Jio OTT Pass: జియో బంపర్ ఆఫర్- ఒక్క రీఛార్జ్‌తో 15 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, యూట్యూబ్ ప్రీమియం ఫ్రీ, అన్‌లిమిటెడ్ 5జీ!

Jio OTT Pass New Plans Launched: రిలయన్స్ జియో తమ వినియోగదారుల కోసం త్రైమాసిక, వార్షిక వ్యాలిడిటీతో కొత్త 'జియో ఓటీటీ-పాస్' ప్లాన్లను తీసుకొచ్చింది. 3 ధరల్లో లభించే ఈ ప్లాన్ల ద్వారా 15 రకాల ప్రీమియం ఓటీటీ యాప్‌లతో పాటు 1,000కి పైగా లైవ్ టీవీ ఛానెళ్లు, అన్‌లిమిటెడ్ 5జీ డేటాను పొందొచ్చు.

Published on: Aug 8, 2026, 13:02:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Jio OTT Pass New Plans Launched: టెలికాం రంగంలో ఎప్పటికప్పుడు సంచలనాలు సృష్టించే రిలయన్స్ జియో తమ ప్రీపెయిడ్ యూజర్లకు డిజిటల్ వినోదాన్ని మరింత చవకగా అందించేందుకు రంగం సిద్ధం చేసింది. మార్కెట్‌లో విశేష ఆదరణ పొందుతున్న 'జియో ఓటీటీ-పాస్' (Jio OTT-Pass) పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది.

జియో బంపర్ ఆఫర్- ఒక్క రీఛార్జ్‌తో 15 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, యూట్యూబ్ ప్రీమియం ఫ్రీ, అన్‌లిమిటెడ్ 5జీ!
జియో బంపర్ ఆఫర్- ఒక్క రీఛార్జ్‌తో 15 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, యూట్యూబ్ ప్రీమియం ఫ్రీ, అన్‌లిమిటెడ్ 5జీ!

డేటా యాడ్ ఆన్ ప్లాన్స్

ఇందులో భాగంగా 3 నెలలు (84 రోజులు), అలాగే ఒక సంవత్సరం (365 రోజులు) వ్యాలిడిటీతో పనిచేసే రెండు కొత్త డేటా యాడ్-ఆన్ ప్లాన్లను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ల కోసం నెలకు వేల రూపాయలు ఖర్చు చేసే వినోద ప్రియులకు ఈ ప్లాన్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

కొత్తగా వచ్చిన జియో ఓటీటీ పాస్ ప్లాన్ల వివరాలు

యూజర్ల విభిన్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ మూడు ప్రధాన విభాగాల్లో ఈ ఓటీటీ పాస్‌లను అందిస్తోంది.

రూ. 200 ఓటీటీ పాస్: 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్యాక్‌లో 30 జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అర్హత కలిగిన వినియోగదారులకు అన్‌లిమిటెడ్ 5జీ డేటా సౌకర్యాన్ని కూడా జియో ఇస్తోంది. కేవలం వాయిస్ ప్యాక్‌లు కాకుండా, ఏదైనా యాక్టివ్ బేస్ రీఛార్జ్ ఉన్న జియో చందాదారులందరూ దీనిని వినియోగించుకోవచ్చు.

రూ. 550 ఓటీటీ పాస్ (త్రైమాసిక ప్లాన్): ఇది 84 రోజుల సుదీర్ఘ వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో మొత్తం 90 జీబీ హై-స్పీడ్ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ 5జీ ప్రయోజనం పొందుతారు. 3 నెలలు లేదా అంతకంటే ఎక్కువ వ్యాలిడిటీ ఉండే బేస్ ప్లాన్ ఉన్న వినియోగదారులు ఈ రీఛార్జ్ చేసుకోవడానికి అర్హులు.

రూ. 2000 ఓటీటీ పాస్ (వార్షిక ప్లాన్): సంవత్సరం పొడవునా రీఛార్జ్ గోల లేకుండా ఉండేందుకు జియో ఈ ప్లాన్ తెచ్చింది. 365 రోజుల వ్యాలిడిటీతో ఏకంగా 365 జీబీ హై-స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ 5జీ లభిస్తుంది. ఏడాది బేస్ ప్లాన్ వాడుతున్న వినియోగదారులకు ఇది ఒక వరమని చెప్పవచ్చు.

నెలకు రూ. 1,500 విలువైన ఓటీటీ ప్రయోజనాలు!

ప్రతి జియో ఓటీటీ-పాస్ రీఛార్జ్‌పై వినియోగదారులకు దాదాపు రూ. 1,500 విలువైన ప్రీమియం డిజిటల్ కంటెంట్ ఉచితంగా లభిస్తుంది. ఇందులో ప్రధానంగా యూట్యూబ్ ప్రీమియం (YouTube Premium) సబ్‌స్క్రిప్షన్ లభించడం విశేషం. దీని ద్వారా మొబైల్, టీవీ, ట్యాబ్‌లలో యాడ్స్ లేకుండా వీడియోలు చూడటంతో పాటు బ్యాక్‌గ్రౌండ్ ప్లే, ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్స్ చేసుకోవచ్చు.

జియో హాట్‌స్టార్ టు చౌపల్

దీనితో పాటు జియో హాట్‌స్టార్ మొబైల్, అమెజాన్ ప్రైమ్ (రూ. 550, రూ. 2000 పాస్‌లపై అమెజాన్ ప్రైమ్ లైట్; రూ. 200 పాస్‌పై ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్) యాక్సెస్ దక్కుతుంది. సోనీ లివ్, జీ5, లయన్స్ గేట్ ప్లే, డిస్కవరీ+, సన్ నెక్ట్స్, ఫ్యాన్‌కోడ్, హోయ్‌చోయ్, చౌపల్, ప్లానెట్ మరాఠీ, కంచా లంకా, టైమ్స్ ప్లే, తరంగ్ ప్లస్ వంటి మరిన్ని ప్రముఖ ఓటీటీలోని కంటెంట్‌ను జియోటీవీ (JioTV) యాప్ ద్వారా నేరుగా చూడవచ్చు.

1,000కి పైగా లైవ్ టీవీ ఛానెళ్లు

కేవలం ఓటీటీ సినిమాలే కాకుండా, జియోటీవీ యాప్ ద్వారా దాదాపు 1,000కి పైగా లైవ్ టీవీ ఛానెళ్లను ప్రసారం చేసుకునే వెసులుబాటు కల్పించారు. స్టార్ ప్లస్ హెచ్‌డీ, కలర్స్ హెచ్‌డీ, సెట్ హెచ్‌డీ, సన్ టీవీ హెచ్‌డీ, డిస్కవరీ, కార్టూన్ నెట్‌వర్క్ వంటి అన్ని ప్రధాన టీవీ ఛానెళ్లు ఇందులో అందుబాటులో ఉంటాయి.

భారీగా ఓటీటీలు

ప్రస్తుతం ఈ కొత్త ఓటీటీ పాస్‌లు మైజియో (MyJio) యాప్, జియో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అన్ని అధీకృత రీటైల్ అవుట్‌లెట్లలో రీఛార్జ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఒక్క రీఛార్జ్‌తో ఇటు డేటా, అటు పదుల సంఖ్యలో ఓటీటీలు కవర్ అవుతుండటంతో వినియోగదారులు ఈ ప్లాన్లపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More