OTT Horror: ఓటీటీలో ఈ వారం టాప్ 7 ఇంట్రెస్టింగ్ హారర్ థ్రిల్లర్స్- తెలుగులో 3, ఒకేదాంట్లో 3- నెట్‌ఫ్లిక్స్ టు ప్రైమ్!
Top 7 OTT Horror Movies To Watch This Week: వీకెండ్‌లో భయపెట్టే సినిమాలు చూడాలనుకునే వారి కోసం టాప్ 7 ఇంట్రెస్టింగ్ హారర్ థ్రిల్లర్స్ వచ్చేశాయి. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, లయన్స్ గేట్ ప్లేలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న ఈ టాప్ హారర్ థ్రిల్లర్స్ కథనాలు, ఐఎమ్‌డీబీ రేటింగ్స్ పూర్తి వివరాలు మీకోసం.
Top 7 OTT Horror Movies To Watch This Week: వారాంతం వచ్చిందంటే చాలు సస్పెన్స్, హారర్ ఎలిమెంట్స్ ఉండే చిత్రాలను వీక్షించేందుకు ఓటీటీ ప్రియులు ఆసక్తి చూపుతుంటారు. ఈ వారం ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్స్‌కు సర్వైవల్, బ్లాక్ కామెడీ వంటి అదనపు హంగులు అద్ది టాప్ 7 ఇంట్రెస్టింగ్ సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి.

టాప్ 7 ఓటీటీ హారర్ థ్రిల్లర్స్
తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులోకి వచ్చిన చిత్రాలతో పాటు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ టాప్ 7 ఓటీటీ హారర్ థ్రిల్లర్ సినిమాల స్టోరీలు, వాటిని ఎందుకు చూడాలో చెప్పే కారణాలు, ఐఎమ్‌డీబీ రేటింగ్‌తోపాటు తెలుసుకుందాం.
అమెజాన్ ప్రైమ్ వీడియో: మైండ్ బ్లోయింగ్ హారర్ లైనప్
ది వాకింగ్ డెడ్: డెడ్ సిటీ సీజన్ 3
పోస్ట్ అపోకలిప్టిక్ ప్రపంచంలో జాంబీల బీభత్సాన్ని ప్రతిబింబించే ఈ ఓటీటీ సిరీస్ ప్రేక్షకులకు నిద్ర లేకుండా చేయడం ఖాయం అని చెప్పొచ్చు. మ్యాగీ, నెగన్ పాత్రల మధ్య సాగే ఉత్కంఠభరిత పోరాటం ఈ సీజన్‌లో మరో స్థాయికి చేరింది. హారర్ డ్రామాలు, సర్వైవల్ సీన్లు ఇష్టపడేవారికి ఇది పర్‌ఫెక్ట్ ఛాయిస్.
ఐఎమ్‌డీబీ రేటింగ్: 7.2/10
ఎందుకు చూడాలి?: విజువల్ ఎఫెక్ట్స్, జాంబీ దాడి సన్నివేశాలు థ్రిల్లింగ్, గూస్‌బంప్స్ తెప్పిస్తాయి.
ఘోస్ట్ ట్రైన్ (తెలుగు డబ్బింగ్)
దక్షిణ కొరియా హారర్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. అర్థరాత్రి ఒక నిగూఢమైన రైలు ప్రయాణంలో జరిగే భయానక సంఘటనల సమాహారంగా ఈ సెమీ ఆంథాలజీ చిత్రం రూపొందింది.
ఐఎమ్‌డీబీ రేటింగ్: 6.5/10
ఎందుకు చూడాలి?: సైకలాజికల్ థ్రిల్, ఊహించని జంప్ స్కేర్స్, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ కొరియన్ హారర్ థ్రిల్లర్ సినిమా అభిమానులను అలరిస్తుంది.
ది డెవిల్స్ మౌత్ (తెలుగు డబ్బింగ్)
సముద్రపు లోతుల్లోని గుహల్లో చిక్కుకున్న కొంతమంది స్నేహితులు అక్కడి క్రూరమైన జీవుల నుంచి ఎలా ప్రాణాలు దక్కించుకున్నారనేది ఈ కథనం. చీకటి గుహలో రాక్షస చేప సాగించే వేట వణుకుపుట్టిస్తుంది.
ఐఎమ్‌డీబీ రేటింగ్: 6.1/10
ఎందుకు చూడాలి?: ఊపిరి బిగబట్టించే సర్వైవల్ హారర్ సీన్లు, అడ్వెంచర్ ఎలిమెంట్స్, ఫ్రెండ్షిప్, లవ్, మోసం వంటి అంశాలు ఈ చిత్రానికి ప్రధాన బలం.
కిక్కించే హారర్ సస్పెన్స్ డ్రామాలు:
బ్లడీ స్మార్ట్ (నెట్‌ఫ్లిక్స్)
మాండరిన్ భాషలో వచ్చిన ఈ డార్క్ ఫాంటసీ సిరీస్ మిస్టరీ, మంత్ర శక్తుల నేపథ్యంతో సాగుతుంది. ఒక వింత రహస్యాన్ని ఛేదించే క్రమంలో పాత్రలకు ఎదురయ్యే అనుభవాలు వెన్నులో వణుకు పుట్టిస్తాయి.
