో ఉన్న ఆ అకౌంట్‌కు ఒక పోలీస్ ఆఫీసర్ ప్రొఫైల్ పిక్చర్ (DP) ఉంది. "నువ్వు హీరోయిన్‌వా లేక సెక్స్ వర్కర్‌వా? పద్ధతిగా ప్రవర్తించడం నేర్చుకో" అంటూ కన్నడ భాషలో అసభ్య పదజాలంతో ఆ పోలీస్ కామెంట్ చేశాడు.
దీనికి చైత్ర అస్సలు భయపడలేదు. వెంటనే ఆ కామెంట్‌ను స్క్రీన్‌షాట్ తీసి, బెంగళూరు సిటీ పోలీస్ అధికారిక హ్యాండిల్‌కు ట్యాగ్ చేశారు చైత్ర ఆచార్. "గౌరవనీయులైన బెంగళూరు సిటీ పోలీస్.. ఈ అకౌంట్ మీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన వ్యక్తిదే అనుకుంటా. దయచేసి ఇతనికి మీరే సమాధానం చెప్పగలరా?" అని సింగర్ చైత్ర ప్రశ్నించారు.
రంగంలోకి దిగిన పోలీసులు.. తోక ముడిచిన ట్రోలర్
నటి చైత్ర చేసిన ఈ ఒక్క పోస్ట్‌తో బెంగళూరు పోలీసులు అలర్ట్ అయ్యారు. సదరు ప్రొఫైల్ పిక్చర్‌లో ఉన్న వ్యక్తి నిజంగానే పోలీస్ శాఖలో పనిచేస్తున్నాడా? లేక ఖాకీ యూనిఫామ్ ఫోటో పెట్టుకుని తప్పుదోవ పట్టిస్తున్నాడా? అనే కోణంలో అంతర్గతంగా విచారణ ప్రారంభించారు.
పోలీసులు రంగంలోకి దిగారనే విషయం తెలియడంతో సదరు నెటిజన్ తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. వెంటనే తను పెట్టిన అసభ్యకర కామెంట్‌ను డిలీట్ చేయడమే కాకుండా, కామెంట్ సెక్షన్‌లోనే సింగర్ చైత్రకు క్షమాపణలు చెబుతూ మెసేజ్ పెట్టాడు.
ఈ విషయమై ఒక సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. "ఇలాంటి అసభ్య కామెంట్లు పెట్టడం నేరమే. అయితే సదరు వ్యక్తి మా డిపార్ట్‌మెంట్‌కు చెందినవాడు కాదు. ప్రస్తుతం ఈ ఘటనపై ఎలాంటి అధికారిక కేసు నమోదు కాలేదు, కానీ సదరు వ్యక్తి తన తప్పు తెలుసుకుని నటికి క్షమాపణలు చెప్పాడు" అని స్పష్టం చేశారు.
కన్నడ ఇండస్ట్రీలో వరుస వేధింపులు
ఇదిలా ఉంటే, నటీమణులపై సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యవస్థీకృత వేధింపులకు ఈ ఘటన ఒక ఉదాహరణ మాత్రమే. గతంలోనూ పలువురు కన్నడ నటీమణులు తీవ్రమైన సైబర్ దాడులను ఎదుర్కొన్నారు. 2025 జూలైలో సీనియర్ నటి, మాజీ ఎంపీ రమ్య (దివ్య స్పందన) తీవ్రమైన వేధింపులను ఎదుర్కొన్నారు.
నటుడు దర్శన్ నిందితుడిగా ఉన్న రేణుకా స్వామి హత్య కేసుపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఆమె స్వాగతించినందుకు నెటిజన్లు ఆమెకు అత్యాచార, హత్య బెదిరింపులు చేశారు. ఈ కేసులో బెంగళూరు పోలీసులు రంగంలోకి దిగి సీసీబీ (Central Crime Branch) సాయంతో డజనుకు పైగా నిందితులను అరెస్ట్ చేసి, ఏకంగా 380 పేజీల చార్జ్‌షీట్ దాఖలు చేశారు.
రజినికి అశ్లీల వీడియోలు, సందేశాలు
అలాగే బుల్లితెర నటి రజిని కూడా ఫేక్ అకౌంట్ల ద్వారా నెలల తరబడి సైబర్ వేధింపులకు గురయ్యారు. ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆమెకు అశ్లీల వీడియోలు, సందేశాలు పంపేవాడు. పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని ట్రాక్ చేయగా, అతను ఒక టెక్ రిక్రూట్‌మెంట్ మేనేజర్‌గా తేలడంతో అరెస్ట్ చేశారు.
ఈ ఏడాది ప్రారంభంలో నటి కారుణ్య రామ్ కూడా తనపై జరుగుతున్న దుష్ప్రచారాలపై సీసీబీని ఆశ్రయించారు. మరో నటి మానసి జోషి పేరుతో ఫేక్ ప్రొఫైల్స్ సృష్టించి ఆమె ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించగా ఆమె సైతం గట్టి పోరాటం చేశారు.
ట్రోలర్ల అరాచకాలకు
సోషల్ మీడియా అనేది సెలబ్రిటీలతో నేరుగా మాట్లాడేందుకు ఇచ్చిన వేదిక మాత్రమే కానీ, వారిని వేధించడానికి కాదనే విషయాన్ని చైత్ర ఆచార్ మరోసారి నిరూపించారు. ట్రోలర్ల అరాచకాలకు భయపడకుండా చట్టపరంగా స్పందిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో ఈ ఘటన స్పష్టం చేస్తోంది.

ఏ చిత్ర పరిశ్రమలో అయినా నటీమణులు ఇలాంటి వేధింపులు ఎదుర్కొన్నప్పుడు ధైర్యంగా ముందుకు రావడం వల్ల సైబర్ నేరగాళ్లకు అడ్డుకట్ట వేయవచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


