OTT Survival: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో నేరుగా సర్వైవల్ హారర్ థ్రిల్లర్- చీకటి గుహలో రాక్షస వేట- తెలుగులో స్ట్రీమింగ్!

The Devils Mouth OTT Release Telugu: చీకటి గుహలో చిక్కుకున్న ఐదుగురు స్నేహితులను వెంటాడే రాక్షస చేప కథ ఆధారంగా తీసిన సర్వైవల్ హారర్ థ్రిల్లర్ సినిమా ది డెవిల్స్ మౌత్ ఓటీటీలోకి నేరుగా మరికొన్ని గంటల్లో రానుంది. తెలుగులో అందుబాటులో ఉండే ది డెవిల్స్ మౌత్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jul 28, 2026, 14:43:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

The Devils Mouth OTT Streaming In Telugu: ఓటీటీ ప్రియులకు సర్వైవల్ హారర్ థ్రిల్లర్ సినిమాలంటే ఉండే క్రేజే వేరు. ముఖ్యంగా నీటి అడుగున సాగే భయాందోళనలు, ప్రాణాల కోసం సాగే వేట, అడ్వెంచర్ నేపథ్య కథలకు తెలుగు ఓటీటీ లవర్స్ నుంచి కూడా ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తుంది.

ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో నేరుగా సర్వైవల్ హారర్ థ్రిల్లర్- చీకటి గుహలో రాక్షస వేట- తెలుగులో స్ట్రీమింగ్
ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో నేరుగా సర్వైవల్ హారర్ థ్రిల్లర్- చీకటి గుహలో రాక్షస వేట- తెలుగులో స్ట్రీమింగ్

ఊపిరి బిగపట్టేలా చేసే

'47 మీటర్స్ డౌన్', 'ది మెగ్' వంటి చిత్రాలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సంచలనం సృష్టించాయి. ఇప్పుడు అదే కోవలో ఊపిరి బిగపట్టేలా చేసే మరొక సర్వైవల్ మిస్టరీ హారర్ థ్రిల్లర్ సినిమా 'ది డెవిల్స్ మౌత్' (The Devil's Mouth) ఓటీటీలో నేరుగా అలరించడానికి సిద్ధమైంది.

చీకటి గుహలో రాక్షస వేట!

సరదాగా సాగిన ఒక విహారయాత్ర కాస్తా ప్రాణాలు కాపాడేందుకు చేసే పోరాటంగా ఎలా మారిందో చూపించడమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం. ఐదుగురు కళాశాల స్నేహితులు తమ చదువు పూర్తయ్యాక చివరిసారిగా సరదాగా గడపడానికి థాయిలాండ్ సముద్ర తీరానికి వెళ్తారు.

అక్కడ 'ది డెవిల్స్ మౌత్' అని పిలిచే ఒక రహస్యమైన చీకటి గుహలో ఈత కొట్టడానికి వెళ్లడమే వారు చేసిన పెద్ద పొరపాటు. తీరంలో వచ్చిన ఒక పెద్ద తుఫాను కారణంగా సముద్రంలోని ఉప్పునీటి జీవులు ఈ మంచినీటి గుహల్లోకి కొట్టుకొస్తాయి.

బతికుండే రాక్షస చేప

మిగిలిన నీటి జీవులన్నీ చనిపోయినా, ఒక ప్రమాదకరమైన క్రూరమైన రాక్షస చేప (సొరచేప) మాత్రం అక్కడ సజీవంగా మిగులుతుంది. చీకటి గుహలు, తగ్గుతున్న ఆక్సిజన్ పరిమాణం, బయటకు వెళ్లేందుకు దొరకని దారి, ఇరుకైన మార్గాలు.. వీటన్నింటి మధ్య ఆ క్రూర జలచరం ఈ స్నేహితులను వేటాడటం ప్రారంభిస్తుంది.

హాలీవుడ్ యంగ్ స్టార్ల హంగామా

మరి ఆ రాక్షస చేప వేట నుంచి వారు తప్పించుకున్నారా? ఎంతమంది బలయ్యారు? అనేదే ది డెవిల్స్ మౌత్ కథ. ఈ సినిమాలో కాథరిన్ న్యూటన్, లారా కాండోర్, గావిన్ కాసాలెగ్నో, నికో హిరాగా, తొమ్మి రోజ్, తాయ్మే థాప్తిమ్‌థాంగ్ ప్రధాన పాత్రల్లో నటించారు.

'ఇమాజినరీ', 'ట్రూత్ ఆర్ డేర్' వంటి క్రేజీ థ్రిల్లర్ చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకుడు జెఫ్ వాడ్లో (Jeff Wadlow) ఈ ది డెవిల్స్ మౌత్ సినిమాకు దర్శకత్వం వహించారు. 'జాన్ విక్' సిరీస్ చిత్రాల నిర్మాత బాసిల్ ఇవానిక్‌తో పాటు ఎరికా లీ ఈ మూవీని నిర్మించారు.

ఇరుకైన గుహల్లో ఉండే భయం

"ఇది కేవలం ఒక సముద్రపు రాక్షసి నుంచి తప్పించుకునే కథ మాత్రమే కాదు, ఊపిరి ఆడని ఇరుకైన గుహల్లో ప్రాణభయంతో ఉన్నప్పుడు స్నేహితుల మధ్య వచ్చే విబేధాలను, మానసిక సంఘర్షణను ప్రతిబింబించే డ్రామా" అని చిత్ర బృందం ది డెవిల్స్ మౌత్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇస్తూ పేర్కొంది.

ఇంతటి హారర్, సస్పెన్స్, అడ్వెంచర్, డ్రామా, స్నేహం వంటి అన్ని ఎమోషన్స్, ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ది డెవిల్స్ మౌత్ ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో నేరుగా విడుదల కానుంది. అమెజాన్ ప్రైమ్‌లో జూలై 29 అర్థరాత్రి నుంచి ప్రైమ్ వీడియోలో ది డెవిల్స్ మౌత్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

ది డెవిల్స్ మౌత్ ఓటీటీ రిలీజ్

అంటే, దానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఇంగ్లీష్‌లో మాత్రమే కాకుండా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం వంటి 6 భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో ది డెవిల్స్ మౌత్ ఓటీటీ రిలీజ్ అవనుంది. నీటిలో హారర్, అడ్వెంచర్, సర్వైవల్ ఎలిమెంట్స్ నచ్చేవారికి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ది డెవిల్స్ మౌత్ చూసేందుకు బెస్ట్ ఆప్షన్.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More