OTT: ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీ- హారర్, కామెడీ, ఫాంటసీ, యాక్షన్, నిధి, అడ్వెంచర్ అన్ని రకాల ఎలిమెంట్స్‌తో- 7 రేటింగ్!
Dhamaal 4 OTT Streaming: సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటోన్న ధమాల్ 4 ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. అజయ్ దేవగన్, రితేష్ దేశ్‌ముఖ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ క్రేజీ మూవీ ఇప్పటికే 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇలాంటి ధమాల్ 4 ఓటీటీ రిలీజ్ పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
Dhamaal 4 OTT Release: బాలీవుడ్‌లో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ‘ధమాల్’ సిరీస్ నుంచి మరో క్రేజీ మూవీ వచ్చేసింది. మోస్ట్ అవేటెడ్ ఫ్రాంచైజీ ‘ధమాల్ 4’ జూలై 10న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది.

క్రేజీ హంట్ బ్యాక్‌డ్రాప్
ప్రముఖ దర్శకుడు ఇంద్ర కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం.. పాత పాత్రలతో పాటు సరికొత్త కన్ఫ్యూజన్ డ్రామాతో ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగు ప్రేక్షకులకు కూడా అజయ్ దేవగన్, రితేష్ దేశ్‌ముఖ్, అర్షద్ వార్సీల కామెడీ టైమింగ్ అంటే చాలా ఇష్టం.
గతంలో వచ్చిన ఈ సిరీస్ మూడు భాగాలు ఆడియన్స్‌ను విపరీతంగా నవ్వించాయి. ఇప్పుడు నాలుగో భాగం కూడా అదే తరహా క్రేజీ ట్రెజర్ హంట్ (నిధి అన్వేషణ) బ్యాక్‌డ్రాప్‌తో థియేటర్లలోకి వచ్చి నవ్వులు పూయిస్తోంది.
ఐఎమ్‌డీబీ రేటింగ్
థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తోంది. ఇదొక పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని, పాత జ్ఞాపకాలను గుర్తుచేసిందని ఆడియెన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఐఎమ్‌డీబీ నుంచి ధమాల్ 4 సినిమాకు 7 రేటింగ్ వచ్చింది.
కలెక్షన్ల పరంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించింది. రిలీజైన నాలుగు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ. 102.83 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టింది ధమాల్ 4 సినిమా. హారర్, కామెడీ, అడ్వెంచర్, యాక్షన్, ఫాంటసీ, ఫ్యామిలీ డ్రామా ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్‌తో ధమాల్ 4 సినిమాను తెరకెక్కించారు.
అసలు కథేంటంటే?
ఈసారి కథ కూడా ఒక రహస్య నిధి చుట్టూనే తిరుగుతుంది. యాంటిక్ షాప్ నడిపే గుడ్డు, జానీలకు పృథ్వీ అనే వ్యక్తి దగ్గర ఒక అద్భుతమైన నిధికి సంబంధించిన రహస్యం ఉందని తెలుస్తుంది. కానీ, వారు ఆ నిధిని కనిపెట్టేలోపే 'అధూరా' అనే ఒక విచిత్రమైన సముద్రపు దొంగ పృథ్వీని కిడ్నాప్ చేసి, నిధి మ్యాప్‌ను ముక్కలు ముక్కలు చేస్తాడు.
ನಿధి ఎక్కడుందో తెలిసిన ఏకైక వ్యక్తి పృథ్వీ కావడంతో అతడిని పట్టుకోవడానికి అందరూ రేసు గుర్రాల్లా పరిగెడతారు. ఈ రేసులోకి ఆది, మానవ్, లల్లన్ కూడా ప్రవేశించడంతో కథ పూర్తిగా మలుపులు తిరుగుతుంది. అడవుల్లో సాగే ప్రయాణం, ఛేజింగ్ సీన్లు, 'M' అనే అక్షరం కింద దాగున్న ఆ రహస్య నిధిని దక్కించుకోవడానికి ఒకరినొకరు మోసంచేసుకుంటూ చేసే విచిత్రమైన తప్పులు థియేటర్లలో నవ్వులు పూయిస్తున్నాయి.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో
ఇలాంటి ధమాల్ 4 ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఫిక్స్ అయింది. ధమాల్ 4 ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన నెట్‌ఫ్లిక్స్‌లో ధమాల్ 4 ఓటీటీ రిలీజ్ అవనుందన్నమాట. సాధారణంగా బాలీవుడ్ చిత్రాలు థియేటర్లలో విడుదలైన ఆరు నుంచి ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలోకి వస్తుంటాయి.
ఆ లెక్కన చూసుకుంటే ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ నెలలో ధమాల్ 4 నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతం ఉన్న విశ్వసనీయ సమాచారం ప్రకారం సెప్టెంబర్ 4 అర్థరాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ధమాల్ 4 ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


