Jana Nayagan Collection: రెండో రోజే సగానికిపైగా పడిపోయిన సీఎం విజయ్ జన నాయగన్ కలెక్షన్స్-2 డేస్ బాక్సాఫీస్ రిపోర్ట్ ఇలా!
Jana Nayagan Box Office Collection Day 2: తమిళనాడు సీఎం విజయ్ చివరి సినిమా జన నాయగన్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. తొలి రోజు రూ. 40 కోట్లకు పైగా ఓపెనింగ్స్ సాధించినప్పటికీ, ప్రతికూల రివ్యూల వల్ల రెండో రోజే కలెక్షన్లు సగానికి పైగా పడిపోయాయి. జన నాయకుడు 2 డేస్ వివరాలు చూద్దాం.
Jana Nayagan 2 Days Worldwide Box Office Collection: తమిళ సినీ పరిశ్రమలో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ జూలై 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. విజయ్ తమిళనాడు సీఎం అయిన వేళ ఆయన కెరీర్‌లోనే చివరి సినిమా కావడంతో అభిమానులు ఈ ప్రాజెక్ట్‌పై కొండంత ఆశలు పెట్టుకున్నారు.

నెగెటివ్ టాక్ రావడంతో
అయితే తొలి ఆట నుంచే జన నాయకుడు సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రముఖ ట్రేడ్ పోర్టల్ గణాంకాల ప్రకారం, జన నాయగన్ చిత్రం మొదటి రోజు భారతదేశంలో రూ. 42.70 కోట్ల నికర (Net) వసూళ్లను సాధించింది.
అయితే సాధారణ ప్రేక్షకుల నుంచి పెదవి విరుపులు ఎదురవ్వడంతో శుక్రవారం (జూలై 24) నాటి వసూళ్లు దారుణంగా పడిపోయాయి. మొదటి శుక్రవారం అంటే రెండో రోజున జన నాయకుడు సినిమా కలెక్షన్లు ఏకంగా 50.5 శాతం క్షీణించాయి. రెండో రోజున దేశవ్యాప్తంగా 12,190 షోల ద్వారా కేవలం రూ. 21.15 కోట్ల నికర వసూళ్లను మాత్రమే రాబట్టగలిగింది ఈ మూవీ.
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర నిరాశ!
దళపతి విజయ్ నటించిన గత చిత్రాలైన 'మాస్టర్', 'లియో', 'వారసుడు' వంటి సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ చేశాయి. కానీ 'జన నాయకుడు' విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. డివైడ్ టాక్ కారణంగా మన దగ్గర ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపడం లేదు.
శుక్రవారం వచ్చిన వసూళ్లలో సింహభాగం తమిళ వెర్షన్ నుంచే (రూ. 17.95 కోట్లు) రాగా, హిందీలో రూ. 1.85 కోట్లు, తెలుగు వెర్షన్ నుంచి అతి తక్కువగా రూ. 1.35 కోట్లు మాత్రమే నమోదయ్యాయి. దీంతో రెండు రోజులకు కలిపి భారతదేశ వ్యాప్తంగా మొత్తం నికర వసూళ్లు రూ. 63.85 కోట్లకు (గ్రాస్ రూ. 75 కోట్లు) చేరుకున్నాయి.
అలాగే, ప్రపంచవ్యాప్తంగా 2 రోజుల్లో జన నాయగన్ సినిమాకు రూ. 112.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ సంస్థలు ప్రకటించాయి. ఇందులో ఓవర్సీస్ నుంచి రూ. 37.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ఉన్నాయి. అయితే, రెండో రోజున ఓవర్సీస్‌లో జన నాయగన్ సినిమా రూ. 10 కోట్ల వరకు సాధించింది.
థియేటర్లలో కోలాహలం ఉన్నా కంటెంట్ వీక్!
కాగా, చెన్నైలోని వుడ్‌లాండ్స్, క్యాసినో థియేటర్ల వద్ద విజయ్ అభిమానులు లేజర్ షోలు, డ్యాన్సులతో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. నటుడు రవి మోహన్ సహా పలువురు ప్రముఖులు మొదటి రోజే సినిమా చూసి సందడి చేశారు.
హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. జైలు ఖైదీగా ఉన్న వెట్రి (విజయ్), జైలర్ కుమార్తెను తన సొంత బిడ్డలా పెంచుతూ ఆమెను ఆర్మీలోకి పంపే క్రమంలో ఎదుర్కొన్న సంఘటనల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
ఆలస్యంగా థియేటర్‌లోకి
మొదట ఈ ఏడాది జనవరిలోనే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, సెన్సార్ బోర్డు (CBFC) చిక్కుల వల్ల కొన్ని నెలలు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుమారు 3 గంటల నిడివితో వచ్చిన ఈ కథలో సరైన భావోద్వేగాలు కొరవడటంతో, విజయ్ చివరి సినిమాను సరిగ్గా వాడుకోలేకపోయారనే అసంతృప్తి అభిమానుల్లో వ్యక్తమవుతోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


