Mahesh Babu Diet: పెరుగు తినని మహేశ్ బాబు- 51 ఏళ్లలోనూయంగ్ లుక్‌ సీక్రెట్ చెప్పిన డాక్టర్లు- అదొక్కటి బాగుంటే చాలట!

Mahesh Babu Anti Ageing Diet Secret: సూపర్ స్టార్ మహేశ్ బాబు 51వ ఏట అడుగుపెట్టినా ఇంకా 20 ఏళ్ల కుర్రాడిలా కనిపించడం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని వైద్య నిపుణులు వెల్లడించారు. ఖరీదైన స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కాకుండా, ఆయన తీసుకునే ఆహార నియమాలే ఈ గ్లోకు ప్రధాన కారణమని సైంటిఫిక్ ఆధారాలతో స్పష్టం చేశారు.

Published on: Aug 9, 2026, 17:30:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Mahesh Babu Anti Ageing Diet Secret: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఆగస్టు 9తో 51వ వసంతంలోకి అడుగుపెట్టారు. వయసు పెరుగుతున్నా ఆయన ముఖంలో కొద్దిగా కూడా మార్పు రాకపోవడం, రోజురోజుకూ మరింత హ్యాండ్సమ్‌గా, గ్లామరస్‌గా మారిపోతుండటం అభిమానులను, సగటు ప్రేక్షకులను నిత్యం ఆశ్చర్యపరిచే అంశం.

పెరుగు తినని మహేశ్ బాబు- 51 ఏళ్లలోనూయంగ్ లుక్‌ సీక్రెట్ చెప్పిన డాక్టర్లు- అదొక్కటి బాగుంటే చాలట!
పెరుగు తినని మహేశ్ బాబు- 51 ఏళ్లలోనూయంగ్ లుక్‌ సీక్రెట్ చెప్పిన డాక్టర్లు- అదొక్కటి బాగుంటే చాలట!

శాస్త్రీయంగా సమాధానాలు

మహేశ్ బాబు ఎప్పటికీ అంత యంగ్‌గా ఎలా ఉండగలుగుతున్నారు? ఆయన వాడే కాస్మెటిక్స్ ఏంటి? అని ప్రతీ ఒక్కరిలో ఉండే సందేహాలకు వైద్య నిపుణులు శాస్త్రీయంగా సమాధానమిస్తున్నారు. మహేశ్ బాబు అందం వెనుక ఉన్న అసలు రహస్యం ఖరీదైన క్రీముల్లో లేదని, ఆయన ఏ ఆహార పదార్థాలకు దూరంగా ఉంటారో దానిలోనే దాగి ఉందంటున్నారు.

డెయిరీ, బర్గర్లకు ఆమడ దూరం!

గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పేస్ట్రీ, బర్గర్, పెరుగన్నం వీటిలో దేనిని ఎంచుకుంటారు? అని మహేశ్ బాబును ప్రశ్నించగా.. ఆయన ఆసక్తికర సమాధానమిచ్చారు. "నేను వీటిలో దేనినీ తినను. డెయిరీ ప్రాడక్ట్స్ (పాలు, పెరుగు), మైదా బ్రెడ్ పూర్తిగా పక్కన పెట్టేశాను. ఇక బర్గర్ల జోలికి అసలు వెళ్లను" అని మహేశ్ బాబు స్పష్టం చేశారు.

కేవలం కూరగాయలు, మొక్కల ఆధారిత స్వచ్ఛమైన ఆహారం మాత్రమే తీసుకోవడం మహేశ్‌కి అలవాటు. దీనిపై అమెరికాకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ పళనియప్పన్ మణికమ్ (డాక్టర్ పళ్) స్పందిస్తూ, మహేశ్ బాబు క్రమశిక్షణే ఆయన యవ్వనానికి కారణమని వెల్లడించారు.

"మహేశ్ బాబు బర్గర్లు తినరు, కేవలం కూరగాయలే తింటారు. ఆయన ప్రతీ ఏటా ఒకేలా ఎలా కనిపించగలుగుతున్నారని అందరూ అడుగుతుంటారు. కూరగాయలు ఎక్కువగా తినడమే ఆయన యవ్వనం వెనుక ఉన్న అసలు సీక్రెట్" అని డాక్టర్ పళ్ పేర్కొన్నారు.

పేగులు బాగుంటేనే ముఖంలో గ్లో! (Gut-Skin Axis)

మన జీర్ణవ్యవస్థకు, చర్మ సౌందర్యానికి మధ్య ఉన్న బలమైన సంబంధాన్నే వైద్య పరిభాషలో 'గట్-స్కిన్ యాక్సిస్' (Gut-Skin Axis) అంటారు. మనం కూరగాయలు తిన్నప్పుడు వాటిలో ఉండే పీచు పదార్థం (ఫైబర్) పేగుల్లో ఉండే మంచి బాక్టీరియాకు ఆహారంగా మారుతుంది.

ఈ మంచి బాక్టీరియా శరీరంలోని మంటను (Inflammation) తగ్గిస్తుంది. శరీరంలో మంట తగ్గినప్పుడు చర్మం మృదువుగా, కాంతివంతంగా మారి వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా ఉంటాయి.

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ డాక్టర్ కరణ్ రాజన్ దీనిపై విశ్లేషిస్తూ, చర్మాన్ని మెరుగుపరుచుకోవాలంటే ముందుగా జీర్ణవ్యవస్థ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. జీర్ణవ్యవస్థలో సమస్యలు ఉత్పన్నమైతే ఆ ప్రభావం నేరుగా ముఖంపై మొటిమలు, ఎరుపుదనం, ఎగ్జిమా వంటి రూపాల్లో కనిపిస్తుందని తెలిపారు.

చర్మ సౌందర్యాన్ని పెంచే 3 ముఖ్యమైన నియమాలు:

ఫైబర్ సమృద్ధిగా తీసుకోవడం: సాధారణంగా చాలామంది రోజుకు 15 గ్రాముల కంటే తక్కువ ఫైబర్ తింటారు. కానీ, పేగులు ఆరోగ్యంగా ఉండటానికి రోజుకు కనీసం 30 గ్రాముల ఫైబర్ అవసరం. ఇది ఇమ్యూనిటీని పెంచి, చర్మంలో నూనె ఉత్పత్తిని సమతుల్యం చేస్తుంది.

రంగురంగుల కూరగాయలు తినడం: క్యారెట్లు, క్యాప్సికమ్, టొమాటో వంటి రంగురంగుల కూరగాయలలో కెరోటినాయిడ్లు, పాలిఫెనాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి లోపలి నుంచే సన్‌స్క్రీన్‌లా పనిచేసి, చర్మ కణాల క్షీణతను అడ్డుకుంటాయి.

మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం: తీవ్రమైన ఒత్తిడి వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. ఇది చర్మ సమస్యలకు దారితీసి, మళ్లీ ఆ సమస్యల వల్ల మరింత ఒత్తిడికి గురయ్యేలా చేస్తుంది.

పేగుల్లోని మంచి బాక్టీరియాకు సరైన ఆహారం అందించడమే

మహేశ్ బాబులా పాలు, బ్రెడ్, బర్గర్లను పూర్తిగా వదిలేయడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ, బయటి క్రీములు పూయడం కంటే పేగుల్లోని మంచి బాక్టీరియాకు సరైన ఆహారం అందించడమే అసలైన అందాన్ని ఇస్తుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More