ఐఎమ్‌డీబీ రేటింగ్: 6.8/10
ఎందుకు చూడాలి?: సరికొత్త కాన్సెప్ట్, డార్క్ ఫాంటసీ ఎలిమెంట్స్ థ్రిల్ కలిగిస్తాయి.
షేక్, రాటిల్ అండ్ రోల్ ఈవిల్ ఆర్జిన్స్ (నెట్‌ఫ్లిక్స్)
దుష్ట శక్తులు, దెయ్యాల పుట్టుక ఆధారంగా తెరకెక్కిన ఈ ఆంథాలజీ చిత్రం హారర్ లవర్స్‌కు మంచి విందు ఇస్తుంది.
ఐఎమ్‌డీబీ రేటింగ్: 5.9/10
ఎందుకు చూడాలి?: వేర్వేరు కథలతో సాగే దెయ్యాల సన్నివేశాలు భయాన్ని కలిగిస్తాయి.
చుమ్ (లయన్స్ గేట్ ప్లే - తెలుగు డబ్బింగ్)
సముద్రంలో చిక్కుకున్న తర్వాత షార్క్‌ల దాడి నుంచి బయటపడేందుకు సాగించే సుదీర్ఘ పోరాటమే 'చుమ్'. ఇది కూడా ది డెవిల్స్ మౌత్ వంటి అడ్వెంచర్ సర్వైవల్ ఎలిమెంట్స్‌తో సాగుతుంది.
ఐఎమ్‌డీబీ రేటింగ్: 6.3/10
ఎందుకు చూడాలి?: సముద్రపు అడుగున చిత్రీకరించిన అడ్వెంచర్, సర్వైవల్ డ్రామా, బోన్‌లో మనుషులను సొరచేపలకు ఆహారంగా పడేసే సీన్లు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.
ముబి ఓటీటీ ప్రత్యేక చిత్రం: ఏ యూజ్‌ఫుల్ ఘోస్ట్
సాధారణ దెయ్యాల సినిమాలకి భిన్నంగా థాయ్ భాషలో వచ్చిన ఈ బ్లాక్ కామెడీ హారర్ రొమాంటిక్ చిత్రం సరికొత్త అనుభూతిని ఇస్తుంది. చనిపోయిన భార్య ఆత్మగా మారి తన భర్తకు సహాయం చేయడం ఈ కథలో ముఖ్యాంశం.
ఐఎమ్‌డీబీ రేటింగ్: 6.7/10
ఎందుకు చూడాలి?: భయంతో పాటు కాస్త హాస్యం, అనురాగం కలబోసిన విభిన్నమైన కథాంశం. హారర్ సీన్లతోపాటు కాస్తా కామెడీ, రొమాంటిక్ ఎలిమెంట్స్ ఎంజాయ్ చేసేవారికి ఇది మంచి ఆప్షన్.
| సినిమా / వెబ్ సిరీస్ పేరు | ఓటీటీ ప్లాట్‌ఫామ్ | భాష & జోనర్ | ఓటీటీ రిలీజ్ డేట్ |
|---|---|---|---|
| ది వాకింగ్ డెడ్: డెడ్ సిటీ (సీజన్ 3) | అమెజాన్ ప్రైమ్ | ఇంగ్లీష్ (సైన్స్ ఫిక్షన్ జాంబీ హారర్) | జూలై 26 |
| ఏ యూజ్‌ఫుల్ ఘోస్ట్ | ముబి (Mubi) | థాయి (హారర్ రొమాంటిక్ ఫాంటసీ) | జూలై 26 |
| ఘోస్ట్ ట్రైన్ | అమెజాన్ ప్రైమ్ | తెలుగు డబ్బింగ్ - సౌత్ కొరియన్ (హారర్ మిస్టరీ) | జూలై 28 |
| బ్లడీ స్మార్ట్ | నెట్‌ఫ్లిక్స్ | మాండరిన్ (హారర్ డార్క్ ఫాంటసీ సిరీస్) | జూలై 28 |
| ది డెవిల్స్ మౌత్ | అమెజాన్ ప్రైమ్ | తెలుగు డబ్బింగ్ - ఇంగ్లీష్ (సర్వైవల్ థ్రిల్లర్) | జూలై 29 |
| షేక్, రాటిల్ అండ్ రోల్ ఈవిల్ ఆర్జిన్స్ | నెట్‌ఫ్లిక్స్ | ఇంగ్లీష్ (హారర్ అంథాలజీ) | జూలై 30 |
| చుమ్ | లయన్స్ గేట్ ప్లే | తెలుగు డబ్బింగ్ - ఇంగ్లీష్ (సర్వైవల్ థ్రిల్లర్) | జూలై 31 |
వీకెండ్‌కు బెస్ట్ ఆప్షన్
ఇలా ఈ వారం (జూలై 26 నుంచి ఆగస్ట్ 2 వరకు) చూసేందుకు టాప్ 7 ఇంట్రెస్టింగ్ హారర్ థ్రిల్లర్స్ ఓటీటీలోకి వచ్చాయి. వీటిలో 3 ఒక్క అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే, తెలుగులో కూడా 3 ఓటీటీ రిలీజ్ అయ్యాయి. కాబట్టి ఈ సినిమాలు ఈ వీకెండ్ చూసేందుకు బెస్ట్ ఆప్షన్.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


