Varanasi France: ఫ్రాన్స్ రాజధానిలో వారణాసి గ్లింప్స్- మహేశ్ బాబు ఎంట్రీకి ఫ్రెంచ్ ఆడియెన్స్ రియాక్షన్ ఎలా ఉందంటే?

Mahesh Babu Varanasi Glimpse France Audience: రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న 'వారణాసి' గ్లింప్స్‌ను ఫ్రాన్స్ దేశం రాజధాని అయని పారిస్‌లో ప్రదర్శించారు. ఆర్ఆర్ఆర్ స్పెషల్ ప్రీమియర్ అనంతరం వారణాసి గ్లింప్స్ చేయగా ఫ్రెంచ్ ఆడియెన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

Published on: Jun 27, 2026, 09:44:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Mahesh Babu Varanasi Glimpse France Audience: 'బాహుబలి', 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలకు ఆస్కార్ స్థాయి గుర్తింపు తెచ్చి, టాలీవుడ్ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన తదుపరి భారీ అడ్వెంచర్ ప్రాజెక్ట్ 'వారణాసి' (Varanasi) తో అంతర్జాతీయ ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నారు.

ఫ్రాన్స్ రాజధానిలో వారణాసి గ్లింప్స్- మహేశ్ బాబు ఎంట్రీకి ఫ్రెంచ్ ఆడియెన్స్ రియాక్షన్ ఎలా ఉందంటే?
ఫ్రాన్స్ రాజధానిలో వారణాసి గ్లింప్స్- మహేశ్ బాబు ఎంట్రీకి ఫ్రెంచ్ ఆడియెన్స్ రియాక్షన్ ఎలా ఉందంటే?

సైన్స్ ఫిక్షన్ డ్రామా

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ పాన్-ఇండియా సైన్స్ ఫిక్షన్ డ్రామాపై అటు అభిమానుల్లో, ఇటు చిత్ర పరిశ్రమలో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం యూరప్ పర్యటనలో ఉన్న రాజమౌళి, అక్కడ తన సినిమాల ప్రత్యేక ప్రదర్శనలతో పాటు ఈ కొత్త చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్‌ పంచుకుంటూ గ్లోబల్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్నారు.

ఫ్రెంచ్ ఆడియెన్స్‌ను మెప్పించిన మహేశ్ బాబు లుక్

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రముఖ 'లా సినెమాటెక్ ఫ్రాంకైస్' థియేటర్‌లో జూన్ 26న (శుక్రవారం) ఆర్‌ఆర్‌ఆర్ సినిమా స్పెషల్ ప్రీమియర్ ఏర్పాటు చేశారు. ఈ స్క్రీనింగ్ ముగిసిన వెంటనే ప్రేక్షకులకు ఒక ఊహించని సర్‌ప్రైజ్ లభించింది.

మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న 'వారణాసి'తో పాటు 'బాహుబలి: ది ఎటర్నల్ వార్ పార్ట్ 1' చిత్రాలకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ గ్లింప్స్‌ను వెండితెరపై ప్రదర్శించారు. స్క్రీన్‌పై మహేశ్ బాబు మాస్ ఎంట్రీ ఇవ్వడమే ఆలస్యం.. థియేటర్‌లోని ఫ్రెంచ్ ప్రేక్షకులు ఒక్కసారిగా ఈలలు, కేకలు వేస్తూ చప్పట్లతో మార్మోగించారు.

నమ్మశక్యం కాని అనుభూతి

వారణాసి గ్లింప్స్ ప్రదర్శన ముగిసిన తర్వాత కూడా చాలా సేపటి వరకు చప్పట్లు కొడుతూ తమ ఉత్సాహాన్ని చాటారు. ఈ అద్భుతమైన క్షణాలకు సంబంధించిన వీడియోను 'వారణాసి' అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చిత్ర బృందం పంచుకుంది.

"భారతదేశానికి వేల మైళ్ల దూరంలో ఉన్న ఫ్రాన్స్‌లోని అన్నెసీ నగరంలో.. వందలాది మంది ఫ్రెంచ్ ప్రేక్షకులు ఆర్‌ఆర్‌ఆర్ స్క్రీనింగ్‌కు వచ్చారు. అక్కడ 'వారణాసి' గ్లింప్స్‌కు వచ్చిన రెస్పాన్స్, చప్పట్లు నిజంగా నమ్మశక్యం కాని అనుభూతిని ఇచ్చాయి" అని చిత్ర బృందం ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది.

యూరప్ పర్యటనలో రాజమౌళి బిజీ బిజీ

రాజమౌళి యూరప్ పర్యటన జూన్ 26న పారిస్‌లో ఆర్‌ఆర్‌ఆర్ స్క్రీనింగ్‌తో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ టూర్‌లో భాగంగా ఆయన 'ఈగ', 'బాహుబలి' చిత్రాల ప్రదర్శనలతో పాటు మాస్టర్‌క్లాస్‌లు, అంతర్జాతీయ అభిమానుల సమావేశాల్లో పాల్గొంటున్నారు. జూన్ 27న పారిస్‌లో బాహుబలి ప్రదర్శన అనంతరం ప్రముఖ హాలీవుడ్ మేకర్ క్రిస్టోఫ్ గాన్స్‌తో కలిసి రాజమౌళి ప్రత్యేక మాస్టర్‌క్లాస్ నిర్వహించనున్నారు.

ఆ తర్వాత స్విట్జర్లాండ్‌లోని న్యూచాటెల్ నగరంలో మాస్టర్‌క్లాస్ నిర్వహించడంతో పాటు అక్కడి ప్రతిష్టాత్మక నిఫ్ (NIFF) అవార్డుల ప్రధానోత్సవానికి హాజరవుతారు. ఈ పర్యటనలో జరిగే ప్రతి స్క్రీనింగ్‌లోనూ 'వారణాసి' సరికొత్త ట్విస్ట్ వీక్షకులను అలరించనుంది. జూలై 4న స్విట్జర్లాండ్‌లో జరిగే మాస్టర్‌క్లాస్‌తో ఈ యూరప్ పర్యటన ముగుస్తుంది.

టైమ్ ట్రావెల్ కథతో వారణాసి

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 'వారణాసి' చిత్రం టైమ్ ట్రావెల్ (కాల ప్రయాణం) నేపథ్యంలో సాగే ఒక భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా. ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తుండగా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా చేస్తున్నారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ప్రియాంక చోప్రా మళ్లీ భారతీయ తెరపై కనిపిస్తున్న ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం.

గత ఏడాది హైదరాబాద్‌లో జరిగిన ఒక భారీ ఈవెంట్‌లో వారణాసి సినిమా మొదటి గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలోని ఒక కీలక సన్నివేశంలో మహేశ్ బాబు 'శ్రీరాముడి' పాత్రలో కనిపించనున్నారని రాజమౌళి ఇప్పటికే స్పష్టం చేశారు.

ప్రస్తుతం చురుగ్గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్ నెలలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More