OTT Medical Thriller: ఓటీటీలోకి రియల్ హీరోల కథ- కామా ఆసుపత్రి సిబ్బంది యథార్థ గాథ- 7 రేటింగ్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Bharat Bhhagya Viddhaata OTT Streaming: ముంబై 26/11 ఉగ్రదాడుల నేపథ్యంలో కామా ఆసుపత్రి సిబ్బంది చూపించిన అసాధారణ ధైర్యసాహసాల ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'భారత్ భాగ్య విధాత'. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మెడికల్ సర్వైవల్ థ్రిల్లర్ భారత్ భాగ్య విధాత ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలపై లుక్కేద్దాం.

Published on: Aug 7, 2026, 21:26:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bharat Bhhagya Viddhaata OTT Release: దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన ముంబై 26/11 ఉగ్రదాడుల వెనుక ఎన్నో భయానక దృశ్యాలు, మరెన్నో త్యాగాల కథలు దాగున్నాయి. సరిహద్దుల్లో పోరాడే సైనికుల శౌర్యాన్ని సమాజం గుర్తించినట్లే, క్లిష్ట సమయంలో తుపాకుల మోతల మధ్య రోగుల ప్రాణాలు కాపాడిన సామాన్య ఆసుపత్రి సిబ్బంది కథ ఆధారంగా రూపొందిన చిత్రం 'భారత్ భాగ్య విధాత' (Bharat Bhhagya Viddhaata).

ఓటీటీలోకి రియల్ హీరోల కథ- కామా ఆసుపత్రి సిబ్బంది యథార్థ గాథ- 7 రేటింగ్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి రియల్ హీరోల కథ- కామా ఆసుపత్రి సిబ్బంది యథార్థ గాథ- 7 రేటింగ్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఐఎమ్‌డీబీ రేటింగ్

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, ఎంపీ కంగనా రనౌత్ కీలక పాత్రలో నటించిన భారత్ భాగ్య విధాత సినిమా జూన్ 12న థియేటర్లలో విడుదలైంది. విమర్శకుల ప్రశంసలు పొందినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఐఎమ్‌డీబీలో 7 రేటింగ్ సంపాదించుకున్న భారత్ భాగ్య విధాత ఓటీటీలోకి వచ్చేయనుంది.

కామా ఆసుపత్రి కాళరాత్రి.. అసలు కథ ఇదే

2008 నవంబర్ 26న ముంబైపై ఉగ్రవాదులు విరుచుకుపడిన సమయంలో కామా అండ్ ఆల్బ్‌లెస్ మహిళా ఆసుపత్రి ప్రాంగణంలోకి టెర్రరిస్టులు చొరబడ్డారు. ఆ సమయంలో లోపల ఉన్న గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులను కాపాడేందుకు అక్కడ విధులు నిర్వహిస్తున్న నర్సులు, వార్డు బాయ్స్, సఫాయి కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టారు.

కంగనా, గిరిజా పాత్రలు

మెడికల్ సర్వైవల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన భారత్ భాగ్య విధాత సినిమాలో కంగనా రనౌత్ గీతా మాధవ్ గంధారే అనే సీనియర్ నర్సు పాత్రలో కనిపించగా, సోషల్ మీడియా సెన్సేషన్ గిరిజా ఓక్, స్మితా తాంబే ఇతర కీలక పాత్రలు పోషించారు.

కంగనా రనౌత్ కామెంట్స్

"కొన్ని కథలు ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంటుంది, అందుకే ఈ చిత్రాన్ని మేం ఎంచుకున్నాం. ఉగ్రవాదులు విరుచుకుపడిన ఆ కాళరాత్రి వేళ, వైద్య సిబ్బంది స్వార్థం లేకుండా చూపించిన మానవత్వం, ధైర్యం భారతీయ ఆత్మకు ప్రతీక. సరిహద్దుల్లోనే కాదు, ప్రాణాపాయ స్థితిలో సామాన్యులు చూపించే అంకితభావం కూడా దేశభక్తే" అని కంగనా రనౌత్ ప్రమోషన్స్ సమయంలో తెలిపారు.

భారత్ భాగ్య విధాత కలెక్షన్స్

భారత్ భాగ్య విధాత సినిమాకు మనోజ్ తపాడియా దర్శకత్వం వహించారు. డైరెక్టర్ మనోజ్ తపాడియా ఈ చిత్రాన్ని అత్యంత ఉద్వేగభరితంగా తీర్చిదిద్దారు. పెన్ స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్స్ సమర్పణలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ. 7.04 కోట్లు నెట్ సాధించగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 8.32 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే వసూలు చేసింది.

భారత్ భాగ్య విధాత ఓటీటీ స్ట్రీమింగ్

స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 14 నుంచి ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ జీ5లో భారత్ భాగ్య విధాత ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. భారత్ భాగ్య విధాత ఓటీటీ రిలీజ్ సందర్బంగా మేకర్స్ కొత్త ట్రైలర్ విడుదల చేసి అధికారికంగా ప్రకటించారు.

జీ5 ఓటీటీలో

భయానక వాతావరణంలో, ప్రాణాలకు తెగించి కష్టపడిన నర్సులు, కామా ఆసుపత్రి సిబ్బంది యథార్థ గాథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం ట్రైలర్‌లో చూడొచ్చు. థియేటర్లలో మిస్ అయిన వారికి ఈ అన్-సంగ్ హీరోల కథను జీ5 ఓటీటీలో భారత్ భాగ్య విధాత సినిమా ద్వారా చూడొచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More