Mahesh Priyanka: మహేశ్ బాబు, భర్త నిక్ జోనాస్‌తో ప్రియాంక చోప్రా- ఏఎమ్‌బీలో సందడి- ఆగస్ట్ 7న వారణాసి నుంచి బిగ్ అప్డేట్!
Mahesh Babu Priyanka Chopra AMB: ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ చిత్రం 'వారణాసి' షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ దంపతులు సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో కలిసి ఏఎమ్‌బీ సినిమాలో సందడి చేశారు. ఈ అరుదైన కలయికకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Mahesh Babu Priyanka Chopra AMB: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి విజువల్ వండర్ 'వారణాసి' (Varanasi) షూటింగ్‌తో భాగ్యనగరం ప్రస్తుతం గ్లోబల్ సినిమా హబ్‌గా మారింది. ఈ ప్రతిష్టాత్మక ప్యాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన నటిస్తున్న గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం నగరంలోనే ఉంటోంది.

హైదరాబాద్‌లో ప్రియాంక చోప్రా
వారణాసి షూటింగ్ షెడ్యూల్ నుంచి చిన్న విరామం దొరకడంతో, తన భర్త నిక్ జోనాస్, కుమార్తె మాల్టీ మేరీలతో కలిసి హైదరాబాద్‌లో సరదాగా సమయాన్ని గడుపుతోంది ప్రియాంక చోప్రా. ఈ క్రమంలోనే గచ్చిబౌలిలోని ప్రముఖ ఏఎమ్‌బీ సినిమాలో మహేశ్ బాబుతో కలిసి ప్రియాంక-నిక్ జంట నిర్వహించిన మూవీ నైట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఏఎమ్‌బీ సినిమాస్‌లో స్టార్ల సందడి
ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్, మహేశ్ బాబు ముగ్గురూ కలిసి దిగిన ఫొటోను AMB సినిమాస్ యాజమాన్యం సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకుంది. "గ్లోబ్ ట్రోటర్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు, 'దేశీ గర్ల్' మందాకిని ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్‌లకు ఆతిథ్యం ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది" అని థియేటర్ వర్గాలు ఆ పోస్ట్‌లో పేర్కొన్నాయి.
అంతేకాకుండా '7' ఎమోజీని జోడించి, త్వరలోనే 'వారణాసి' సినిమా నుంచి ఒక బిగ్ అప్‌డేట్ రాబోతోందనే ఆసక్తికర సంకేతాన్ని కూడా ఇచ్చాయి. ఈ ఫొటోలో ప్రియాంక ఐవరీ కలర్ టాప్‌లో ఎంతో స్టైలిష్‌గా కనిపించగా, మహేశ్ బాబు బ్లాక్ టీషర్ట్, క్యాప్‌తో క్యాజువల్ లుక్‌లో అలరించారు.
"రాజమౌళి ఫోన్ చేయగానే ఓకే చెప్పా"
ఇటీవలే ప్రముఖ 'జోనాస్ బ్రదర్స్ పాడ్‌కాస్ట్'లో పాల్గొన్న ప్రియాంక చోప్రా 'వారణాసి' సినిమా విశేషాలను పంచుకున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం తాను గత 14 నెలలుగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. "ఎస్.ఎస్. రాజమౌళి సర్ స్వయంగా నాకు ఫోన్ చేసి ఈ కథ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా, విభిన్న కాలాల్లో సాగే ఒక అద్భుతమైన అడ్వెంచర్ డ్రామా ఇది. ఇందులో నా పాత్ర కోసం చాలా స్లోమోషన్ యాక్షన్ సీన్స్, జంప్స్ చేశాను" అని ప్రియాంక చెప్పుకొచ్చారు.
కథేంటంటే?
'శాంధవి' అనే ఒక పెద్ద ఉల్క భూమిని ఢీకొట్టిన తర్వాత సంభవించే వినాశనం, ఆ తర్వాతి పరిణామాల నేపథ్యంలో రాజమౌళి ఈ కథను మలిచారు. పోగొట్టుకున్న ఒక కాస్మిక్ అస్త్రాన్ని వెతికే క్రమంలో విభిన్న కాలాలు, ఖండాల గుండా ప్రయాణించే 'రుద్ర' అనే శివ భక్తుడి పాత్రలో మహేశ్ బాబు నటిస్తున్నారు.
ప్రపంచాన్ని తన గుప్పిట్లో ఉంచుకోవాలని చూసే విలన్ 'కుంభ' పాత్రలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపిస్తారు. పురాణ కాలపు రహస్యాలను ఛేదించడంలో రుద్రుడికి సాయపడే 'మందాకిని' అనే కీలక పాత్రను ప్రియాంక చోప్రా పోషిస్తున్నారు.
రూ. 1400 కోట్ల బడ్జెట్
దాదాపు రూ. 1,200 కోట్ల నుంచి రూ. 1,400 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్న వారణాసి చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


